Switch to English

Special Story on AP Media politics: “పత్రిక.. కట్టుకథకీ, పెట్టుబడికీ పుట్టిన విషపుత్రిక”- మహాకవి శ్రీశ్రీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఈనాడు ది గ్రేట్: 1974 లో మన రాష్ట్రంలో రష్యన్ అక్టోబర్ విప్లవం లాంటి ఒక చరిత్రాత్మక సంఘటన జరిగింది. అది రామోజీరావు విశాఖపట్నంలో ‘ఈనాడు’ దినపత్రిక ప్రారంభించడం. ఆ అతి చిన్న బ్లాక్ అండ్ వైట్ దినపత్రిక ఇంతింతై… ముఖ్యమంత్రుల్ని, ప్రభుత్వాల్ని మార్చే స్థాయికి ఎదుగుతుందని అప్పట్లో రామోజీరావు అనుకొని వుండరు. 1983 ఎన్నికలు-ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసేనాటికి ‘ఈనాడు’ విశాఖ, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి ఎడిషన్లుగా విస్తరించి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీగా నిలదొక్కుకుంది. అదిగో ఎన్టీఆర్ వస్తున్నాడు- ఆంధ్రప్రదేశ్ ఊపిరి బిగబట్టి చూస్తోంది.. అప్పుడు రామోజీరావు చరిత్రని మలుపు తిప్పే నిర్ణయం తీసుకున్నారు. నూటికి నూరుపాళ్ళూ ఎన్టీఆర్ కి మద్దతు యివ్వాలని. ప్రజల పక్షానవుండాల్సిన పత్రికని, పవిత్రమైన జర్నలిజాన్ని ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టడం ఏమిటి? అని కొందరు ఏడ్చిన ఏడ్చవచ్చుగాక. అది రామోజీరావు నిర్ణయం. అదేంటోయ్ పెళ్ళాన్ని అలా చచ్చేట్టు కొడుతున్నావ్ అని పక్కింటివాడు అడిగితే, “నా పెళ్ళాం , నేను కొడుతున్నా మధ్యలో నీకేంటి ప్రాబ్లం?” అన్నట్టు – అది ఆయన పేపరు, ఆయనిష్టం. అదొక అద్భుతమైన నిర్ణయం. రామారావు, రామోజీరావులతో పాటు ఒక రాష్ట్రం రాజకీయ భవిష్యత్తునే మార్చివేసిన చారిత్రక నిర్ణయం.

ఎన్ఠీఆర్ జనాకర్షణ-ఈనాడు వ్యూహం

చాలాసార్లు కమ్యూనిస్టుల కంటే పెట్టుబడిదారులే సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకుంటారనడానికి, కమ్యూనిస్టులు చారిత్రక తప్పిదాలు చేయడంలో గొప్ప సమయస్ఫూర్తి ప్రదర్శిస్తారనడానికి రామోజీ నిర్ణయం గీటురాయి. అప్పట్లో సి.పి.ఐ, సి.పి.ఎం, పార్టీలతో పొత్తుకుదుర్చుకోడానికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు – అందులో రామోజీ కూడా ఒకరు (చర్చలు హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో, ‘ఈనాడు’ ఆఫీసులో జరిగినట్టున్నాయ్) అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్యలతో చర్చలు జరిపారు. రెండు కమ్యూనిస్టు పార్టీలకూ 70 అసెంబ్లీ స్థానాలు యివ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది. వీల్లేదన్నారు రాజేశ్వరరావు, సుందరయ్యగార్లు. మేమేంటి, మా పోరాట చరిత్రేమిటి? 70 సీట్ల? మావల్లే కదా మీరు అధికారంలోకి రావలసింది అని హూంకరించి 100 సీట్లు యివ్వండన్నారు. పెద్దవారూ, జాతీయ నాయకులూ అని గౌరవించి చివరికి 80 సీట్లు అయితే యివ్వగలమని తెలుగుదేశం పార్టీ వినమ్రంగా చెప్పింది. రాజేశ్వరరావు, సుందరయ్య ప్రొటెస్ట్ చేసి చర్చల నుంచి వాకౌట్ చేశారు. సరే, ఎన్నికల్లో ఎన్టీఆర్ అద్భుత విజయం, కమ్యూనిస్టుల దారుణ వైఫల్యం అందరికీ తెలిసిందే. తమ పార్టీల బలాన్ని రాజేశ్వరరావు, సుందరయ్య అతిగా అంచనా వేస్తే, ఎన్టీఆర్ జనాకర్షణనీ, ఈనాడు పాపులారిటీనీ రామోజీరావు కరెక్టుగా అంచనా వెయ్యగలిగారు. అందుకే రామోజీ ది గొప్ప నిర్ణయం అయింది.

