Switch to English

‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీ రివ్యూ

Movieసాఫ్ట్ వేర్ సుధీర్
Star Castసుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే
Directorరాజశేఖర్‌రెడ్డి పులిచర్ల
Musicభీమ్స్‌ సిసిరోలియో
Run Time2h 5min
Releaseడిసెంబర్ 28, 2019

నటీనటులు: సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే
నిర్మాత: కె.శేఖర్‌రాజు
దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల
సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌
మ్యూజిక్: భీమ్స్‌ సిసిరోలియో
ఎడిటర్‌: గౌతంరాజు
విడుదల తేదీ: డిసెంబర్ 28, 2019

ఇప్పటి వరకూ బుల్లితెర ‘జబర్దస్త్’ షోస్ తో తెలుగు ప్రేక్షకులను తెగ నవ్వించిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెరకి హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా సీనియర్ నటులు ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్ లాంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 లో రిలీజయ్యే చివరి సినిమాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సుడిగాలి సుధీర్ వెండితెరపై ఎంత వరకూ నవ్వించాడు అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

మంచి తనానికి మారు పేరు లాంటి కుర్రాడు మన సాఫ్ట్ వెర్ ఉద్యోగి చందు(సుడిగాలి సుధీర్). అదే ఆఫీసులో పనిచేసే స్వాతి(ధన్య బాలకృష్ణన్)ని చూసి ప్రేమలో పడి ఆ ప్రేమని పెళ్లి వరకూ తీసుకెళతాడు. అక్కడే తన జాతకంలో దోషం ఉందని, దానివల్ల తన ప్రాణానికే ప్రమాదం అని తెలిసి స్వాతి ఐడియాతో ఒక స్వామీజీని కలిసి పూజ నిర్వహిస్తారు. ఈ టైంలో స్వామీజీ బ్యాక్ ఎండ్ లో చేసిన ఓ ప్లాన్ వలన చందు మంత్రి(శివ ప్రసాద్) సంబందించిన ఓ వెయ్యి కోట్ల స్కామ్ లో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి స్కామ్ నుంచి బయట పడటానికి చందు ఏం చేసాడు? స్వామీజీ వెయ్యి కోట్లు ఎలా కొట్టేసాడు? ఎందుకు కొట్టేసాడు? అసలు ఈ స్కామ్ వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ఎందుకు చేశారు? చివరికి చందు ఆ కేసు నుంచి బయట పడ్డాడా? లేదా? అన్నదే కథ.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సుడిగాలి సుధీర్ బుల్లి తెరపై లానే వెండితెరపై కూడా తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో నవ్వించాడు. నటుడిగా మాత్రం అమాయకం మరియు హీరోయిక్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి నటనని కనబరిచాడు. అలాగే మొదటిసారి సాంగ్స్ డాన్సులు ఇరగదీసి ఎంటర్టైన్ చేసాడు. ధన్య బాలకృష్ణ బ్యూటిఫుల్ గా ఉంది, పాటల్లో గ్లామరస్ గా కూడా కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో తన పాత్రలోని మరో షెడ్ ని చూపిస్తూ చేసిన నటన చెప్పుకోదగినది. ఇక ముఖ్య పాత్రలు పోషించిన ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, శివ ప్రసాద్ లు బాగా చేశారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కామెడీ బాగానే వర్కౌట్ అవ్వడం వలన పరవాలేధనిపిస్తుంది. సాఫ్ట్ వేర్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఇంటర్వల్ బ్లాక్ చాలా బాగుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే మేజర్ ట్విస్ట్ బాగుంది. సెకండాఫ్ లో గద్దర్ సాంగ్ అండ్ బ్లాక్ ఎమోషనల్ గా హై ఇస్తుంది.

