Switch to English

సినిమా రివ్యూ: ఏడు చేపల కథ

నటీనటులు: అభిషేక్ రెడ్డి, భాను శ్రీ, అయేషా సింగ్, మేఘన చౌదరి..
నిర్మాత: శేఖర్ రెడ్డి జివిఎన్
దర్శకత్వం: సామ్ జె చైతన్య
సినిమాటోగ్రఫీ: అర్లీ
మ్యూజిక్: కవి శంకర్
విడుదల తేదీ: నవంబర్ 7, 2019
రేటింగ్: 1/5

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువ అయ్యాయి. అలాంటి సినిమాలకు మించిన టాలీవుడ్ లో బాలీవుడ్ రేంజ్ సెమీ న్యూడ్ సీన్స్ తో, ఓవర్ డోస్ అడల్ట్ కంటెంట్ తో ఒక టీజర్ ని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘ఏడు చేపల కథ’. అడల్ట్ కంటెంట్ తో మాస్ మరియు యూత్ కి దగ్గరైన ఈ ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షోస్ కి 90% ఫుల్స్ అందుకున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

రవి(అభిషేక్ రెడ్డి), రాధ (భాను శ్రీ) మరియు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ తలసేమియా వ్యాధితో బాధపడుతుంటారు. వీరికి ప్రతి నెల బ్లడ్ ఎక్కిస్తుండాలి లేదంటే చనిపోతారు. వీళ్ళు ఫుడ్ కోసం దొంగతనాలు చేస్తూ, బ్రతకడం కోసం బ్లడ్ డోనర్స్ ని వెతుక్కునే పనిలో ఉంటారు. అలా ఓ రోజు రోడ్ మీద పడిపోయిన రవిని కాపాడి బ్లడ్ ఇచ్చిన భావన(అయేషా సింగ్)ని చూసి రవి ప్రేమలో పడతాడు. రవి భావన ప్రేమ కోసం రోజూ వెంటపడుతుంటాడు అదే టైంలో భావనకి ఎప్పుడు? ఎలా? జరిగిందో తెలియదు కానీ తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తన ప్రెగ్నెంట్ కి కారణం ఎవరో తెలుసుకోవడం కోసం భావన ఆత్మలతో మాట్లాడే సుందర్ (సునీల్ కుమార్) ని కలుస్తుంది.

ఇదిలా ఉండగా అలాగే మన రవి ఎవరైనా అమ్మాయి ఎక్స్ పోజ్ చేస్తే టెంప్ట్ అయిపోతుంటాడు. అలా చూసి టెంప్ట్ అయిన ప్రతి అమ్మాయి రాత్రి పూట రవి కోసం వచ్చి వెళ్తుంటారు. దీని వల్ల రవి కొన్ని సమస్యల్లో పడతాడు. అలా ఏ కారణం చేత అమ్మాయిలు రవి కోసం వచ్చి వెళ్తున్నారు? రవిలో అంత స్పెషల్ ఏముంది? వాళ్ళ వల్ల రవి ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? అసలు భావన ప్రెగ్నెన్సీకి ఎవరు కారణం? ఇంతకీ ఆత్మలతో మాట్లాడే సుందర్ కథేంటి? ఫైనల్ గా రవిని చూసి అమ్మాయిలంతా ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ సినిమా.

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి చెప్మా.. బాగా ఆలోచించాక…. టెంప్ట్ స్టార్ అయిన అభిషేక్ రెడ్డికి మొదటి సినిమా.. నటుడిగా కొన్ని కొన్ని సీన్స్ లో బాగా చేసాడు. అలాగే భానుశ్రీ, అయేషా సింగ్ లు కూడా పరవాలేధనిపించారు. అలాగే సుందర్ పాత్రకి సునీల్ కుమార్ పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా బాగా నటించాడు కూడాను. ఇంతకంటే ఎవరి గురించీ చెప్పలేం.. అదేంటి ట్రైలర్ లో చూపించిన అడల్ట్ పాయింట్ పరంగా ప్లస్ ఎం చెప్పలేదు అని ఆలోచించకండి ఎందుకంటే అలా సంతృప్తి పరిచే సీన్స్ సినిమాలో ఏం లేవు.

ఇక సినిమా అపారంగా చూసుకుంటే.. ఏదో చూపించేయబోతున్నారు అనే ఫీల్ తో అడల్ట్ సీన్స్ కి లీడ్ చేసే కొన్ని షాట్స్. అలాగే సెకండాఫ్ లో శ్రీ రెడ్డి స్పూఫ్ లా ట్రై చేసిన ఓ బిట్, మేల్ ప్రాస్టిట్యూషన్ పాయింట్ మరియు ఫ్రెండ్స్ మీద వచ్చే ఓ సీన్ కాస్త నవ్వులు తెప్పిస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

అడల్ట్ సీన్ లీడ్ అప్పుడు ఓ పాటతో పాటు వచ్చే మ్యూజిక్ బిట్ తప్ప టెక్నికల్ గా చెప్పుకునేవి ఏం లేవు.