ఎన్ఠీఆర్-రామోజీ.. నువ్వా నేనా!?

ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుణ్ణి యిచ్చింది ఆ నిర్ణయమే. సరే – ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో జర్నలిస్ట్ సర్కిల్స్ లో ఒక విషయం బాగా ప్రచారం అయింది. రామోజీరావు ఓరోజు సన్నిహితులతో మాట్లాడుతూ, “నా ఈనాడు వల్లే రామారావు గెలిచారు. అంటే నా వల్లే ముఖ్యమంత్రి అయ్యారు” అని అర్థం వచ్చేలా మాట్లాడారట. ఆ సన్నిహితులు సహజంగా ఎన్టీఆర్ కి దగ్గరవాళ్ళే అయ్యుంటారు గనక రామోజీ మాటల్ని పెద్దాయన చెవిన వేశారు. ఎన్టీఆర్ చికాకు పడ్డారు. “నా బొమ్మలు వేసుకుని కదా ఆయన పత్రిక సర్క్యులేషన్ పెంచుకున్నదీ” అని తిప్పికొట్టారట ఎన్టీఆర్. (అప్పట్లో గ్రామాల్లో ఎన్టీఆర్ చెట్లకింద భోజనం, తెల్లతుండు చుట్టుకుని రోడ్డు పక్కన స్నానం, షేవింగ్, టీ తాగడం లాంటి ఈనాడు మొదటి పేజీ ఫోటోలు రాష్ట్ర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. 30 సుదీర్ఘ సంవత్సరాలు ప్రేమించి, పూజించి, ఆరాధించి, మొదటి రోజు ఎన్టీఆర్ సినిమా టిక్కెట్ల కోసం కాళ్ళూ చేతులూ విరగొట్టుకుని, పర్సులు పోగొట్టుకున్న జనం, ఎన్టీఆర్ గుర్రం మీద అడవిలో దూసుకుపోతుంటే నేల క్లాసులో కూచుని ఈలవేయడం అంటే యీ జన్మ ఫలించినట్టే అని భావించిన జనం- సాక్షాత్తు ఆ హీరోయే మన దగ్గరకొస్తునాడనే సరికి పూనకంతో వూగిపోయారు). అలా రామారావు, రామోజీల ‘ఈగో ప్రాబ్లం’, నువ్వా నేనా అనే స్వాతిశయం, పాతకాలపు భూస్వాముల పెత్తందారీ ధోరణి – అనేది ఎంతకు దారితీసిందంటే వూరూ పేరూ లేని చంద్రబాబు నాయుడనే ఎమ్మెల్యే చివరికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు. రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసిన ఈ రాజకీయ పరిణామాలన్నిటిలోనూ రామోజీరావు పాత్ర, ‘ఈనాడు’ ప్రచారం స్పష్టంగా వున్నాయి. ఆవకాయ పచ్చడి నుంచి అధికార మార్పిడి దాకా అన్నీ ‘ఈనాడు’ డిసైడ్ చేసేది. తనకు శత్రువులనుకున్న వారిని ‘ఈనాడు’ తరిమితరిమి కొట్టింది. అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఉన్నతాధికారులైనా, లక్ష్మీపార్వతి అయినా ఈనాడు కక్షగట్టిందంటే వాళ్ళ అడ్రసు గల్లంతయ్యేదాకా నిద్రపోయేది కాదు. ఈనాడుని ఎదిరించి నిలబడే శక్తియుక్తులు, దమ్మూ అప్పట్లో ఎవరికీ లేవు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, విశాలాంధ్ర లాంటి ఘనచరిత్రగల దినపత్రికలున్నా ఈనాడు ధాటికి తట్టుకోలేకపోయాయి. సర్క్యులేషన్ తో, పరపతితో, జిల్లా ఎడిషన్లతో ‘ఈనాడు’ శివతాండవమాడింది.

