Switch to English

వెంకటేష్ – నాగ చైతన్యల “వెంకీ మామ” మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు
నిర్మాత: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌దర్శకత్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ)
సినిమాటోగ్రఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
మ్యూజిక్: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
ఎడిటర్‌: ప‌్ర‌వీణ్ పూడి
విడుదల తేదీ: డిసెంబర్ 13, 2019

రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లయినా విక్ట‌రీ వెంక‌టేష్ – యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్యలు కలిసి మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద మామ అల్లుళ్లుగా చేసిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘వెంకీ మామ’. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా, కెఎస్ రవీంద్ర ఆలియాస్ బాబీ డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల హై డ్రామా తర్వాత వెంకటేష్ బర్త్ డే కానుకగా నేడు అనగా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మామ అల్లుళ్ళ ఆన్ స్క్రీన్ అల్లరి ఎంత వరకూ ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ: 

జాతకాల్ని బలంగా నమ్మే ఊరి పెద్ద నాజర్ కి ఇద్దరు సంతానం. అందులో కుమార్తె చెప్పినా వినకుండా ప్రేమ వివాహం చేసుకొని చనిపోతుంది. కానీ వారి కొడుకైన కార్తీక్(నాగ చైతన్య) బాధ్యతలని తన మామయ్య అయిన వెంకీ(వెంకటేష్) తీసుకుంటాడు. అలా చాలా క్లోజ్ గా పెరిగిన మామ అల్లుళ్ళు ఒక స్టేజ్ లో ప్రేమలో పడతారు. వెంకీ ఆ ఊరి స్కూల్ టీచర్ వెన్నెల (పాయల్ రాజ్ పుత్)తో ప్రేమలో పడితే, కార్తీక్ ఆ ఊరి ఎమ్మెల్యే కూతురు హారిక(రాశీ ఖన్నా)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మామ అల్లుడు మధ్య వచ్చిన ఒక చిన్న చిన్న అపార్ధాల వలన కార్తీక్ మామయ్యని వదిలేసి మిలిటరీకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి మామ అల్లుళ్ళ కథ ఏమైంది? మళ్ళీ మామ అల్లుడు కలిసారా? లేదా? ఒకవేళ కలవాల్సి వస్తే ఎలాంటి సందర్భంలో కలిశారు? అసలు వీరిద్దరి విడిపోవడానికి అసలు కారణం ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానం కావాలంటే ‘వెంకీ మామ’ చూడాల్సిందే.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ఈ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చిన హైలైట్ పాయింట్: విక్టరీ వెంకటేష్ – యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ అనే చెప్పాలి. వాళ్ళ రియల్ లైఫ్ ఎమోషన్ ని ఆన్ స్క్రీన్ మీద ఆవిషరించబోతున్నారు అనే పాయింట్ థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అలాగే సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్  వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా మామ – అల్లుడు కాంబినేషన్ లో వచ్చే లవ్ స్టోరీ సీన్స్ బాగానే నవ్విస్తాయి. అలాగే ఇద్దరికీ ఇచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ కి రోమాలు నిక్కబొడుచుకునే హై ఫీలింగ్ ని కలిగిస్తుంది. ఇక సెకండాఫ్ లో అక్కడక్కడా ట్విస్టులు పరవాలేధనిపిస్తాయి.

విక్టరీ వెంకటేష్ మరోసారి తనలోని ఈజ్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వింటేజ్ మార్క్ కామెడీ మరోసారి ప్రేక్షకులకి ఇవ్వడంలో వెంకటేష్ సక్సెస్ అయ్యాడు. నాగ చైతన్య లుక్ మరియు చాలా జోష్ తో ఈ క్యారెక్టర్ చేసాడనేది మనకు కనిపిస్తుంది. ఇక హైపర్ ఆది కొన్ని పంచ్ లు బాగానే పేలాయి. వెంకటేష్ – పాయల్ రాజ్ పుత్ ట్రాక్ మనకు కొన్ని నవ్వుల్ని పంచుతుంది. ఇక హీరోయిన్స్ రాశీ ఖన్నా – పాయల్ రాజ్ పుత్ లు ఉన్నంతలో బాగా చేశారు. ఇద్దరి గ్లామర్ కూడా బి, సి సెంటర్ ఆడియన్స్ కి అట్రాక్షన్ గా అనిపిస్తుంది.