మైనస్ పాయింట్స్

ఆన్ స్క్రీన్:

ఆన్ స్క్రీన్ పరంగా సినిమా మొదలవ్వగానే ప్రేక్షకులకి సినిమా చూడాలి అనేలా ఎదో ఒక విషయం కనెక్ట్ చెయ్యాలి, అప్పుడే ఆడియన్స్ సినిమాతో ట్రావెల్ అవుతారు. ఆ తర్వాతే మిగతా క్రాఫ్ట్స్.. ఈ విషయంలో డైరెక్టర్ చైతన్య దగ్గర పాయింట్ ఉన్నా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా జరుగుతున్న కొద్దీ కూడా ఏ ఒక్క పాత్రనీ, ఏ ఒక్క సీన్ కనెక్ట్ అయ్యేలా లేకపోవడం వలన ఆన్ స్క్రీన్ పరంగా ఆమేకు అన్నీ చిరాకు తెప్పిస్తాయి. అలాగే నటీనటుల నుంచి మంచి నటనని రాబట్టుకోవడంలో, కథలో అనుకున్న ఎమోషన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో డిజాష్టర్ అనిపించాడు. సెన్సార్, అడల్ట్ ఇష్యూ ఇలా కారణం ఏదైనా ప్రమోట్ చేసుకున్న కంటెంట్ ఒక 10% కూడా ఆన్ స్క్రీన్ లేకపోవడం ప్రేక్షకులని నిరాశ పరుస్తుంది అన్న చిన్న లాజిక్ ని కూడా మిస్ అయ్యారు.

ఆఫ్ స్క్రీన్:

డైరెక్టర్ సామ్ జె చైతన్య ఓ గొప్ప కథ, గొప్ప క్యారెక్టర్ చెప్పడానికి ట్రై చేయలేదు. స్టార్ పవర్ లేదు సో, నా సినిమాకి ఆడియన్స్ ని ఎలా రప్పించుకోవాలా అని కమర్షియల్ యాంగిల్లో అలోచించి ఓ రెగ్యులర్ హార్రర్ – కామెడీ జానర్ కథని తీసుకొని అందులో కామెడీ అనే యాంగిల్ ని తీసేసి హార్రర్ కి అడల్ట్ ని మిక్స్ చేసి చెబితే చాలనుకుని కథ రాసినట్టున్నారు. ఓన్లీ పేపర్ మీద కథ పరంగా చూసుకుంటే డీసెంట్ అనిపిస్తది కానీ తెరపైకి తీసుకు రావడంలో, ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఫైనల్ అవుట్ ఫుట్ విషయంలో అట్టర్ ప్లాప్ అయ్యాడు.

కథనం పరంగా అయితే లెక్కలేనన్ని బొక్కలు, ఎలా పడితే అలా కట్ చేయడం, సీన్స్ మధ్యలో సంబంధంలేని షాట్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యేదాకా మనకు సడన్ గా కథ గతంలోకి వెళ్ళింది అనేది అర్థం కాదు. ఫైనల్ అవుట్ ఫుట్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ, ఎడిటింగ్ లో అంటా జంప్స్ ఉంటాయి. అలాగే డబ్బింగ్ ట్రాక్ సరిగా లేదు, కలరింగ్, సౌండింగ్ ఏదీ క్లారిటీ లేకుండా జస్ట్ ట్రైలర్ తో క్రేజ్ వచ్చింది అని ఎలా ఉన్నా చూసేస్తారు అనే బలుపుతో రిలీజ్ చేసినట్టు అనిపిస్తోంది డైరెక్టర్ ఫిల్మ్ కట్ చూస్తుంటే.

డైరెక్టర్ గా మీరు ఇంత బోల్డ్ గా తీస్తే సెన్సార్ లేపేస్తుంది అని తెలిసినప్పుడు అదే అడల్ట్ కంటెంట్ ని అందంగా కట్ చేయకుండా ఎలా చెప్పగలగడమే కథా డైరెక్టర్ టాలెంట్.. లా సక్సెస్ అయినా దర్శకులు చాలా మంది ఉన్నారు కూడాను.. తన కథని ఎలా చెప్పి ప్రేక్షకులను మెప్పించవచ్చు అనే చిన్న విషయం మీద కూడా డైరెక్టర్ చైతన్య శ్రద్ధ పెట్టలేదనేది క్లియర్ గా తెసులుస్తుంది. కెప్టెన్ అఫ్ ది ఫిల్మ్ గా ప్రతి విషయంలో ఫెయిల్ అయ్యాడు.