అసలే కొరకరాని కొయ్య అయిన ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతి తోడయ్యింది. రామోజీకీ, చంద్రబాబుకీ వంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకాయి. లక్ష్మీపార్వతిని నీచురాలిగా చిత్రించి, ఎన్టీఆర్ ని గద్దెదించి, చంద్రబాబుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేదాకా తెర వెనకా, ముందూ చక్రం తిప్పింది రామోజీరావే. ఎన్టీఆర్ మూర్ఖుడు, లక్ష్మీపార్వతి స్కౌండ్రల్, చంద్రబాబు జీనియస్ అని ‘ఈనాడు’ రాష్ట్ర ప్రజలకు జ్ఞానబోధ చేసింది. సరే, రామోజీ ‘మార్గదర్శి’ బ్రాంచీలు పెంచుకున్నాడు. ఫిల్మ్ సిటీ కట్టుకున్నాడు. చంద్రబాబు హెరిటేజీ, హెటళ్లు పెట్టుకున్నాడు. జీవితంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఇద్దరూ కోట్ల నోట్ల కట్టల నీడలో సుఖంగా సెటిలయ్యారు.

కలవరపెట్టిన “ఉదయం”

ఈనాడు పెట్టిన పది సంవత్సరాలకి, ‘ఉదయం ‘ దూసుకొచ్చింది. ‘ఉదయం’ దినపత్రిక ఆధునికత, స్పీడు రామాజీరావుని కొంత కలవరపరిచాయి. ఈనాడులో పేరూ, ఫోటో వస్తేనే ఎవరైనా నాయకుడుగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందే పరిస్థితి. అలా ఎంతో మంది రాజకీయ భవిష్యత్తుతో ఈనాడు చెలగాటం ఆడింది.

రామోజీరావు పాడింది పాటా, ఆడింది ఆటగా సాగుతున్న గేమ్ కి చెక్ పెట్టింది ‘ఉదయం’. మచ్చుకి ఒక ఉదాహరణ, 1985లో కారంచేడు- అయిదుగురు దళితుల్ని అగ్రకులంవాళ్ళు దారుణంగా నరికి పొలాల్లోని బురదలో తొక్కి చంపారు. ఇది పెద్ద విషయమేమీ కాదన్నట్టు, ఈనాడు చివరి పేజీలో అతి చిన్న వార్తగా ప్రచురించింది. కారంచేడు దుర్మార్గాన్ని ‘ఉదయం’ రెగ్యులర్ పతాక శీర్షికలతో ఫ్లాష్ చేసింది. ఉదయంలో ‘కారంచేడు కండకావరం’ అనే హెడ్డింగ్ తో ఎ.బి.కె. ప్రసాద్ వరసగా మూడు సంపాదకీయాలు రాశారు. ఈనాడు అభీష్టానికి విరుద్ధంగా కారంచేడు దురహంకారం మాలల మహోద్యమంగ మారడానికి ‘ఉదయం’ కారణమైంది. తర్వాత కొన్నేళ్లకి ఆర్థిక అరాచకం వల్ల ‘ఉదయం’ క్రమంగా మూతపడింది. ఈనాడు పని నల్లేరుమీద బండి నడకయ్యింది.

సర్వం… మేమే

ముఖ్యమంత్రుల్ని శాసించడం, మంత్రుల్ని గదమాయించడం, ఐఎఎస్ అధికార్లకు మొట్టికాయలు పెట్టడం, దారికి రాని వాళ్లని బ్లాక్ మెయిల్ చెయ్యడంలో ఈనాడు స్టేట్ రౌడీగా మారింది. ఇదెక్కడి వరకూ వెళ్ళిదంటే, పొద్దున్నే రామోజీ క్వాలిటీ పిండితో వేడివేడి ఇడ్లీల్ని ప్రియాపచ్చడితో లాగిస్తూ ‘ఈనాడు చదువుకో. వార్తలో ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎదురుగా వుందిగా ఈటీవీ. కథలూ కాకరకాయలూ ఇష్టమా? విపుల, చతుర వున్నాయి. నువ్వు రైతువా? ‘అన్నదాత’ అందుకో. సినిమా సరదా వుందా, ‘సితార’ నీదే. కళాత్మకమైన విగ్రహాలు, ఖరీదైనా చీరలూ కావాలా? అదిగో కళాంజలి – పిలుస్తోంది. బాగామోడర్న్, స్టయిలూ షోకూ పిల్లివా? ‘బ్రిసా’ ఈజ్ దేర్ యునో. డబ్బెక్కువై కొట్టుకుంటున్నావా? ‘మార్గదర్శి’లో పెట్టుకో. తోచట్లేదా? పిల్లల్లో విహార యాత్రకు పోతావా? ఎక్కడికో ఎందుకు మన ఫిల్మ్ సిటీ వుందిగా. సెలవా? కమ్మని రైస్ బ్రౌన్ ఆయిల్ తో వండుకు తిని, స్నేహితుల్తో కలిసి ‘మయూరి’ వారి ఉషాకిరణ్ మూవీకి టిక్కెట్లు కొనుక్కోపో. ఇదీ కథ. నువ్వు అటు అనంతపురంలో వున్నా, ఇటు శ్రీకాకుళంలో వున్నా నీకున్న అన్ని జేబుల్లో చెయ్య పెట్టగల వరాన్ని ఈనాడు ద్వారా పొంది, సర్వాంతర్యామి అయిపోయాడు చెరుకూరి రామోజీరావు.

