Switch to English

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్ ‘మహేశ్’

91,242FansLike
57,309FollowersFollow

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్ లో హీరో మెటీరియల్ ఉందని అతని చిన్ననాటే నిరూపించుకున్నాడు. తండ్రితో కలిసి అన్నతమ్ముడు, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు వంటి హిట్స్ ఉన్నాయి. బాలచంద్రుడు సినిమాలో సోలో హీరోగా నటించాడు. ఆ సినిమాల్లో మహేష్ పెర్ఫార్మెన్స్, డాన్స్ చూసి భవిష్యత్ తెలుగు సినిమా స్టార్ హీరో అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అయిదేళ్ల వయసులోనే మహేష్ స్టార్ అవుతాడని మాకు అర్ధమైందని సోదరి మంజుల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగానే మహేష్ తనలోని స్టార్ కు చిన్ననాటే మెరుగులు దిద్దుకున్నారు. చదువు నిమిత్తం 1989లో సినిమాల నుంచి తాత్కాలిక విశ్రాంతి తీసుకున్న మహేష్ పదేళ్ల తర్వాత 1999లో పూర్తిస్థాయి హీరోగా తెరంగేట్రం చేశారు.

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్ ‘మహేశ్’

ప్రామిసింగ్ హీరోగా..

అప్పటికే వారసత్వ హద్దుల్ని దాటేసిన మహేశ్ హీరోగా తొలి సినిమా రాజకుమారుడు చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా హిట్ అయింది. తండ్రి కృష్ణతో చేసిన వంశీ ఫ్లాప్ అయినా.. వైవీఎస్ చౌదరి దర్శత్వంలో చేసిన యువరాజు యావరేజ్ గా నిలిచిన, దర్శకుడు కృష్ణవంశీతో చేసిన మురారి సూపర్ హిట్ తో నిలదొక్కుకున్నారు. సినిమాలో తన నటనతో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. ఆతర్వాత జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో చేసిన యాక్షన్, అడ్వెంచర్ టక్కరిదొంగ ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. అయితే.. 2003లో నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా మహేష్ కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమాగా నిలిచింది.

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్ ‘మహేశ్’

ప్రయోగాలతో డేరింగ్ హీరోగా..

రాయలసీమ, కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ వన్ మ్యాన్ షో చేశారు. భారీ బ్లాక్ బస్టర్ తో మహేశ్ టాప్ లీగ్ లో చేరడమే కాదు.. ఇండస్ట్రీ ప్రామిసింగ్ స్టార్ హీరో అయిపోయారు. తెలుగు సినిమాల్లో క్రిటికల్ కాన్సెప్ట్స్ తో ప్రయోగాలు చేసే హీరోగా మహేష్ కు పేరు ఉంది. ఒక్కడు బ్లాక్ బస్టర్ తర్వాత సమాజం మీద తిరగబడే పాత్రలో నిజం, చిన్నపిల్లాడి మనస్తత్వం ఉండే పాత్రలో నాని, తెలుగు నేటివిటీకి కలిసిరాని ట్రాజెడీక్ ఎండింగ్ లవ్ స్టోరీ బాబీ చేసి చవిచూశారు. అయితే.. గుణశేఖర్ దర్శకత్వంలో సిస్టర్ సెంటిమెంట్ తో చేసిన అర్జున్ హిట్ తో మళ్లీ హిట్ టాక్ ఎక్కారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శత్వంలో చేసిన అతడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మాత్రమే కాకుండా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ప్రతి సినిమాలో మహేష్ తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడమే కాకుండా తన స్టార్ పవర్ చూపించారు. తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని సంపాదించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆయనో ఎన్ సైక్లోపీడియా.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం: చిరంజీవి

కళాతపస్వి కె.విశ్వనాధ్ ఇకలేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నట్టు చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాధ్ భౌతికకాయాన్ని చిరంజీవి సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....

లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు

ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు. ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్: బాలకృష్ణ ‘ఊర’మాస్ వార్నింగ్.!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ కార్యక్రమాన్ని...

గ్రేట్‌ : మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే.. కష్టాల్లో ఉన్న ఎంతో మంది ఇండస్ట్రీ వారికి తనవంతు సాయం అందిస్తూనే ఉన్నాడు. లక్షలకు...

సీనియర్ దర్శకుడు సాగర్ ఇక లేరు

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే టాలీవుడ్ సత్యభామ జమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే నేడు...

రాజకీయం

కోటంరెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం పార్టీకి నష్టం లేదు: మంత్రి కాకాణి

ఎమ్మెల్యే కోటంరెడ్డికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని.. అదొక మ్యాన్ టాపింగ్ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి టీడీపీ ఉచ్చులో చిక్కుకుని...

తెలుగు సినిమా ఆభరణం.. కళాతపస్వి కె.విశ్వనాధ్

కథను తెరకెక్కించి సినిమాగా మలిచే దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ.. సినిమాలను తెరపై కావ్యాలుగా మలిచే దిగ్దర్శకులు కొందరే ఉంటారు. తన కళాత్మక చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన దర్శకుడు...

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం..! అర్ధరాత్రి ఘటన

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని...

బిగ్ క్వశ్చన్: వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.?

రోజులు గడుస్తున్నాయ్.. రోజులు కాదు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత...

స్వయంకృతాపరాధం.! నిండా మునుగుతున్న నెల్లూరు వైసీపీ.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. దాదాపుగా పరిస్థితి దిగజరారిపోయినట్లుగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో అసలు ప్రాతినిథ్యమే లేకుండా పోతుందా.? అన్నంతటి అయోమయం...

ఎక్కువ చదివినవి

పవన్ కల్యాణ్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’..! ప్రారంభమైన కొత్త సినిమా ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త సినిమా ప్రారంభమైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ సినిమాను...

రాశి ఫలాలు: సోమవారం 30 జనవరి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం సూర్యోదయం: ఉ.6:37 సూర్యాస్తమయం:సా.5:49 తిథి: మాఘశుద్ధ నవమి మ.2:00 వరకు తదుపరి దశమి సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం) నక్షత్రము: కృత్తిక రా.1:30 ని.వరకు తదుపరి రోహిణి యోగం: శుక్లం .మ.2:39...

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజా..! వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు క్లారిటీ

మెగా కుటుంబంలో మరో పెళ్లి సంబరం జరుగనుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వార్తను వరుణ్...

జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ సునామీ..! ఘనమైన రికార్డు సొంతం.. ఏకంగా..

రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ జపాన్ లో 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా 1200కోట్లు వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది....

తారకరత్నని విజయసాయి రెడ్డి కలవడం వెనుక కారణం ఏంటో తెలుసా?

గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తారకరత్నను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించడమేంటి అంటూ అంతా...