సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ లు సినిమా స్థాయిని పెంచాయి.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నిలుస్తుంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించిన అనుపమ ఒక మోస్తరు స్కిన్ షో తో అదరగొట్టింది. అయితే టిల్లు కోసం అనుపమ తన అందాలను మరింతగా చూపించింది. స్కిన్ షో తో పాటు లిప్ లాక్ కూడా చేయడం ద్వారా అనుపమను కొత్తగా చూడబోతున్నాం.
టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను కొత్తగా మరింత అందంగా హాట్ గా చూడబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. డీజే టిల్లు లో నేహా శెట్టి ని చాలా అందంగా చూపించిన హీరో సిద్దు ఈ సినిమాలో అనుపమ ను అంతకు మించి అన్నట్లు అందంగా హాట్ గా చూపించబోతున్నాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా కచ్చింగా ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కి పిచెక్కించడం ఖాయంగా అనిపిస్తుంది.