కరడుకట్టిన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులందరికీ క్లీన్ చిట్ లభించింది. భూ సెటిల్మెంట్లు, అక్రమ దందాల్లో నయీంతో కలిసి పనిచేశారనే ఆరోపణలపై ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సహా మొత్తం 25 మంది పోలీసులకు పోలీసు డిపార్ట్ మెంట్ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
2016 ఆగస్టులో షాద్ నగర్ సమీపంలోని మిలీనియం టౌన్ షిప్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో నయీం హతమైన సంగతి తెలిసిందే. అనంతరం విచారణలో నయీంతో పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు సంబంధాలున్నాయని.. వారి సహకారంతోనే అతడు పలు దందాలు చేశాడని తేలింది. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పలు భూ సెటిల్మెంట్లు, కిడ్నాపులు, హత్యలు, దందాలకు పాల్పడ్డాడని నయీంపై అభియోగాలున్నాయి.
ఈ క్రమంలో నయీం ఇంట్లో దొరికిన పొటోలు, ఇతరత్రా ఆధారాలను బట్టి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతోపాటు మొత్తం 25 మందిపై కేసు నమోదైంది. అయితే, వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని సిట్ తేల్చింది. అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, డీఎస్పీలు ఈజీ శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, సాయి మనోహర్, ప్రకాశ్ రావు, వెంకట నరసయ్య, అమరేందర్ రెడ్డి, తిరుపతన్న, ఇన్ స్పెక్టర్లు మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస్ నాయుడు, కిషన్, ఎస్.శ్రీనివాసరావు, వెంకటరెడ్డి మజీద్, వెంకట సూర్య ప్రకాష్, రవికిరణ్ రెడ్డి, బలవంతయ్య, నరేందర్ గౌడ్, రవీందర్, హెడ్ కానిస్టేబుళ్లు దినేశ్ ఆనంద్, మహ్మద్ సాదత్ మియా, కానిస్టేబుల్ బాలయ్యలకు క్లీన్ చిట్ లభించింది.
అయితే, నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులందరికీ క్లీన్ చిట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు విచారణ సరిగా జరపలేదని, వెంటనే దీనిని సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. 4 ఏళ్లుగా కేసు దర్యాప్తు జరుగుతున్నా బాధితులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. నయీం ఇంట్లో దొరికిన డబ్బు విషయంలోనూ పోలీసులు నిజాలు దాస్తున్నారని ఆరోపించారు. మరి గవర్నర్ ఇందులో జోక్యం చేసుకుని కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచిచూడాలి.
19751 331077Some truly good stuff on this site, I love it. 404125
590380 939347Hey, you used to write fantastic, but the last couple of posts have been kinda boringK I miss your super writings. Past several posts are just a little bit out of track! come on! 445335