పాపం పెద్దోళ్ళు – వాళ్లే అమాయకపు జర్నలిస్టులు

దినపత్రిక అంటే ఏమిటి? జర్నలిజం అనేది దేనికి? అంటే – ఇండియా లాంటి గొప్ప దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీ, నెహ్రూ, గఫార్ ఖాన్, నేతాజి, భగత్ సింగ్, టంగుటూరి ప్రకాశం లాంటి త్యాగమూర్తుల గురించి జనానికి చెప్పి ఉత్తేజపరిచి, సమాజాన్ని చైతన్య వంతం చేయడానికి అజ్ఞానం ఆవరించి వున్న మూర్ఖత్వపు చీకటి గట్టుమీద జ్ఞానదీపం వెలిగించడానికి భారత ప్రజాస్వామ్య సౌధం సగర్వంగా తలెత్తుకు నిలబడడానికి నాలుగోస్తంభంగా భుజం అందించడానికి – అదే జర్నలిజం అని నీలంరాజు వెంకటశేషయ్య, ముట్నూరి కృష్ణారావు, ఎం. చలపతిరావు, దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, నార్ల వెంకటేశ్వరరావు లాంటి గొప్ప సంపాదకులు నమ్మారు. ఆచరించారు. ఆదర్శమూర్తులుగా ఈలోకం నుంచి నిష్క్రమించారు. అదొక అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్. రోజులు మారాయి. దినపత్రికల్లో అంతర్జాతీయ వార్తలు తగ్గాయి. ప్రాంతీయ వార్తల ప్రాధాన్యం పెరిగింది. వ్యాపార వార్తలు, షేర్ మార్కెట్, సెన్సెక్స్, ఏ వ్యాపారి ఎంత లాభం గడించాడు? అనేది చాలా ముఖ్యం. బిజినెస్ పేజీలు వచ్చాయి. దీన్ని కరెక్టుగా పట్టుకున్నవాళ్ళలో ముందున్నవాడు, ఒకతరం మార్గదర్శి రామోజీరావు. పత్రిక అన్నది పెట్టుబడికి, కట్టుకథకి పుట్టిన విషపుత్రిక అన్నాడు శ్రీశ్రీ. దాని కన్నతండ్రి పేరే రామోజీరావు. వృశ్చిక సంతానంలా తర్వాత అనేకమంది బడా వ్యాపారస్తులు పుట్టుకొచ్చారు. నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి నామా నాగేశ్వరరావు దాకా. జీవీకే నుంచి జీఎమ్మార్ దాకా. జనచైతన్య మాదాల సుధాకర్ నుంచి సాక్షి జగన్మోహన రెడ్డి దాకా. రూపర్ట్ మర్డోక్ నుంచి రామోజీరావు వరకూ ప్రచార మాధ్యమం వ్యాపార ఉద్యమంగా మారడం మన కళ్ళముందే జరిగింది. వీళ్ళంతా డబ్బు ప్రాధాన్యాన్ని చాలా ముందుగా గుర్తించిన వాళ్లు. కమ్యూనిస్టులో, మరొకరో చెప్పినట్టుగానో, ఊరించినట్టుగానే ఈ దేశంలో ఇప్పుడిప్పుడే విప్లవం రాదని తెలిసిన జ్ఞానమూర్తులు. దినపత్రికల పేజీల్ని ప్లాట్లుగా విభజించి అమ్ముకోవచ్చని తెలిసిన రియల్ ఎస్టేట్ రింగ్ లీడర్లు. బాధల్లా బొత్తిగా హృదయంలేని వాళ్ళు. ప్రమాదం ఏమిటంటే హృదయం వున్నట్టు నటిస్తున్నవాళ్ళు.

