Switch to English

లాక్ డౌన్ మినహాయింపులపై ఎటూ తేల్చుకోలేకపోతున్న తెలంగాణ

దేశంలో లాక్ డౌన్ 50 రోజులకు పైగానే కొనసాగుతోంది. కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించినప్పటికీ చాలా వెసులుబాట్లు కల్పించడంతో, రాష్ట్రటాలు తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సడలింపులు షురూ అయ్యాయి. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, మద్యం దుకాణాల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. గ్రీన్ జోన్ జిల్లాలో (విజయనగరం) ఆర్టీసీ బస్సుల్ని కూడా నడపాలని తొలుత అనుకున్నా, చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, తెలంగాణ మాత్రం లాక్ డౌన్ సడలింపులపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. తెలంగాణలో తగ్గినట్లే తగ్గి, మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఓ దశలో సింగిల్ డిజిట్ కే పరిమితయ్యాయి కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో. కానీ, అనూహ్యంగా నిన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. దాంతో లాక్ డౌన్ సడలింపులు ఎంతవరకు సమంజసం.? అన్న భావన తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, మే 7వ తేదీతో తెలంగాణలో లాక్ డౌన్ ముగియాల్సి వుంది. దాన్ని, మే 21 వరకూ పొడిగించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో, కేంద్రం కల్పించిన వెసులుబాట్లలో ఎన్నిటిని అనుమతివ్వాలి.? అన్నదానిపై మల్లగుల్లాలు పడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ-కామర్స్, మద్యం విక్రయాలు వంటి అంశాల చుట్టూనే కొంత గందరగోళం వున్నట్లు కన్పిస్తోంది. ప్రజా రవాణా విషయంలో అస్సలేమాత్రం సానుకూలంగా ప్రభుత్వం లేదని తెలుస్తోంది. మే 21 వరకూ ఇప్పుడున్నట్లుగానే లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తే మెరుగైన ఫలితాలు వుంటాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందట. అయితే, పొరుగు రాష్ట్రం ఆంధ్రపదేశ్ మద్యం అమ్మకాలకు అనుమతిచ్చిన దరిమిలా, ఆ వెసులుబాటు తెలంగాణలోనూ కల్పించాలనే డిమాండ్లు ప్రముఖంగా తెరపైకొస్తున్నాయి.

రేపు క్యాబినెట్ భేటీలో అన్ని అంశాలపై చర్చ జరగనుందనీ, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందనీ చర్చ జరుగుతోంది. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ (కోవిడ్-19) తాజా పరిస్థితిపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు క్యాబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

జగన్ కాళ్ళు చంద్రబాబు పట్టుకోవాలి- వైకాపా మాజీ ఎమ్మెల్యే ఫైర్ !

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మరోసారి సారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్...

కరోనా అలర్ట్‌ : ముంబయిలో ఆ పరిస్థితి రానే వచ్చేసింది

ఇండియాలో కరోనా ప్రారంభం అయిన సమయంలో చాలా మంది ఇక్కడ కరోనా విజృంభిస్తే ట్రీట్‌మెంట్‌ చేసేందుకు కనీసం బెడ్స్‌ కూడా ఉండవు. కరోనా పేషంట్స్‌ రోడ్ల మీద ఉంచి ట్రీట్‌ మెంట్‌ చేయాల్సి...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేనా.?

పోలవరం ప్రాజెక్ట్‌.. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆలోచనలు ముందడుగు వేశాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జలయజ్ఞం.....

క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్‌: ఇకపై అవేవీ కన్పించవా.?

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ‘ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ అని కరోనా వైరస్‌పై నిపుణులు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్న విషయం విదితమే....

మోడీ 2.0 పాలనకి ఏడాది: విజయాలే కాదు, వైఫల్యాలు కూడా.!

ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు.. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించాక.. తన ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు ప్రధాని మోడీ. అలా ‘మోడీ 2.0’ పాలనకి నేటితో ఏడాది...