ఆఫ్ స్క్రీన్:  

ప్రసాద్ మురెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ చాలా డీసెంట్ గా ఉంది. మెయిన్ గా ఇంటర్వల్ బ్లాక్ ని చాలా బాగా షూట్ చేశారు. అలాగే కొన్ని సన్నివేశాల్ని థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. బ్రహ్మకడలి సెట్స్ బాగున్నాయి. అలాగే రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఇంటర్వల్ యాక్షన్ బ్లాక్ అదిరిపోయింది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

‘వెంకీ మామ’ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి – ప్రమోషన్స్ వరకూ గొప్పగా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరూ ఆనంద భాష్పాలతో బయటకి వచ్చేలా ఎమోషన్ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అవి మాటలుగానే మిగిలిపోయాయే తప్ప సినిమా పరంగా ఎమోషనల్ గా అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమాకి కీ ఎలిమెంటే ఎమోషన్, కానీ అదే వర్క్ అవుట్ అవ్వలేదు, అలాగే 20 ఏళ్ళ క్రితం చూపించేసిన ఎమోషన్ కి మల్లి కలర్స్ అద్ది చూపించాలని ప్రయత్నించినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. అలాగే వెంకీ – చైతన్య చూడటానికి బాగున్నారు కానీ వీరిద్దరి మధ్య ఎమోషన్ ని స్ట్రాంగ్ గా చూపించకపోవడం వలన ఇద్దరికీ పెద్దగా కనెక్ట్ అవ్వము. ఎదో వెళ్తోంది, లోపలి వచ్చేసాం కాబట్టి చూస్తున్నాం అనే ఫీలింగ్ లో చూస్తుంటాం.

ఇక డైరెక్టర్ ఎమోషన్ పాతదైనా దాని ట్రీట్మెంట్ కొత్తగా రాసుకోకపోగా, మరీ బోరింగ్ అండ్ పాత చితకాయపచ్చడి స్టైల్ కామెడీ, ఎమోషన్ రాసుకోవడం వలన ప్రేక్షకులు ఏంటి..? దీనికి మేము నవ్వాలా అని చిరాకు పడేలా కామెడీ ఉంది. ఎమోషన్ ఏమో సిల్లీగా ఉంది. అలాగే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చిన కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేసిన ఆర్మీ ఎపిసోడ్ మొత్తం సినిమాని ఇంకా నీరు గార్చేలా తీశారు. ట్రైలర్ లో ఇచ్చిన చైతూ డైలాగ్ లో ఉన్నంత మాటర్ కూడా ఓవరాల్ ఆర్మీ ఎపిసోడ్ లో ఉండదు. లవ్ ట్రాక్స్ పెద్దగా కనెక్ట్ అవ్వవు. అలాగే మామ – అల్లుడు మధ్య వచ్చే సమస్యలు కూడా చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త అటుఇటుగా చూసేసిన పరమ బోరింగ్ సెకండాఫ్ ని భరించడం చాలా కష్టమే సుమీ..

ఆఫ్ స్క్రీన్:  

‘వెంకీ మామ’ సినిమాకి వెంకీ – చైతన్య కాంబో ఎంత పెద్ద ప్లస్సో, వీరిద్దరి కోసం రాసిన కథ అంత పెద్ద మైనస్. ఇలాంటి కథల్ని మనం గత మూడు తరాలుగా చూస్తూనే ఉన్నాం. అలాగే కథలో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ది బెస్ట్ అనుకునేది లేదు. వివేక్ కూచిబొట్ల కాంబినేషన్ సెట్ చేయడం కోసం, మామ అల్లుడు సినిమా వచ్చి చాలా రోజులైంది అనేది క్యాష్ చేసుకోవడం కోసం ఈ స్టోరీ పిక్ చేసాడనిపిస్తుంది. పోనీ అది వదిలేద్దాం అనుకున్నా డైరెక్టర్ బాబీ చేసిన ట్రీట్మెంట్ అంతకన్నా ఓల్డ్ గా ఉండడం గమనార్హం. కమర్షియల్ అనే దానికి రియల్ డెఫినిషన్ తెలియకో లేదా మాకు ఇదే వచ్చు అనే దాని నుంచి బయటకి రాకుండా అదే మూస పద్దతిలో కథనాన్ని తయారు చేశారు. ప్రతి మలుపు, ప్రతి సీన్ ని ఆడియన్స్ ముందే చెప్పేయగలరు. కథనం మరియు సీన్ ని కొత్తగా చెప్పే విషయంలో ఆడియన్స్ డెవలప్ అయ్యారు అనే విషయాన్ని ఇంకా రియలైజ్ కాకపోవడం వలన ఈ ఓల్డ్ ఫార్మాట్ ఫాలో అయ్యి బాబీ తన చేతులు తానే కాల్చుకున్నాడు. డైరెక్టర్ గా బాబీ ఈ సినిమా విషయంలో సక్సెస్ అయిన ఒకే ఒక్క ఎపిసోడ్ ఇంటర్వల్ బ్లాక్ మాత్రమే. ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రం పేపర్ మీద కన్నా విజువల్ గా బాగా చెబితే, మిగిలిన సీన్స్ అన్నీ పేపర్ మీదకన్నా వరస్ట్ గా చెప్పారు. దిగ్గజాలు అని చెప్పుకునే చాలా మంది కలిసి పనిచేసినా బెటర్ కథ – కథనం – దర్శకత్వాన్ని అందిచలేకపోయిన సినిమా వెంకీ మామ.

ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో చాలా లాగ్ కనిపిస్తుంది. చాలా సీన్స్ లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ లెంగ్త్ ఉంచేసి బోర్ కొట్టిస్తాడు. ఓవరాల్ గా కూడా కథగా కన్నా వారికి నచ్చిన సీన్స్ ని అతికించారు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సురేష్ బాబు – టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌ లు బాగానే ఖర్చు పెట్టారు, కానీ కనేంట్ లేని రొట్ట సినిమాకి ఇంత పెట్టడం వృధా అనే విషయాన్ని గ్రహించలేకపోయారు.

విశ్లేషణ: 

చాలా రోజుల తర్వాత మామ – మేనల్లుడు బ్యాక్ డ్రాప్ సినిమా, అది కూడా రియల్ లైఫ్ మామ అల్లుళ్లయిన విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్య లు కలిసి చేస్తున్నారు అనే హైప్ తో వచ్చిన ‘వెంకీ మామ’ సినిమాని చూసాక ప్రేక్షకులకి కలిగే ఫస్ట్ ఫీలింగ్, ఈ కాంబినేషన్ లో సినిమా అని వినగానే వచ్చిన ఫీల్ లో సగం కూడా రెండున్నర గంటల సినిమా చూసాక రాలేదేందబ్బా అని షాక్ లో ఉంటారు. కాంబినేషన్లో క్రేజ్ తప్ప – కంటెంట్ లో సత్తాలేని సినిమాగా ‘వెంకీ మామ’ ని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా పరవాలేధనిపించినా, వరస్ట్ సెకండాఫ్ తో బోరింగ్ తో పాటు చిరాకు కూడా తెప్పించేలా చేయడం మనీ పెట్టిన ప్రేక్షకుడికి ‘వెంకీ మామ’ ఇచ్చే స్పెషల్ బోనస్. ఓవరాల్ గా బి, సి సెంటర్ ఆడియన్స్ కి కొన్ని ఎలిమెంట్స్ నచ్చే అవకాశం ఉంది కానీ ఓవరాల్ సినిమా అంటే కష్టమే. సో కాంబినేషన్ చూసి మోసపోకండి ప్రేక్షకులారా..!

ఫైనల్ పంచ్: వెంకీ మామ – మెప్పించలేకపోయిన మామ అల్లుళ్ళ సెంటిమెంట్.!

తెలుగుబుల్లెటిన్.కామ్ రేటింగ్: 2/5  

 

 

<<———— లైవ్ అప్ డేట్స్: వెంకీ మామ యుఎస్ ప్రీమియర్ షో ————>>

వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ మూవీ, యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ Dec 13th 1.30 A.M IST కి స్టార్ట్ అవుతాయి. తప్పకుండా ఈ పేజీ ని విజిట్ చెయ్యండి..

04:05AM: ఓవరాల్ రెగ్యులర్ సెంటిమెంట్ సీన్స్ తో జాతకాల కన్నా మనిషి ప్రేమ గొప్పది అని ప్రూవ్ చేసి, మామ – అల్లుళ్ళని కలిపేశారు.. కథ సుఖాంతం అయ్యింది. అలాగే చివర్లో ‘వెంకీ మామ’ సినిమాని మామ – మేనల్లుళ్ళకి డేడికేట్ చేశారు. త్వరలో పూర్తి రివ్యూ ఇస్తాం.

