ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా రీమేక్స్ అన్నవి కొత్త కాదు. మన తెలుగు ఇండస్ట్రీ ఎన్నో రీమేక్ సినిమాలు చూసింది, మన సినిమాలను ఎన్నో ఇండస్ట్రీస్ రీమేక్ చేసుకున్నాయి, చేస్తున్నాయి కూడా. అయితే ఓటిటి ఉధృతమయ్యాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఫలానా చిత్రం ఫలానా చిత్రానికి రీమేక్ అని తెలియగానే వెంటనే ఓటిటిలో ఒరిజినల్ ను చూసేస్తున్నారు. దీంతో రీమేక్ పై ఆసక్తి తగ్గిపోతోంది. అందుకే ఇప్పుడు రీమేక్ అన్నది గుట్టుగా ఉంచుతున్నారు.
ఈ క్రమంలోనే రవితేజ నటించిన రావణాసుర కూడా ఒరిజినల్ కాదని రీమేక్ అని తెలుస్తోంది. బెంగాలీ చిత్రం విన్సీ డా ను తెలుగులో రావణాసుర టైటిల్ గా రీమేక్ చేసారని అంటున్నారు. తెలుగు వెర్షన్ కు కథ, స్క్రీన్ ప్లే క్రెడిట్స్ శ్రీకాంత్ విస్సా కు ఇచ్చారు.
ఆయన్ను క్లారిటీ గురించి అడిగితే – మీరు ఏ సినిమా అనుకుంటున్నారో అది, రావణాసుర చూసి తేడా తెలుసుకోండి అంటున్నాడు మరి.
225944 826555I really like forgathering utile information, this post has got me even much more info! . 702729
708888 637367The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops undoubtedly are a in fact quick strategy to be able to shed pounds; even though the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 636307