ఆఫ్ స్క్రీన్:

కొన్ని చోట్ల సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని వన్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అనీష్‌ మాస్టర్‌ డాన్సులు సూపర్బ్.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోయినా సెకండాఫ్ మాత్రం బోర్ కొట్టిస్తుంది. ముఖ్యంగా కథని ఇంకో యాంగిల్ లోకి మార్చి చెప్పడం ముఖ్యంగా ఆడియన్స్ కి ఉన్న కనెక్షన్ ని మిస్ చేస్తుంది. పెద్ద కమర్షియల్ హీరోలా చేసిన ఫైట్స్ మెప్పించలేదు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ అంటే ఓ కమెడియన్.. కానీ ఈసినిమాలో కామెడీ పెద్దగా లేకపోవడం నిరాశ కలిగించే అంశం. ఎందుకంటే అన్ని జబర్దస్త్ లాంటి ఫ్లేవర్ లో పంచ్ డైలాగ్స్ రాశారు. అవి కూడా నవ్వించే రేంజ్ లో లేకపోవడం, మరీ చీప్ గా ఉండడం కాస్త చిరాకు పుట్టిస్తాయి. సుధీర్ పేస్ చూసి కామెడీ మస్త్ ఉంటాడేమో అని ఆశించి వచ్చే వారు మాత్రం నిరాశ పడతారు.

ఆఫ్ స్క్రీన్:

ముందుగా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల గురించి మాట్లాడుకుంటే.. పాత కథే, మనకు తెలిసిన కథే అలానే చెప్తే అందరికీ తెలిసిపోద్దని స్క్రీన్ ప్లే లో రెండు డిఫరెంట్ జానర్స్ ని మిక్స్ చేసి ఎదో కొత్త కథ, కథనంతో చేశామని ప్రూవ్ చేసుకోబోయి బేసిక్స్ మిస్సయ్యారు. దాంతో కథ – కథనాల విషయంలో మెప్పించలేకపోయాడు. ఇంటర్వల్ కి ఇదేదో ఫాంటసీ సినిమా అని చెప్పి దాన్ని క్రైం, సోషల్ మెసేజ్ ఉన్న వైపుగా తీసుకెళ్లి మరీ రొటీన్ రొట్ట సినిమాల జాబితాలో కలిపేసారు. అలాగే డైలాగ్స్ 50% బాగుంటే 50% బాలేదు. మరీ చెత్తగా రాసిన పంచులు కామెడీ చాలా చోట్ల పేలని వీక్ జబర్దస్త్ స్కిట్స్ ని గుర్తు చేస్తది. ఇక దర్శకుడిగా తాను అనుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ మొదలు పెట్టడం, ఇంటర్వల్ పరవాలేధనిపించేలా చేసినా ఆ తర్వాత ఆ హోల్డ్ ని మైంటైన్ చేయడంలో విఫలమయ్యాడు. ఇక భీమ్స్ మ్యూజిక్ జస్ట్ ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసోగా ఉంది. గౌతమ్ రాజు గారి పని తనం కొన్ని సీన్స్లో తప్ప ఓవరాల్ సినిమాలో కనిపించలేదు. అందుకే సినిమాలో బోరింగ్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి.

విశ్లేషణ:

బుల్లితెరపై స్కిట్స్ తో బాగా నవ్వించిన సుడిగాలి సుధీర్ హీరోగా సినిమా అంటే కంప్లీట్ ఎంటర్ టైనర్ అయ్యుటుంది అనుకోని థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులు కచ్చితంగా నిరాశ పడతారు. చాలా మంది ప్రేక్షకులు ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద పాయింట్స్ చెప్పాలని బోల్తా పడడం, అదేదో సింపుల్ కామెడీ బొమ్మ చేసుంటే బాగుండేది కదా అనుకుంటారు. ఓవరాల్ గా ‘సాఫ్ట్ వెర్ సుధీర్’ సినిమా సుధీర్ మంచి పర్ఫార్మర్, సింపుల్ ఎంటర్టైనర్స్ చేయగలిగే సత్తా ఉంది అని ప్రూవ్ చేసే సినిమానే తప్ప మిమ్మల్ని పూర్తిగా నవ్విచగలిగే సినిమా యితే కాదు.

ఫైనల్ పంచ్: సాఫ్ట్ వేర్ సుధీర్: వెండితెర సాఫ్ట్ వేర్ కంటే బుల్లితెర సుడిగాలి సుధీరే బెటర్.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిక్ ఆఫ్ ది డే: సమ్మర్లో బికినీతో సెగలు పుట్టిస్తున్న వరుణ్ తేజ్ బ్యూటీ.!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దిశా పటాని. ఆ తర్వాత తెలుగులో...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

మే 22 తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్పెషల్ లింకప్ ఏంటో తెలుసా.?

నేటితో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' సినిమా ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22 కీ, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నారు కింగ్ నాగార్జున. "నాన్నగారితో...

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...