ఇక రెడ్డి గారి శకం.. షురూ

అసలుకథ ఆలస్యంగా మొదలైంది. కమ్మ సామ్రాజ్య పతనానంతరం రెడ్డిరాజ్యం మొదలైంది. పంచె పైకెత్తి పట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ, ప్రత్యర్థుల్ని తొక్కుకుంటూ గలగలా నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రానే వచ్చాడు. వచ్చాడంటే మామూలుగా వచ్చాడా? పాతిక సంవత్సరాల అపోజిషన్ ఆకలితో – వంటగదిలోకి వొంగివచ్చిన ఘటోత్కచునిలా – వచ్చాడు. అం అహా అన్నాడు సూరీడు. ఇం ఇహీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉం ఉహూ అన్నాడు కేవీపీ. తెలుగు తెరమీద మాయాబజార్ని అయిదేళ్ళూ ఆడించాడు కెవీ రెడ్డి, సారీ, రాజశేఖరరెడ్డి. రాజశేఖర రెడ్డి ఒక అరుదైన నాయకుడు. హృదయంవున్న రాజకీయవేత్త. లివ్ అండ్ లెట్ లివ్ అంటే తెలుసా? నువ్వూ తిను, నేనూ తింటాను అని అర్థం. నువ్వు కొంచెం తక్కువ తిను, నేను కాస్త ఎక్కువ తింటాను అనేది రాజశేఖరరెడ్డి ఉద్దేశం కావచ్చు. .
.
రాజకీయ నాయకులంతా డబ్బులు తింటారు. కొందరు తినకపోతే అది వాళ్ళ ఖర్మ. అందులో పరిశోధన చేసి కని పెట్టాల్సిందేమీ లేదు. అంబానీలకో, రామోజీలకో అమ్ముడుపోతారు. అది పెద్దవిశేషం ఏమీకాదు. రాజశేఖర రెడ్డి ప్రత్యేకత ఏమిటంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసి, వూరుకోకుండా ఒక దినపత్రిక పెట్టాలని డిసైడైపోయాడు. అక్కడ మన రాష్ట్ర రాజకీయాలు వన్డే క్రికెట్ మ్యాచ్ లాగా బహుత్ పసంద్ గా మారాయి.

ఫస్ట్ కార్పొరేట్ డైలీ- సాక్షి

‘సాక్షి’ దినపత్రిక అనేది మామూలుగా రాలేదు. ఒక ఇంటర్నేషనల్ డిజైన్ తో, మెరిసే కలర్ కాంబినేషన్లో, అందమైన ప్రింటింగ్ తో, పకడ్బందీ ప్లానింగ్ తో ది ఫస్ట్ కార్పొరేట్ డైలీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పులిమీద పుట్రలాగా వచ్చింది. ‘ఈనాడు’ నెత్తిమీద స్కైలాబ్ లాగా పడింది సాక్షి పిడుగు. 2008, మార్చి 28 – గుడ్ మాణింగ్ అంటూ వచ్చి పడింది సాక్షి. తెలుగు జర్నలిజం తెల్లబోయింది. ఖచ్చితంగా రామోజీరావే నివ్వెర పోయుంటాడు. సాక్షిలాంటి డిజైనర్ డైలీ తేవడం రామోజీరావు కల. 40 ఏళ్లు కూడా లేని జగన్మోహనరెడ్డి అనే న్యూజెనరేషన్ చిప్ అంత పనిచేయడం… నిజంగా రామోజీ లోలోపల జగన్ని మెచ్చుకునే వుంటాడు. అయితే ఒకటే ప్రాబ్లం. అతను రామోజీ కొడుకు కాదు. కాకపోతే ఏమీకాదు. చావల్లా అతను రాజశేఖరరెడ్డి కొడుకు. వాడు బుడుగు కాడు పిడుగు అని ముళ్లపూడి వెంకటరమణ రాసింది జగన్ గురించేనని పాపం రచయితకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి కత్తులు కాదు, మిషన్ గన్లు బైటికి తీశాయి. జగన్ విలన్ అనీ, కరెన్సీ గనులు కనిపెట్టాడనీ, దొంగ అనీ, అవి దొడ్డిదారి పెట్టుబడులనీ కొన్ని హత్యల్లో అతని ప్రమేయం వుందనీ – ఆ పత్రికలే రాసి, కేస్ షీట్లు సిద్ధం చేసి, వాదించి, రుజువులు చూపించి తెల్లారితే చాలు జగన్ని ఇంకా జైల్లో పెట్టలేదా? అని సామాన్యుడికి అనుమానం వచ్చేలా జర్నలిజానికి కొత్త అర్ధాలు చెప్పాయి.

ఆ రెండు పత్రికలూ ఎంత మొత్తుకున్నా, ‘సాక్షి’ని

జనం యిష్టపడ్డారు. ఒక దినపత్రిక పుట్టిన రెండేళ్ళలో 14 లక్షలకు పైగా సర్క్యులేషన్ సాధించడం అపూర్వం. ఒకనాటి ఈనాడు లాగే సాక్షి కూడా చేసికాదు, సాధించి చూపించింది. ఈనాడు అక్టోబర్ రివల్యూషన్ అయితే సాక్షి ట్యునీషియన్ జాస్మిన్ రివల్యూషన్. అరబ్బు దేశాల్లో ఎగసిపడుతున్న తిరుగుబాట్లలా సాక్షి మిసైల్ ఎస్టాబ్లిష్ మెంట్ ని ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ ఎంత తీవ్రమైనదంటే ‘ఆంధ్రజ్యోతి’ మూడో స్థానానికి దిగజారింది. ‘వార్త’ నాలుగో స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకీ, వార్త గిరీష్ సంఘ్వీకీ, ఆంధ్రభూమి వెంకట్రామి రెడ్డికీ, ‘సూర్య’ నూకారపు సూర్య ప్రకాశరావ్ కీ, చివరికి ఈనాడు రామోజీరావుకీ లేని క్వాలిఫికేషన్ జగన్ ఒక్కడికే వుంది. అతను రాజశేఖరరెడ్డి కొడుకు. ఈ రాష్ట్రం యిప్పటికీ రాజశేఖరరెడ్డి మత్తులో వుంది. నాకూ, నీకూ నచ్చలేదేమో! జానే దేవ్. పేదజనం రాజశేఖరరెడ్డిని ప్రేమించారు. చనిపోయాక గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఇవ్వాళ జగన్ సభల్లో మూగిపోతున్నదీ, ఊగిపోతున్నదీ ఆ జనమే. ఈ జనమే 2019 ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని ఆధిక్యతని జగన్హోనరెడ్డి పార్టీకి అందించి ముఖ్యమంత్రిని కూడా చేశారు.

ఈ రోజు ‘ఈనాడు’ ఒక సంప్రదాయ చాదస్తపు తెలుగు దినపత్రికలా అనిపిస్తే అది మన తప్పుకాదు, సాక్షి గెలుపు. అంతేకాదు, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఎ.బి.సి) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ దినపత్రికల సర్క్యులేషన్ని లెక్కగట్టి నిర్ధారిస్తుంది. ఎ.బి.సి ప్రకారం సాక్షి సర్క్యులేషన్ 14,20,000 కాపీలు. నిజానికి ‘ఈనాడు’ సర్క్యులేషన్ యింతకన్నా బాగా తక్కువ. అంటే పన్నెండున్నర, 13 లక్షలకు మించదు. అయితే రామోజీ పలుకుబడి, మేనిప్యులేషన్లో ఇంకా ‘ఈనాడు’ని నెంబర్ వన్ పత్రికగా నెట్టుకొస్తున్నారని వినిపిస్తోంది. అదెంత కాలమో చూద్దాం !

