Switch to English

పుష్పక విమానం రివ్యూ : పర్వాలేదనిపించే కామెడీ

Critic Rating
( 2.25 )
User Rating
( 2.30 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow
Movie పుష్పక విమానం
Star Cast ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వీ మేఘన
Director దామోదర
Producer గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి
Music రామ్ మిరియాల
Run Time 2 hr 22 Mins
Release నవంబర్ 12, 2021

దేవరకొండ బ్రదర్స్ చాలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేసిన చిత్రం పుష్పక విమానం. మిడిల్ క్లాస్ మెలోడీస్ తో హిట్ ను అందుకున్న ఆనంద్ దేవరకొండ మరో సింపుల్ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ఈరోజే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

సుందర్ (ఆనంద్ దేవరకొండ)కు పెళ్ళైన తర్వాత తన భార్య (గీత్ సైని) ఎవరితోనో లేచిపోతుంది. దీంతో వింత పరిస్థితిలో పడ్డ సుందర్ ఆ విషయాన్ని కవర్ చేసుకోవాలని చూస్తుంటాడు. అసలు ఆమె ఎందుకు లేచిపోతుంది? తన భార్య ఎక్కడుంది అన్నది సుందర్ కనుక్కోగలుగుతాడా?

పెర్ఫార్మన్స్:

ఆనంద్ దేవరకొండ తన క్లిష్టమైన పాత్ర అయినప్పటికీ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తన భార్య లేచిపోయినా అది బయటకు తెలీకుండా కవర్ చేసుకున్న విధానం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. గీత్ సైని న్యాచురల్ గా ఉంది. తన పాత్రను బాగానే పోషించింది.

ఫేక్ వైఫ్ గా నటించిన శాన్వి ఇంప్రెస్ చేస్తుంది. ఆమె చూడటానికి బాగుండడమే కాకుండా పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఆకట్టుకుంది. హర్షవర్ధన్ కు ఈ చిత్రంలో కీలక పాత్ర దక్కింది. తను కూడా మెప్పిస్తాడు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని ఫస్ట్ హాఫ్ లో కామెడీ ప్రధానంగా, సెకండ్ హాఫ్ లో సీరియస్ వే లోనూ నరేట్ చేసాడు. సినిమా ఫస్ట్ హాఫ్ సిచ్యువేషనల్ కామెడీతో ఇంప్రెస్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ విషయంలోనే వచ్చింది సమస్య అంతా. ఈ సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ ఉంది. ఎమోషన్స్ ప్రధానంగా సాగె ఈ భాగం అంత ఎక్కదు. లేచిపోయిన భార్యను బ్యాక్ ట్రాక్ చేసే హీరో సన్నివేశాలు ఇంకా బాగా తీసి ఉండాల్సింది. ఆ పంచ్ మిస్ అయింది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక పాటలు అన్నీ కూడా సిచ్యువేషనల్. వాటి గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకండ్ హాఫ్ లో చాలా ట్రిమ్మింగ్ అవసరం.

ప్లస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ
  • లీడ్ కాస్ట్ పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్ లో డ్రాగ్
  • పతాక సన్నివేశాలు

విశ్లేషణ:

డీసెంట్ ఫస్ట్ హాఫ్, డ్రాగ్ సెకండ్ హాఫ్ ఉన్న పుష్పక విమానం పర్వాలేదు అనిపించే ఫీలింగ్ ను ఇస్తుంది. అక్కడా ఇక్కడా మెప్పించేలా ఉన్న ఈ సినిమాలో లేచిపోవడానికి గల కారణాలు, దాని తర్వాతి సన్నివేశాలు సరైన విధంగా ప్రెజంట్ చేయలేదు. అయితే ఈ చిత్రాన్ని ఒక్కసారి చూడవచ్చు.

తెలుగు బులెటిన్.కామ్ రేటింగ్: 2.25/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...