అయ్యా.. డోనాల్డ్ ట్రంప్ గారూ.. మీకు కరోనా వైరస్ సోకడమేంటయ్యా.? అంటూ ప్రపంచమంతా ‘నిష్టూరంగా’ నిట్టూర్పులు విడుస్తోంది. ఇందులో వెటకారం శాతమే ఎక్కువ. ‘చైనా వైరస్ అయిన కరోనా వైరస్ (కోవిడ్ 19) అమెరికా వచ్చే ప్రసక్తే లేదు. అమెరికాలో కరోనా వైరస్‌ని అడుగు పెట్టనివ్వను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం డోనాల్డ్ ట్రంప్ బీభత్సమైన శపథాలు చేసేశారు. కానీ, అమెరికాని కరోనా వైరస్ అతలాకుతలం చేసి పారేసింది. ‘నన్ను కరోనా ఏమీ చెయ్యలేదు.. నేను మాస్క్ పెట్టుకోను..’ అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, చివరికి ఆయన కూడా మాస్క్ పెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం కరోనా వైరస్‌తో బాధపడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వెంటనే, ఆసుపత్రికి వెళ్ళేందుకు ట్రంప్ నిరాకరించారట. కానీ, కరోనా సోకిందని తేలిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. దీంతో, ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన కొద్ది సమయంలోనే ఆయన ఆరోగ్యం మరింత విషమించిందట. ‘48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయమూ చెప్పలేం..’ అని డాక్టర్లు తేల్చేసినట్లు, సోషల్ మీడియాలో కొన్ని కథనాలు గుప్పుమంటున్నాయి.
కొందరు వైద్యాధికారుల పేర్లను ఉటంకిస్తూ ఈ వార్తలు వస్తుండడం గమనార్హం. అయితే, ‘అబ్బే, నా పరిస్థితి మరీ అంత సీరియస్‌గా ఏమీ లేదు. ప్రస్తుతం బాగానే వున్నాను. అయితే, 48 గంటలు కీలకం’ అంటూ ట్రంప్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు తీసిందీ తెలియరావడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ, డోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు కరోనా వ్యాక్సిన్‌ని అందరికీ అందుబాటులోకి తెచ్చేస్తామని చెప్పిన ట్రంప్ స్వయానా కరోనా బారిన పడటం విశేషమే మరి. స్థూల కాయం సహా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కరోనా వైరస్, డోనాల్డ్ ట్రంప్‌ని కాస్త విషమ పరిస్థితిలోకి నెట్టేసినట్లే కనిపిస్తోంది.
402029 333322An fascinating discussion may be worth comment. I believe you should write on this topic, it may well certainly be a taboo subject but normally people are not enough to dicuss on such topics. To a higher. Cheers 429635
59246 168653Thank you for sharing with us, I believe this website genuinely stands out : D. 141835
200446 607383We could have a hyperlink change agreement between us! 576246