04:02AM: క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ అనుకున్న రేంజ్ లో లేవు.. అందుకే ఆడియన్స్ కి కూడా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వడం లేదు. చాలా వరకూ ఈ సీన్స్ ఓల్డ్ సినిమా ఫార్మాట్ లో ఉన్నాయి.

04:00AM: చైతన్య టెర్రరిస్ట్స్ ని చంపేశాడు. కానీ గాయపడిన వెంకీ – చైతన్య మధ్య ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి.

03:56AM: చైతన్య ఆవేశం కారణంగా ప్రీ క్లైమాక్స్ లో ది బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది.. టెర్రరిస్టులకు వెంకీ సీక్రెట్ మిషన్ తెలిసిపోవడంతో ఫైట్ మొదలైంది. అలాగే ఆర్మీ అండ్ టెర్రరిస్టుల మధ్య ఫైరింగ్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి.

03:54AM: ఇప్పటి వరకూ సెకండాఫ్ అనుకున్నంత బెటర్ గా వెళ్లడం లేదు. జస్ట్ సో సో గా వెళ్తోంది. ఇప్పటి వరకూ ఎమోషనల్ సీన్స్ కూడా జస్ట్ యావరేజ్ ఆనేలానే ఉన్నాయి.

03:50AM: తన అల్లుడిని సేవ్ చేయడం కోసం వెంకీ ఒక రిస్కీ మిషన్ కి ఒప్పుకుంటాడు.. దానికి సంబదించిన సీన్స్ జరుగుతున్నాయి..

03:45AM: పాక్ టెర్రరిస్ట్ మిషన్ మీద వెళ్లిన చైతన్య అక్కడ టెర్రరిస్టులకి దొరికిపోతాడు.. ఈ విషయం వెంకీకి భారీ ఆగ్రహాన్ని కలిగించింది. దాంతో అల్లుణ్ణి ఎలాగైనా సేవ్ చేయాలనుకుంటాడు. 

03:40AM: ఫ్లాష్ బ్యాక్ ఓవర్.. ప్రెజంట్ లోకి వస్తే.. చైతన్య ఏ టెర్రరిస్ట్ మిషన్ మీద వెళ్ళాడు అనేది ప్రకాష్ రాజ్ వెంకీ మామకి వివరిస్తారు.. దాంతో వెంకీకి టెన్షన్ మోడ్ స్టార్ట్ అయ్యింది.

03:32AM: మామ అల్లుళ్ళ మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ సీన్స్ వల్ల చైతన్య మామయ్యని మరియు విలేజ్ ని వదిలి వెళ్ళిపోయాడు.. కానీ అందరికీ మామ అల్లుళ్ళ మధ్య గొడవే కారణం అనేలా చెప్పిన చైతన్యకి మాత్రం మామని వదిలి వెళ్ళడానికి రియల్ రీజన్ తెలుసు.. ఎమోషనల్ గా ఈ సీన్స్ ని తీశారు.

03:25AM: మామ అల్లుళ్ళ మధ్య గ్యాప్ ని తీసుకొచ్చేలా ఎమ్మెల్యే రావు రమేష్ ప్లాన్ చేసిన కొన్ని మిస్ కమ్యూనికేషన్ సీన్స్ జరుగుతున్నాయి.. అనుకోకుండా జరిగిన స్కూల్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి వెంకీ అందరి పిల్లలని కాపాడాడు.

03:20AM: వెంకీ – చైతన్య కామెడీ సీన్స్ జరుగుతున్నాయి. అలాగ వెంకీ – పాయల్ రాజ్ పుత్ లవ్ ట్రాక్ కూడా సక్సెస్. దాంతో ఇద్దరి పెయిర్స్ మధ్య వచ్చే మాస్ సాంగ్ ‘కోకాకోలా పెప్సీ’ మొదలైంది.. మాల్స్ ఆడియన్స్ కి ఇది మంచి ఊపునిస్తుంది.

03:15AM: మిలటరీ క్యాంపు లో సెకండాఫ్ స్టార్ట్ అయ్యింది. ఫైనల్ గా ప్రకాష్ రాజ్ వెంకీ చైతన్యని చూడటానికి పర్మిషన్ ఇచ్చారు.. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ మోడ్..

03:10AM: ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: సినిమా స్టార్టింగ్ ఆసక్తిగా స్టార్ట్ చేశారు. అక్కడక్కడా వచ్చిన కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే ఇద్దరి హీరోలకి ఇచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్ ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇలా అక్కడక్కడా ఎపిసోడ్స్ బాగున్నాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే అంత ఎఫెక్టివ్ గా లేదు, చాలా కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు.

