ఇంటి సమస్యలను సరిదిద్దుకుంటూనే.. సమాజ సేవ కోసం వచ్చిన వీర మహిళలకు ధన్యవాదాలు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన క్రీయాశీలక వీరమహిళల రాజకీయ, అవగాహన తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ తరగతుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల ఐదు నియోజకవర్గాలు, విజయవాడ నగర పరిధిలోని క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.
మగవారు ఎంతమంది ఉన్నా.. స్త్రీ శక్తి వేరు. వారు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. మీ ఇంట్లో వాళ్లను సమాజ సేవ చేసేలా ప్రోత్సహించండి. మీలాంటి వీర వనితలే మాకు భారత్ మాతలు. రాబోయే తరాల కోసం జనసేన స్థాపించాను. భాష, యాసను గౌరవించకపోతే రాష్ట్రం విచ్చిన్నమవుతుంది. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయ వాదానికి దూరమవుతాంస’.
‘సంస్కృతిని, భాషలను గుర్తించి, గౌరవించాలి. రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. జనసేన కూడా చిన్నగానే ప్రారంభమైంది. ఈ శిక్షణ తరగతులతో ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరక్కపోయానా.. అద్భుతాలకు ఆలంబనగా, అడుగుపడేలా నిలుస్తాయ’ని అన్నారు.