Switch to English

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఆయా రాజకీయ పార్టీలు ఇఫ్తార్‌ విందులతో ‘గాలం’ వేయడం చూస్తుంటాం. రాజకీయాల సంగతి పక్కన పెడితే, రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులో ఎంతోమంది పేదల కడుపు నింపుతుంటాయి.

కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇతర మతాలకు చెందినవారూ ఇప్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటారు రంజాన్‌ మాసంలో.. తమ మిత్రులైన ముస్లిం సోదరుల కోసం. హైద్రాబాద్‌ వంటి నగరాలే కాదు, సాధారణ పట్టణాల్లో కూడా ఈ ఆరోగ్యకరమైన వాతావరణం వివిధ మతాల మధ్య స్పష్టంగా కన్పిస్తుంటుంది. అది రంజాన్‌ మాసంలో మరింత ఎక్కువగా చూస్తుంటాం. ఇఫ్తార్‌ విందులో అత్యద్భుతమైన వంటకాలుంటాయి. తమ స్థాయిని బట్టి ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటారు. ఓ పెళ్ళి విందు కంటే ఘనంగా వీటిని నిర్వహిస్తుంటారు. వేలల్లో, లక్షల్లోనే కాదు.. కోట్ల రూపాయలు గుమ్మరించి ఇఫ్తార్‌ విందుల్ని నిర్వహించిన సందర్భాలూ రంజాన్‌ మాసంలో కనిపిస్తుంటాయంటే వీటికి వున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఈసారి ఇఫ్తార్‌ విందులు పెద్దగా ఎక్కడా కన్పించడంలేదు. కారణం కరోనా వైరస్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పది మంది కలిసి ఓ చోట గుమికూడే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడా ఈ రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందుల జాడ లేదు. అయితే, ఇఫ్తార్‌ మీల్స్‌ పేరుతో రంజాన్‌ మాసంలో పేద ముస్లింలను ఆదుకునేందుకు చాలామంది ముందుకొస్తున్నారు.. అదీ మతాలకతీతంగా కావడం గమనార్హం.

ఇస్లామిక్‌ దేశాల్లో ఈ ఇఫ్తార్‌ మీల్స్‌ ట్రెండ్‌ చాలా ఎక్కువగా కన్పిస్తుంటుంది. అక్కడ కూడా ఈ రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ విందులకు అనుమతి లేకపోవడం గమనార్హం. నిబంధనల్ని ఉల్లంఘించి ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తే భారీ జరీమానాలు, జైలు శిక్ష కూడా విధిస్తామని ఆయా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

లారెన్స్ సినిమాకి ‘లక్ష్మీ బాంబు’ లాంటి ఆఫర్

ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో విధాలుగా నష్టాలను ఎదుర్కుంటున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. థియేటర్లు మూతపడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టబోతుంటే చిత్రీకరణలు లేక చిన్న స్థాయి నటీనటులు, రోజు...

‘సమంత’ ఏమంత అందగత్తె కాదు.. బుట్టబొమ్మకు షాకిచ్చిన హ్యాకర్లు

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ కు గురయ్యింది. టెక్నికల్ టీం సాయంతో మరలా ఆ అకౌంట్ ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్ వేదికగా నెటిజన్లకు...

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...

చైనాలో శతాబ్దాల నాటి సంప్రదాయానికి కరోనా చెక్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్.. మానవుల జీవన సరళిలో అనేక మార్పులు తెచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేసింది. భౌతికదూరం అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేసింది. ప్రతి విషయంలోనూ పెను...

బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు ఈ రోజు సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లక్ష్మీ నారాయణ చిన్న కుమారుడు ఫణేంద్ర...