ఇక మేజర్ ఎమోషనల్ స్టోరీ అంతా సెకండాఫ్ లోనే ఉండడం వలన, సెకండాఫ్ లో వచ్చే ఫీల్ మీదే ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ డిపెండ్ అయ్యుంది.

03:08AM: సూపర్బ్ యాక్షన్ బ్లాక్ మరియు అదిరిపోయే డైలాగ్స్ తో ఇంటర్వల్ బ్లాక్ ని చాలా బాగా డిజైన్ చేశారు..

03:04AM: రావు రమేష్ సెట్ చేసిన బ్యాచ్ తో వెంకీ – చైతన్యలతో ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ జరుగుతోంది. ఈ ఫైట్ పిక్షరైజేషన్, వెంకటేష్ – నాగ చైతన్య మ్యానరిజమ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే ఇద్దరి డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి.

02:58AM: చైతన్య – రాశీ ఖన్నాల పెళ్లి కోసం వెంకీ ఎమ్మెల్యే రావు రమేష్ ఇంటికి వెళ్తాడు. కానీ రావు రమేష్ పెట్టే కండిషన్స్ కి వెంకీ ఒప్పుకోడు. ఈ సీన్ చాలా బాగుంది.

02:52AM: ఫైనల్ గా రాశీ ఖన్నా ద్వారా వెంకీ మామ చైతన్య – రాశీలు ఎందుకు విడిపోయారు అనేది తెలుసుకున్నాడు. దాంతో వెంకటేష్ – నాగ చైతన్య మధ్య ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి.

02:47AM: 1970 రెట్రో ఫీల్ లో సాగే వెంకీ – పాయల్ రాజ్ పుత్ ల ‘ఎన్నాళ్ళకో’ సాంగ్ మొదలైంది.. ఈ పాటని చాలా బాగా షూట్ చేశారు.

02:42AM: వెంకీ – పాయల్ – చైతన్య – హైపర్ ఆది మధ్య వచ్చిన కామెడీ సీక్వెన్స్ బాగుంది. థియేటర్ లో అందరినీ నవ్వించింది.

02:38AM: ఇప్పటి దాకా వెంకీ ఏమో రాశీ ఖన్నా – చైతన్య లని సెట్ చేసాయడానికి చూస్తుంటే, చైతన్య ఏమో వెంకీ – పాయల్ రాజ్ పుత్ లని సెట్ చేయడానికి చూస్తున్నాడు. ఇప్పటి వరకూ పెద్దగా కామెడీ వర్కౌట్ కాలేదు. సి సెంటర్స్ లో ఏమన్నా ఈ డబుల్ మీనింగ్ కామెడీ వర్కౌట్ అవ్వచ్చు..

02:34 AM: మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది.. వెంకీ – చమ్మక్ చంద్ర – రాశీ ఖన్నాల మధ్య సిల్లీ కామెడీ జరుగుతోంది.. పెద్దగా నవ్వుకునేలా సీన్స్ లేవు.

02:32 AM: ఫ్లాష్ బాక్ నుంచి బ్యాక్ వస్తే.. మిలిటరీలో కార్తీక్(చైతన్య) అనే పేరుతో ఎవరూ లేరని చెప్తారు. దాంతో వెంకీ మీద అనుమానం అండ్ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ. ప్రకాష్ రాజ్ తెలిసినా చైతన్య గురించి నిజం చెప్పడు..

02:30 AM: ఫ్లాష్ బ్యాక్ లో చైతన్య – రాశీ ఖన్నా లవర్స్ బట్ బ్రేకప్ అయ్యింది.. ఆ స్టోరీ వెంకీ మామకి చెప్తున్నాడు చైతన్య. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో మై సెనోరిటా సాంగ్ మొదలైంది.

02:28 AM: ప్రస్తుతం హైపర్ ఆది – హారిక – చైతన్య మీద కొన్ని రెగ్యులర్ టైపు బోరింగ్ కామెడీ సీన్స్ జరుగుతున్నాయి.

02:24 AM: ఆ ఊరు స్కూల్ ప్లేస్ లో బీర్ ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఎమ్మెల్యేగా రావు రమేష్ ఎంట్రీ.. దాంతో వెంకీ – చైతన్య కలిసి రావు రమేష్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ కమర్షియల్ గా బాగుంది. స్పెషల్ గా చైతన్య డాషింగ్ లుక్ బాగుంది. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ ‘దళపతి’ మ్యూజిక్ లానే ఉంది.