వాచ్ డాగ్ జర్నలిజం

సాక్షిగానీ, ఈనాడుగానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ గానీ – అసలు వార్తాపత్రిక అనేదే ఒక పెద్ద బ్లాక్ మెయిలింగ్ పవర్. ఒకనాడు ప్రజలకు సాయపడిన దినపత్రిక ఇపుడు పత్రికా యజమానులకు వూడిగం చేస్తోంది. కోట్లు, వందకోట్లు, ఇంకా స్థలాలు, కంపెనీలు, షేర్లు, మెగా వెంచర్లు, గనులు, ఎగుమతులు… ఇలా సహస్ర బాహువులో సంపాదించి పారేశాక దాన్ని కాపాడుకోవద్దూ! ఖచ్చితంగా, దినపత్రికలు ఆ పనే చేస్తున్నాయి. ఏ పని? ఆస్తుల్ని రక్షించుకోవడం. కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ దినపత్రికలూ…. వాస్తవానికవి ఆస్తుల సంరక్షణ ఉద్యమాలు! జర్నలిజాన్ని ‘వాచ్ డాగ్’ అంటారు. గేట్లోకి రాక ముందే ఆ కుక్క అరుస్తూ విరుచుకుపడిపోతే భవంతి లోపలికెలా వెళ్తాం? జర్నలిజం యిపుడు యజమానులకు కుక్క చాకిరీ చేస్తోంది. ప్రయోజనాల పరిరక్షణ కోసం బాన్లు యిప్పుడు ఖరీదైన పెంపుడు కుక్కల్ని కొనుక్కుంటున్నారు. (చదవండి. పతంజలి ‘పెంపుడు జంతువులు’ నవల) మౌల్వీ నసీరుద్దీన్ కథలు, చమత్కారాలూ జగత్ ప్రసిద్ధం. రాజుగారు అడుగుతాడు. నసీరుద్దీన్ నీకు డబ్బు కావాలా? న్యాయం కావాలా? అని ఎవరైనా అడిగితే ఏం కోరుకుంటావ్? అని. డబ్బే ప్రభూ అంటాడు నసీరుద్దీన్. చ. డబ్బు దేముందీ, ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. న్యాయం దొరకడం అరుదు కదా, నేనైతే న్యాయాన్నే కోరుకుంటాను అంటాడు రాజు.

దానికి నసీరుద్దీన్, “చిత్తం ప్రభూ, మనుషులు ఎవరిదగ్గర ఏదైతే లేదో దాన్నే కోరుకుంటారు. మీ దగ్గర ఎప్పటికీ లేనిదాన్నే మీరు కోరుకుంటున్నారు” అంటాడు.

రాజకీయ యాజమాన్యం

నసీరుద్దీన్ మాటలు తెలుగు దినపత్రికల తీరుకు సరిగ్గా సరిపోతాయ్. మన పేపర్లు న్యాయం, పేదలు, ప్రజా సంక్షేమం అంటూ తెగ బాధపడిపోతూ వుంటాయి. వార్త సంఘీ రాజ్యసభ సభ్యుడు అవుతాడు. క్రానికల్ వెంకట్రామిరెడ్డి ఒకనాడు రాజ్యసభ సభ్యుడే. ఆంధ్రప్రభని చవగ్గా కొన్న తూ.గో. ముత్తా గోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే. సూర్య సి.ఎం.డి. సూర్య ప్రకాశరావు ఎంపీగా పోటీచేసి ఓడి పోయాడు. ఇక సాక్షి అధినేత ప్రస్తుతం జగన్మోహనరెడ్డి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆనాడు ‘ఆంధ్రజ్యోతి’ వ్యవస్థాపకుడు కె.ఎల్.ఎన్.ప్రసాద్ కూడా ఎంపీనే. ఇలా అధికారానికీ జర్నలిజానికీ అక్రమ సంబంధం ఎప్పటినించో వుంది.

ఇప్పటిదాకా తెలుగు సినిమాలూ, పేపర్లూ, టీవీ ఛానళ్ళంటే కోస్తా సామ్రాజ్య వాదానికి ఆనవాళ్ళుగానే వున్నాయి. ఆంధ్రా పెట్టుబడి దారులని తెలంగాణా నాయకులు తిడుతున్నదీ వాళ్ళనే. అలనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర నుంచి ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఉ దయం దాకా అన్నీ కోస్తావారి కాగితపు కోటలే. ఒక్క ‘సాక్షి’ మాత్రమే రాయలసీమ నుంచి తెచ్చిన వేట కొడవలి! ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సామ్రాజ్య శక్తుల్ని తట్టుకొని నిలబడ్డం అంత తేలిక్కాదు. వేలకోట్లతో పని. ఆపనికి ఒక జగన్మోహన్ రెడ్డి కావాలి. షరతు: అతను రాజశేఖరరెడ్డి కొడుకై వుండాలి.
.
పార్టీలు, కులాలు, ప్రాంతాలవారీగా మనం బాగా చీలిపోయి వున్న కాలంయిది. సి.పి.ఐ.కి ‘విశాలాంధ్ర’ వుంది. అదిపుడు రంగుల్లో వస్తోంది. సి.పి.ఎం ప్రజాశక్తిని పంచరంగుల్లో తెస్తోంది. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలకు ఈనాడు, జ్యోతి ఉండనే వున్నాయి. ఇద్దరు వైశ్య ప్రముఖుల నాయకత్వంలో వార్త, ఆంధ్రప్రభ నడుస్తున్నాయి. కాంగ్రెస్ ను నెత్తికెత్తుకున్న రెడ్ల పత్రిక ‘సాక్షి’ ఎదురుతిరిగి అపొజిషన్ పత్రికగా మారి వైకాపా మానసపుత్రికగా ఎదిగి, జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి కిరీటాన్ని అందించింది.

