Switch to English

షాకింగ్‌ గాసిప్‌: ఈసారి లోకేష్‌ తప్పించుకోలేడట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఎన్నికల సమయంలో ‘డేటా లీక్‌’ వ్యవహారంలో నారా లోకేష్‌ పేరు ప్రముఖంగా తెరపైకొచ్చింది. అయితే, ఆ వ్యవహారం చాలా తేలిగ్గానే తెరమరుగైపోయింది. ఆ కేసులో ఎందుకు విచారణ ముందుకు సాగడంలేదు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, నారా లోకేష్‌ చాలా విషయాల్లో వివాదాస్పదంగా వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు. ఆ మధ్య జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన శ్రీరెడ్డి నానా యాగీ చేసినప్పుడూ నారా లోకేష్‌ పేరు విన్పించింది.

అప్పట్లో ఓ ప్రముఖ ఛానల్‌ సీఈఓగా పనిచేసిన ఓ ప్రముఖుడు, శ్రీరెడ్డితో కలిసి నారా లోకేష్‌ ఆ మొత్తం ఎపిసోడ్‌కి వ్యూహరచన చేశారన్న ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే, ఇఫ్పుడు రాజధాని అమరావతి భూములకు సంబంధించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల్లోనూ నారా లోకేష్‌ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఇదొక్కటే కాదట, నారా లోకేష్‌ మంత్రిగా పనిచేసిన సమయంలో చాలా అక్రమాలు జరిగాయనీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని యధేచ్ఛగా పక్కదారి పట్టించారనీ వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలో నారా లోకేష్‌ తప్పించుకునే అవకాశమే లేదని వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే పక్కా ఆధారాలు తమ ప్రభుత్వం సేకరించిందన్నది సదరు వైసీపీ ముఖ్య నేత చెబుతున్న మాట. సంక్రాంతి లోపే, నారా లోకేష్‌ మీద సీరియస్‌ యాక్షన్‌ తప్పకపోవచ్చట. ఒకవేళ కాస్త లేటయినా, సంక్రాంతి తర్వాత నారా లోకేష్‌కి అధికార పార్టీ చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే టీడీపీ నుంచి బయటకు వెళుతున్న నేతలంతా, నారా లోకేష్‌ని బూచిగా చూపుతున్న విషయం విదితమే. ఒకవేళ, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలోనూ, ఇతరత్రా ఆరోపణలకు సంబంధించి నారా లోకేష్‌ బుక్కయిపోతే, టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఏంటట.? తొలుత లోకేష్‌, ఆ తర్వాతే చంద్రబాబు.. అన్న కోణంలో ‘పొలిటికల్‌ స్కెచ్‌’ నడుస్తోందన్న ఊహాగానాల్లో నిజమెంత.? వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...