Switch to English

బర్త్‌డే స్పెషల్‌: రెండు దశాబ్దాలైనా అదే అందం, అదే క్రేజ్‌ @ త్రిష

సాదారణంగా హీరోల కెరీర్‌ స్పాన్‌ కంటే హీరోయిన్స్‌ కెరీర్‌ చాలా తక్కువ సమయంకే ముగుస్తుంది. ఒకప్పుడు హీరోయిన్స్‌ పది పదిహేను సంవత్సరాలు కొనసాగేవారు. కాని గత కొంత కాలంగా మాత్రం హీరోయిన్స్‌ మూడు నాలుగు సంవత్సరాలకే కనుమరుగవుతున్నారు. పదేళ్లు స్టార్‌ హీరోయిన్స్‌గా ఉన్నారంటే చాలా గొప్ప విషయం. కాని రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా అందులో పుష్కర కాలం పాటు తెలుగు, తమిళంలో టాప్‌ స్టార్‌, మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ త్రిష. సౌత్‌ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించింది.

1999లో జోడీ చిత్రంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన త్రిష 2002 సంవత్సరం నుండి పూర్తి స్థాయి నటిగా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆమె దక్కించుకున్న సూపర్‌ హిట్స్‌, ఆమె సాధించిన ఘనతలు ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌ ఎవరు కూడా చూసి ఉండరు. తెలుగులో ఈమె సీనియర్‌ స్టార్స్‌ తోనే కాకుండా ఈతరం స్టార్స్‌తో కూడా నటించింది. తెలుగులో అత్యధిక హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్స్‌లో త్రిష ముందు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో త్రిష వేసిన ముద్ర మామూలుది కాదు.

2004వ సంవత్సరంలో ప్రభాస్‌తో ఈ అమ్మడు చేసిన ‘వర్షం’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో ఈ అమ్మడి అల్లరి ఇంకా నటన అందరికి నచ్చింది. ఆ తర్వాత ఏడాదిలోనే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తెలుగులో త్రిష మరింత స్టార్‌డంను దక్కించుకుంది. అదే ఏడాది మహేష్‌బాబుతో చేసిన అతడు సినిమా ఆమె కెరీర్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లింది. ఆ తర్వాత త్రిష వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో వరుసగా స్టార్‌ హీరోలతో నటిస్తూనే తమిళంలో కూడా ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేస్తూ అక్కడ ఇక్కడ నెం.1 హీరోయిన్‌గా ఒకానొక సమయంలో త్రిష నిలిచింది.

2016 సంవత్సరం వరకు త్రిష ఏడాదికి నాలుగు అయిదు అంతకు మించి సినిమాలు చేస్తూ వచ్చింది. వయసు పెరగడంతో పాటు కొన్ని ఫెయిల్యూర్స్‌ వల్ల ఆమెను ఫిల్మ్‌ మేకర్స్‌ పక్కన పెట్టారు. దాంతో లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేయడం మొదలు పెట్టింది. ఫిల్మ్‌ మేకర్స్‌ ఆమెను పక్కన పెట్టినా తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రం ఇంకా ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. ఆమెకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ తక్కువేం కాదు. అందుకే ఇంకా ఆమెకు సూట్‌ అయ్యే పాత్రలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవలే ఈమెకు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య చిత్రంలో ఆఫర్‌ వచ్చింది. షూటింగ్‌లో కూడా రెండు రోజులు పాల్గొన్న తర్వాత పాత్ర నచ్చలేదంటూ వెళ్లి పోయింది. తెలుగులో సినిమాలు ఏమీ చేయకున్నా తమిళంలో మాత్రం ప్రతిష్టాత్మకంగా మణిరత్నం తెరకెక్కించబోతున్న సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. మరో రెండు మూడు తమిళ సినిమాలకు కూడా ఈమె ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

36 ఏళ్ల వయసులో కూడా ఇంకా కుర్ర హృదయాలను కొల్లగొడుతూనే ఉన్న త్రిష మరో పదేళ్లయినా ఇదే అందం ఇంతే క్రేజ్‌తో ఉంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.

నేడు త్రిష పుట్టిన రోజు సందర్బంగా ఆమెకు అభిమానుల తరపున, తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి...

ఫ్లాష్ న్యూస్: తిరుపతి లడ్డూ 25 రూపాయలకేనట

తిరుమల లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి అందరికీ తెల్సిందే. కానీ, ఆ తిరుపతి లడ్డూ చుట్టూ చాలా వివాదాలు గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం. లడ్డూ ధరల పెంపుపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నా.. టీటీడీ,...

ఫ్లాష్ న్యూస్: కరోనాతో కానిస్టేబుల్ మృతి.. పోలిస్ శాఖలో కలకలం

తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకి మరణించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని కుల్సుంపురా పీఎస్ లో దయాకర్ రెడ్డి (37) కానిస్టేబుల్ గా పని...

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...