02:22 AM: హరికగా రాశీ ఖన్నా ఆ ఊరి ఎం.ఎల్. ఏ కూతురుగా రాశీ ఖన్నా ఎంటరై జరిగింది. అలాగే ఆ ఊరికి వచ్చిన టీచర్ వెన్నెల పాత్రలో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇచ్చింది. తనకి తెలుగు పెద్దగా రాదు అందుకే హిందీ మిక్సింగ్ చేసి మాట్లాడుతుంది.

02:20 AM: పెరిగి పెద్దయిన చైతన్య తన మామకి పెళ్లి చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు..

02:18 AM: వెంకీకి మిలిటరీ అంటే ఇష్టం కానీ మేనల్లుడుకి చూసుకోవడం కోసం మిలిటరీ మరియు మ్యారేజ్ ని పక్కన పెట్టేస్తాడు. దానికి సంబదించిన సెంటిమెంట్ సీన్స్ జరుగుతున్నాయి.

02:15 AM: నాగ చైతన్య తాత అయిన నాజర్ తో ఎంత బాగున్నా ఆయన మాత్రం చైతన్య ని ఇష్టపడడు. అలాగే వెంకీ ని పెళ్లి చేసుకోమని గోల పెడుతుంటాడు..

02:12 AM: సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ సాంగ్ ‘మామ మనం’ టైం..

02:10 AM: కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. నాగ చైతన్య ఎంట్రీ.. తన మామ కోసం లండన్ జాబ్ వదిలి మిలిటరీలో చేరతాడు.. అక్కడ హాలిడేస్ గ్యాప్ లో ఊరెళ్తాడు..

02:07 AM: ఆ అల్లర్లలో దొరికిన వెంకటేష్ ని ఆర్మీ పెఒప్లె అరెస్ట్ చేస్తారు.. కానీ ఇంటరాగేషన్ లో వెంకటేష్ తాను మిలిటరీలో జాయిన్ అయిన తన మేనల్లుడు కోసం వచ్చాడని చెప్తాడు.

02:03 AM: టైటిల్స్ టైంలో వెంకటేష్ చైతన్య ఆలనా పాలన చూసుకుంటున్నారు.. టైటిల్స్ ఎండ్.. కట్ చేస్తే కథ కాశ్మీర్ లో ఓపెన్ అయ్యింది. టెర్రరిస్టులు చర్చ్ మీద అటాక్ చేసి పలువురిని చంపేశారు..

01:59 AM: కానీ కొద్దీ రోజులకి కార్ యాక్సిడెంట్ లో వెంకటేష్ అక్క – బావ చనిపోతారు.. కానీ నాజర్ కి నచ్చకపోయినా, వెంకటేష్ మాత్రం మేనల్లుడు అయినా కిడ్ ని నేను చూసుకుంటానంటాడు.. అప్పుడే టైటిల్ కార్డు ‘వెంకీ మామ’ పడింది.

01:55 AM: ఎంతో ప్రేమగా పెంచిన నాజర్ కుమార్తె జాతకాలు కలవలేదని ఎంత చెప్పినా వినకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకుంటుంది. నాజర్ కొడుకే మన హీరో విక్టరీ వెంకటేష్..

01:50 AM: జాతకాలను బలంగా నమ్మే కుటుంబ పెద్ద నాజర్.. ఆయన ఆధ్వర్యంలో పలువురు జంటలకు పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.. అలాగే నాజర్ కి ఒక కూతురు మరియు ఒక కుమారుడు..

01:45 AM: రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్య మొదటిసారి స్క్రీన్ పై కూడా మామ అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ సినిమా మొదలైంది..

 

 

 

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....
నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు నిర్మాత: సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌దర్శకత్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) సినిమాటోగ్రఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌ మ్యూజిక్: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌ ఎడిటర్‌: ప‌్ర‌వీణ్ పూడి విడుదల తేదీ: డిసెంబర్ 13, 2019 రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లయినా విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్యలు కలిసి మొదటిసారి సిల్వర్ స్క్రీన్ మీద మామ అల్లుళ్లుగా చేసిన క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ 'వెంకీ మామ'. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్...వెంకటేష్ - నాగ చైతన్యల "వెంకీ మామ" మూవీ రివ్యూ