Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) ఎంటరై వీరిద్దరికీ కౌంటర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
తాను పాల్గొన్న ఫొటో షూట్ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది రీతూవర్మ. దీనిపై ప్రియదర్శి స్పందిస్తూ.. ‘వావ్ రీతూ డార్లింగ్.. నీ అందం చూస్తుంటే మాటలు రావడం లేద’ని కామెంట్ చేశాడు. దీనికి నభా నటేశ్ స్పందిస్తూ.. ‘ఇతను మళ్లీ మొదలెట్టాడు. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందరినీ డార్లింగ్ అని పిలవడమేంటి.. ఇతనికి బ్రెయిన్ పనిచేయడం లేదా‘ అని అసహనం వ్యక్తం చేసింది.
‘నీకేంటి ఇబ్బంది’ అంటూ ప్రియదర్శి రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి సంభాషణపైనే రీతూవర్మ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘నా కామెంట్ సెక్షన్ లో మీ పంచాయితీ ఏంటీ’ అని ప్రశ్నించింది. దీంతో ఈ ట్వీట్ వార్ వైరల్ అయింది. అయితే.. ఇదేదో సినిమా ప్రమోషన్ లా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.