Switch to English

రాజా విక్రమార్క రివ్యూ: పసలేని యాక్షన్ ఎంటర్టైనర్

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow
Movie రాజా విక్రమార్క
Star Cast కార్తికేయ గుమ్మకొండ, తాన్య రవిచంద్రన్
Director శ్రీ సరిపల్లి
Producer రామారెడ్డి
Music ప్రశాంత్ ఆర్ విహారి
Run Time 2 hr 19 Mins
Release 12 నవంబర్ 2021

సరైన బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న కార్తికేయ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

రాజా విక్రమార్క (కార్తికేయ) కొత్తగా రిక్రూట్ కాబడిన ఎన్ఐఏ ఆఫీసర్. తన జాబ్ లోని ఛాలెంజ్ లకు ఇంకా అలవాటు పడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా సడెన్ గా రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూతురు (తాన్యా రవిచంద్రన్) కిడ్నప్ కేసును విక్రమార్క డీల్ చేయాల్సి వస్తుంది. అసలు కిడ్నప్ చేసింది ఎవరు? వాళ్లకు కావాల్సింది ఏంటి? హోమ్ మినిస్టర్ కూతుర్ని విక్రమార్క రక్షించగలిగాడా? అన్నది మిగిలిన కథ.

పెర్ఫార్మన్స్:

కార్తికేయ తన పాత్రకు 100 శాతం న్యాయం చేసాడు. తన బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ అన్నీ కూడా పాత్రకు సరిగ్గా సరిపోయాయి. ఈ పసలేని యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అంటే కార్తికేయ అనే చెప్పాలి. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది అండ్ ఆమె పర్వాలేదు. తనికెళ్ళ భరణి కీలక పాత్రను చేసాడు. తన పాత్రకు న్యాయం చేయగలిగాడు. సుధాకర్ కొమాకుల కూడా ప్రధాన పాత్రను పోషించాడు. తన పెర్ఫార్మన్స్ కూడా డీసెంట్ గా ఉంది.

సాంకేతిక నిపుణులు:

ఈ చిత్రంతో శ్రీ సారిపల్లి దర్శకుడిగా అరంగేట్రం చేసాడు కానీ దురదృష్టవశాత్తూ అతను తడబడ్డాడు. ఈ చిత్ర స్టోరీ లైన్ లోనే క్లారిటీ లేదు. చాలా సిల్లీగా ఉంది. స్క్రీన్ ప్లే లో లాజిక్స్ లేకపోగా వరసపెట్టి వచ్చే అర్ధంపర్ధం లేని ట్విస్ట్ లు ప్రేక్షకులను చిరాకు పెడతాయి. కిడ్నప్ ట్రాక్, హీరో-హీరోయిన్ ట్రాక్, కార్తికేయ-సుధాకర్ ట్రాక్ లు అసలు సరిగా అనిపించవు. కిడ్నప్ సీన్స్, దాని తర్వాత వచ్చే సీన్స్ ను సరిగా తీయలేకపోయారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. అసలు కథ, స్క్రీన్ ప్లే వద్దే సినిమా ఎత్తేయడంతో మిగతా టెక్నికల్ విషయాలలో ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎడిటింగ్ ఇంకొంచెం బాగుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • కార్తికేయ పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే లోపాలు
  • లాజిక్ లేని నరేషన్
  • అర్ధం పర్ధం లేని కిడ్నప్ స్టోరీ

విశ్లేషణ:

అసలు లాజిక్స్ అన్నీ కూడా పక్కకునెట్టేసి ఒక సినిమా తీస్తే రాజా విక్రమార్కలా ఉంటుందేమో. నరేషన్ లో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను చిరాకు పెడతాయి. ఈ చిత్రంలో కార్తికేయ పెర్ఫార్మన్స్ తప్ప పెద్దగా పాజిటివ్ అంటూ ఏం లేదు.

తెలుగు బులెటిన్. కామ్ రేటింగ్: 2/5

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...