Switch to English

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు పాలాభిషేకాలు, రక్త తిలకాలు, తెర ముందు గుమ్మడికాయ దిష్టి తీయడం వంటివి ఎందరో తెలుగు హీరోలకు జరిగాయి.

తమ హీరోలపై ఈ తరహా అభిమానం సమర్ధనీయమే. అయితే.. తమ హీరో కోసం పక్క హీరోను చులకన చేయడం తగనిది. ఒక స్థాయిలో ఉన్న హీరోల మధ్య పోటీ పెట్టుకోవడం సహజమే. కానీ.. ఎంతో సాధించి, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న దిగ్గజాలను ఈతరం కుర్రకారు వయసు, హోదా, స్థాయి మరచి తమ హీరోలతో పోల్చి తక్కువ చేస్తూ శునకానందాన్నే పొందుతున్నారు.

నందమూరి కల్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో కొత్త దర్శకుడు వశిష్ట్ తో చేసిన ‘బింబిసార’ నిన్న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సినిమా హిట్ అయితే పరిశ్రమకు మేలు. ఈ విషయాన్ని మరచిన నందమూరి అభిమానులు కొందరు ఏకంగా సినిమా రిజల్ట్ ను మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో పోల్చి తక్కువ చేయడం వారి అతికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆచార్యతో మూసిన ధియేటర్లు బింబిసారతో ఓపెన్ అయ్యాయి అనటం వారి అవివేకానికి నిదర్శనం.

చిరంజీవి ఫ్లాప్ సినిమా కలెక్షన్లు ఓ సూపర్ హిట్ సినిమా కలెక్షన్లకు సరిపోలవు అనేది తెలుగు సినిమా ట్రేడ్ మాట. అటువంటి చిరంజీవి చరిష్మాను ఓ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ కు ఎలా పోలుస్తున్నారో అర్ధం కానిది. నందమూరి హీరోల్లో ఎవరికి హిట్ వస్తే అటు పోయే ఓ వర్గం ఈ తరహా చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారు.

కల్యాణ్ రామ్ ను చిరంజీవితో పోల్చే పిల్ల బ్యాచ్ మరచిపోయింది ఏంటంటే.. బింబిసార ప్రమోషనల్ ఈవెంట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి జగదేకవీరుడు అతిలోక సుందరి, రామ్ చరణ్ మగధీర’ తరహాలో తమ బింబిసార ఉంచేలా ప్రయత్నించామని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.

ఊళ్లో పెళ్లికి కుక్స్ హడావిడి అన్నట్టు.. ఇన్నాళ్లూ కల్యాణ్ రామ్ పై లేని అభిమానం ఒక్క హిట్ తో తెచ్చుకుని.. అదే హీరో చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలను ఉదహరించిన వైనం ఈ పిల్ల బ్యాచ్ మరచిపోవడం నిజంగా అవివేకమే. తెలుగు సినిమా శ్రేయస్సును, కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహించే చిరంజీవిని తక్కువ చేయడం కంటే వారికో హిట్ వచ్చిందనే ఆనందం.. అభిమానంలో తమ ఐక్యత చాటుకుంటే ఆ తరహా అభిమానులకు.. అందరికీ మంచిది..!

7 COMMENTS

 1. ippudu kadu Nandamuri family nunchi Heroes andaru hit kottalani eduru chustunnam aa Kala ippudu nela verindi
  Mega family ,nunchi vere Valla cinema 🎥 ienda a movie vacchina congratulations cheppe gunam maadi
  Alantidi maa movie ki congratulations cheppaka poina parvaledu
  Kani thidithe voorukone prasakhte ledu
  Ok
  U respect and take respect

 2. ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి ఇప్పుడు మీకు కళ్ళు తెరుచుకున్నాయ బాలకృష్ణ మూవీ కలెక్షన్స్ తో చరణ్ మూవీ కలెక్షన్స్ fb లో వ్యంగంగా పోస్ట్ పెట్టిన మెగా ఫ్యాన్స్ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా

 3. అరె వెదవ నీ likes ku మరియు website promotions ku నందమూరి మరియు మెగా అభమానుల మద్య గొడవలు పెడ్తూ వున్నావు .,.. ఇలా బ్రతకడం కంటే కష్ట పడి పని చేసుకొర రా నెక్స్ టైం ఇలా పెట్టవు అంటే సైబర్ క్రైం లో complaint చేస్తాము జాగర్త

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్...

బాల నటుడిగా నిరూపించుకున్న మహేశ్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఫుల్ ఛార్మింగ్ లుక్, రొమాంటిక్, పాల బుగ్గల మేని ఛాయతో తెలుగు సినిమాకు గ్లామర్ తీసుకొచ్చారు....

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన...

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల...

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

రాజకీయం

అంతేనా.? గోరంట్ల మాధవ్ మీద ‘వేటు’ పడే అవకాశమే లేదా.?

అదేంటీ, గోరంట్ల మాధవ్ మీద వేటు పడుతుందనే ప్రచారం వైసీపీనే చేసింది కదా.? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేటీఎం కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు కదా.? కఠిన...

బింబిసార ముసుగులో బులుగు రాజకీయం… టీడీపీ జనసేన మధ్య వైసీపీ చిచ్చు.?

మెగాస్టార్ అనే ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి ఎలా ఇచ్చేస్తారు.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. నిజానికి, ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసైనికులూ పెద్దగా...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తెలంగాణ భళా.! ఆంధ్రప్రదేశ్ డీలా.!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో...

ఎక్కువ చదివినవి

ఇలాంటి గొప్ప కథ ఇప్పటి వరకూ రాలేదు : దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా అశ్వినీదత్ నిర్మించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హీరో దుల్కర్...

తెలుగు సీరియల్స్ నుండి కన్నడ నటీనటులను బ్యాన్ చేయనున్నారా?

ఒక సీరియల్ సెట్ లో హీరోకి, సహాయ దర్శకుడికి మధ్య జరిగిన చిన్న వాగ్వాదం ఇప్పుడు కన్నడ నటీనటుల బ్యాన్ వరకూ వెళుతోంది. వివరాల్లోకి వెళితే కన్నడ నుండి వచ్చిన చందన్ కుమార్.....

టీడీపీలో జాయిన్‌ అయితే సినిమాలు వదిలేస్తా

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో విడుదల కాబోతున్న బింబిసార సినిమా కోసం కళ్యాణ్ రామ్‌ కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా పరుగులు పెడుతూ...

సీతా రామమ్ రివ్యూ: ఎంగేజింగ్ పీరియాడిక్ డ్రామా

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా హను రాఘవపూడి తెరకెక్కించిన సీతా రామమ్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ: రామ్ (దుల్కర్ సల్మాన్) రాసిన ఒక ప్రేమలేఖను...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టాలీవుడ్ లో బిజీగా సినిమాలు......