మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు కర్టెన్ రైజర్ కార్యక్రమానికి విచ్చేసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ కు కూడా రామ్ చరణ్ వచ్చాడు. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ లో రామ్ చరణ్ సందడి చేయబోతున్నాడు.
దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. రామ్ చరణ్ రీసెంట్ గా హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే. దీనికోసం రామ్ చరణ్ ఇప్పుడు బిగ్ బాస్ కు గెస్ట్ గా వచ్చాడు. కంటెస్టెంట్లతో సరదాగా రామ్ చరణ్ ముచ్చటించాడు.
ఇక బిగ్ బాస్ లో రామ్ చరణ్ తో పాటు మేస్ట్రో టీమ్ కూడా సందడి చేయనుంది. నితిన్, తమన్నా, నభ నటేష్ ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతోంది.