Switch to English

పిఠాపురంలో ‘వర్మ’ కెలుకుడు వెనక వున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,800FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గమది. ‘ఆ నియోజకవర్గం నాదే..’ అని చెప్పుకుంటున్నారు టీడీపీ నేత వర్మ. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గం అది. సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అది వేరే సంగతి. ఇండిపెండెంట్‌గా వర్మ పిఠాపురం నుంచి ఓసారి గెలిచారు.!

అంతమాత్రాన, ‘పిఠాపురం నాది’ అంటే ఎలా కుదురుతుంది.? పొత్తుల నేపథ్యంలో జరిగిన సీట్ల పంపకాల్లో పిఠాపురం నియోజకవర్గం జనసేనకు దక్కింది. అలాగే, కాకినాడ లోక్ సభ నియోజకవర్గం కూడా. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేసినా.. అది జనసేన అంతర్గత వ్యవహారం.

కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తోంటే, స్థానిక జనసేన నేతలు సహకరిస్తున్నారా.? లేదా.? తెనాలిలో సమస్య లేదు, తాడేపల్లి గూడెంలో ఇబ్బంది లేదు.. టీడీపీ – జనసేన పంపకాల్లో భాగంగా ప్రకటితమైన చాలా సీట్లలో పరిస్థితులు ప్రశాంతంగానే వున్నాయి.

కానీ, పిఠాపురంలోనే టీడీపీ నేత వర్మ ఎగిరెగిరి పడుతున్నారు. ‘పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే, ఆ సీటు నాది’ అంటున్నారు వర్మ. పవన్ పోటీ చేయకపోతే, తంగెళ్ళ ఉదయ్‌కి దక్కుతుంది ఆ సీటు. అయినా, ‘లక్ష మెజార్టీతో గెలుస్తాం.. పిఠాపురంలో నేనే పోటీ చేస్తున్నా..’ అని పవన్ కళ్యాణ్ చెప్పాక, వివాదం ఏముంది.?

ఒకవేళ లోక్ సభకు పోటీ చేయాల్సి వస్తే.. అన్న ప్రస్తావన పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. దాన్ని అవకాశంగా తీసుకుని వర్మ ఆడుతున్న డ్రామాలు చూస్తోంటే, ఇది పచ్చ కామెర్ల రోగం అనాలా.? లేదంటే, నీలి పైత్యం అనాలా.?

టీడీపీ – జనసేన మధ్య పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతోందంటే, దానిక్కారణం వర్మ. పిఠాపురం నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థి విషయమై గందరగోళానికి కారణం వర్మే. వున్నపళంగా వర్మని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తన భుజాల మీదే వుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుర్తెరగాలి.

‘సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తున్నారు’ అంటూ టీడీపీ అధికారిక హ్యాండిల్‌తో ట్వీటేస్తే సరిపోదు, వర్మ గలాటాకి సంబంధించి. ‘అదుపులో వుంటావా.? బయటకు పోతావా.?’ అనే స్థాయిలో వర్మకి, టీడీపీ వార్నింగ్ ఇవ్వాల్సిందే. నారా లోకేష్, చంద్రబాబు మీద ఆ స్థాయిలో వర్మ తన అనుచరులతో బూతులు తిట్టించారు మరి.

వర్మ ఎంత ఎగిరినా పిఠాపురంలో జనసేనకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే, జనసైనికులు గుస్సా అయితే, టీడీపీ అభ్యర్థులు ఇతర నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ, వర్మ వెనకాల వున్నదెవరు.? పచ్చ మాఫియానా.? నీలి మాఫియానా.?

సినిమా

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

రాజకీయం

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

ఎక్కువ చదివినవి

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

Shine Tom Chacko: డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు అరెస్ట్.. షాక్ లో ఇండస్ట్రీ

Shine Tom Chacko: మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన నటుడు ‘షైన్ టామ్ చాకో’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన్ను ఎర్నాకుళంలో అరెస్టు చేశారు....

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 23 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 23-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ 11.50 వరకు,...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 22 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 22-04-2025, మంగళవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ నవమి మ 1.03 వరకు,...

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...