టాలీవుడ్ లో ఇంతవరకు ఒక్క సినిమా చేయకున్నా.. ఐశ్వర్య మీనన్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ భామ గోల్డెన్ కలర్ సారీ ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్టిల్స్ పంచుకుంటూ ఉంటుంది. ఇటీవలే రెడ్ టాప్, బ్లాక్ జీన్స్ లో ఉన్న ఫోటోలు పంచుకోగా అవి కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలకు టాలీవుడ్ హీరో నిఖిల్ సైతం స్పందించాడు. ‘స్పై అన్ ఫైర్’ అంటూ కామెంట్ కూడా చేశాడు.
నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్పై’ చిత్రంతో ఐశ్వర్య టాలీవుడ్ కి పరిచయం కానుంది. కేరళలో పుట్టిన ఐశ్వర్య.. తమిళనాడులోని ఈరోడ్ లో పెరిగింది. అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రూ.లక్షల వేతనం ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
2012 లో రంగుల ప్రపంచంలోకి ప్రవేశించినా.. ఐశ్వర్య పదేళ్లలో పది సినిమాలు మాత్రమే చేసింది. అయినప్పటికీ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది. వ్యాయామం, హాట్ ఫోటోషూట్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం తనకి ఇన్స్టాలో 2.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
823758 773056A lot of thanks for the wonderful post C Id enjoyable reading it! That i really like this weblog. 739867
734101 698843Appreciate it for helping out, superb information. 833219