చీకూ చింత లేని.. చిరంజీవి, పవన్ కళ్యాణ్

ఏ ఛానల్ వత్తాసూ, ఏ పత్రిక మద్దతూ లేని వాళ్ళు చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఈ యిద్దరికీ ఏ చీకూచింతా లేదు. రిటైర్మెంటు బెనిఫిట్ గా రావాల్సిన కేంద్రమంత్రి పదవి 2012లోనే చిరంజీవి ఒళ్లోకొచ్చి పడింది.
మోర్ దేన్ ఎనఫ్. పీఆర్పీని ఆనందంగా వదిలించుకొని కాంగ్రెస్ గంగలో మునిగి తరించాడు’ చిరు. 2014 ఎన్నికల సమయానికి జనసేన పార్టీని ప్రకటించి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని అందించి 2019 ఎన్నికల్లో తెదేపా భాజపాతో ప్రత్యక్ష పొత్తును తెగతెంపులు చేసుకొని సరికొత్త పొత్తులతో బరిలోకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్, చిత్తు చిత్తుగా ఓడిపోయి భారీ మూల్యం చెల్లించుకోవడానికి గల ప్రధాన కారణం ఏ పత్రికా, ఏ ఛానలూ నెత్తికెత్తుకోక పోవడమే. ఇప్పుడు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్, 99 టీవీ, కె యెన్ టీవీ తెలుగు ఛానల్ ఇవన్నీ కూడా జనసేన గొంతుకను వినిపించటానికి ఆపసోపాలు పడుతున్నాయి. తిక్కవరపు వెంట్రామరెడ్డి నాయకత్వంలోని డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలు కాంగ్రెసూ, సొంత ప్రయోజనాలు కలిపి కొడుతుంటాయి.

పేపర్ రాజకీయాలూ – రాజకీయ పేపర్లు

ఆస్తులు, స్వార్థ ప్రయోజనాలు, కుట్రలూ, డెమొక్రటిక్ ఫోజు, ప్రజలపై ప్రేమ కలగాపులగంగా సామాన్యుణ్ణి కన్ఫ్యూజ్ చేస్తాయి. మరీ సినిమా ఫీల్డ్ , రియల్ ఎస్టేట్ వ్యాపారానికీ, వార్తా పత్రిక నడపడానికి ఎలాంటి తేడాలూ లేకపోవడమే ఈ కాలపు విచిత్రం.
.
“వేశ్యల్ని అంత మాట అనొద్దు”- నీహాల్ సింగ్

చాలా కాలం క్రితం జర్నలిస్టుల్ని తిడుతూ ఒక పెద్ద ఇంగ్లీషు పత్రికలో ఓ పెద్దాయన వ్యాసం రాశారు. జర్నలిస్టులు వేశ్యల్లా తయారయ్యారు అని ఆయన విమర్శ. దానికి ప్రసిద్ధ భారతీయ జర్నలిస్టు నీహాల్ సింగ్ సమాధానం యిస్తూ, ” వేశ్యల్ని అంతమాట అనకండి. వాళు , శారీరక సుఖం యిస్తారు. డబ్బు తీసుకుంటారు. ఇందులో ఒక నీతి వుంది. మా జర్నలిస్టులకు ఎలాంటి నీతీ, నియమాల్లేవు. మేం దిగజారిన థర్డ్ రేట్ వేశ్యలం. మాతో పోల్చి వేశ్యల్ని అవమానించకండి” అని రాశారు. నిజానికి జర్నలిస్టుల్ని, జర్నలిజాన్ని జారుడు మెట్ల మీద నుంచి తమ స్వార్థ ప్రయోజనాల ఇరుకు బావిలోకి దిగజార్చింది. యజమాన్యాలే! ఇష్యూల మీద పోరాడే పేపర్లకంటే, కంపుకొట్టినా టిష్యూ పేపర్ గా వాడితేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయని బాగా ఎర్లీగా పసిగట్టిన వాళ్ళు పెట్టుబడికి పుట్టిన పత్రికాధిపతులే.

– చిల్లగట్టు శ్రీకాంత్

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...