RK Roja: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ నాయకులు విజయోత్సవంలో మునిగి ఉన్నారు. ఇదే ట్రెండ్ వచ్చే ఏడాది జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగడం ఖాయం అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో మంత్రి రోజా తెలుగు దేశం పార్టీ నాయకుల పై విమర్శలు గుప్పించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ అధికారంలోకి వచ్చాం అన్నంత సంతోషంగా ఉన్నారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తాం అన్నట్లుగా పగటి కలలు కంటున్నారు.
2019 ఎన్నికలు జరిగినప్పటికి నుండి ఒక్క ఎన్నికల్లో కూడా గెలవలేక పోయినా టిడిపి ఈ ఎన్నికలతో శవం నోట్లో తీర్థం పోసినట్లుగా కాస్త జీవం వచ్చింది అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ సింబల్ తో, సొంత ఓట్లతో గెలవలేదని.. ఏదో గొప్పగా సాధించినట్లుగా సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రజలంతా మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని.. రాష్ట్రంలో మళ్లీ జగన్ పరిపాలన రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జగన్ పరిపాలన ప్రతి ఒక్కరి సంక్షేమంతో ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు.
833184 849292Jeden Tag stellt man sich die Frage Was Koche Ich Heute?! Zerbrechen Sie sich nicht den Kopf, besuchen Sie uns am besten direkt auf unserer Webseite uns lassen Sie sich inspirieren 491854
714368 844665Delighted for you to discovered this website write-up, My group is shopping more often than not regarding this. This can be at this moment certainly what I are already seeking and I own book-marked this specific site online far too, Ill often be maintain returning soon enough to appear at on your special blog post. 808046