చివరిగా డైరెక్టర్ చైతన్య గారు, ఈ మధ్య 5 నుంచి 10 నిమిషాలు షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు మైండ్ బ్లోయింగ్ అనేలా తీస్తుంటే, మీరు సినిమా చేస్తున్నారు అంటే ఎంత డెడికేషన్ తో చేయాలి. ఈ మధ్య తెలుగు సినిమా కొన్ని చిన్న చిన్న మంచి ప్రయత్నాలతో ముందడుగు వేస్తుంటే ఇలాంటి సినిమాలతో ఆ పేరుని, ఆ ముందడుగుని దిగజార్చే ప్రయత్నాలు చేయకండి. మా ఉద్దేశం అడల్ట్ సినిమా చేయద్దు, ఇలాంటి సినిమాలే తీయాలి అని చెప్పడం కాదు, తీసే సినిమాని జెన్యూన్ గా, డెడికేషన్ తో తీయండి. మీకు సినిమా తీయడం మీద, కథ మీద క్లారిటీ లేకపోతే చేయకండి. డైరెక్టర్ గా మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ టీం అందరూ మీ వల్ల మాట తీసుకుంటారు. ప్రతి ఒక్కటి చేతిలో డిజిటల్ ప్రపంచం ఉంది, ప్రేక్షకులు అప్డేట్ అయ్యారు, సో బీ కేర్ఫుల్ డైరెక్టర్ చైతన్య గారు అండ్ టు ఆల్ యంగ్ డైరెక్టర్స్.

విజువల్స్ పరంగా ఛాన్స్ ఉన్నా సరిగా తీయలేదు, అలాగే తీసిన కొన్ని మంచి విజువల్స్ కి డిఐ లేకపోవడం వల్ల తీసిన షాట్స్ కి వాల్యూ లేకుండా పోయింది. మ్యూజిక్ అస్సలు బాలేదు. ఎడిటింగ్ కి అయితే ఓ పెద్ద నమస్కారం. ఈ మధ్య టిక్ టాక్ చేసుకునే కామన్ పీపుల్ మేలు ఫోన్ లో చాలా బెస్ట్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే షూట్ పరంగా అవసరమైనవి ఇచ్చారు కానీ సరిగా వాడుకోలేదు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో మాత్రం జీరో ప్రొడక్షన్ కనిపిస్తుంది.

విశ్లేషణ:

‘ఏడు చేపల కథ’ – ఒక ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా, అందులోనూ ట్రైలర్ అడల్ట్ కంటెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. కథ బాలేకపోయినా ‘ఏ’ సర్టిఫికేట్ కంటెంట్ మనం పెట్టే టికెట్ కి న్యాయం చేసేస్తుంది కదా అనే భ్రమలో మీరు సినిమా టికెట్టు కొని లోపలి వెళ్లారో, బయటకి వచ్చేప్పుడు సినిమా గురించి మీ నాలుకపై అచ్చ తెలుగు సంస్కృతం నాట్యం చేస్తుంటుంది. ఆ టైంలో నెక్స్ట్ షో కోసం మీలానే ఎగ్జైట్ అయ్యి టికెట్ కొనుక్కున్న వాడు సినిమా ఎలా ఉంది అని అడిగితే మీ నుంచి ఓ బిగ్ బీప్ వేసుకునే రేంజ్ లో మాటలొచ్చినా ఆశర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ ‘ఏడు చేపల కథ’ చూసాక అంతలా నిరాశ పడతారు. ఫ్రీగా యు ట్యూబ్ లో పరి సార్లు టీజర్, ట్రైలర్ చూస్కోండి, హ్యాపీ ఫీలయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ సినిమా మీకు అన్ని విధాలా నష్టమే తప్ప మీకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు. కావున సినిమా చూడాలా వద్దా అనేది ఇక మీ నిర్ణయం..

ఫైనల్ పంచ్: ఏడు చేపల కథ – పెద్ద ….. బీప్…. లా ఉంది.

సినిమా

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 24 – అభిజిత్‌, సోహెల్‌ మాటకు...

మంగళ వారం ప్రసారం అయిన బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌ 24లో గొప్ప సంఘటనలు ఏమీ లేవు. ఉక్కు హృదయం టాస్క్‌ విషయమై మరోసారి అభిజిత్‌ మరియు...

అల్లు అర్జున్ ‘పుష్ప’: షూటింగ్ ప్లాన్ ఓకే, విలన్ సంగతేంటి.?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'తో ఇండస్ట్రీ హిట్ అందుకొని, ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్స్ కొల్లగొడుదామని సుకుమార్ డైరెక్షన్ లో...

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా ప్లాస్మా దానం..

చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా చిరంజీవి చేస్తున్న బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ సేవలు ఎంత ప్రాచుర్యం పొందాయో తెలిసిన విషయమే. ఎంతోమందికి వీటి...

సుశాంత్ మృతిపై ఎయిమ్స్ కీలక నివేదక.. ఆరోజు ఏం జరిగిందంటే..

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుపై ఎయిమ్స్ కీలక విషయాలను వెల్లడించింది. సుశాంత్ ఆత్మహత్యపై సుదీర్ఘ పరిశీలన అనంతరం కీలక రిపోర్టును ప్రభుత్వానికి...

సోనుసూద్ కు ‘ఐరాస’ పురస్కారం.. హాలీవుడ్ ప్రముఖుల సరసన చోటు

దేశంలో కరోనా వైరస్ విజృంభణ గురించి తెలిసిందే. అయితే.. కరోనా, లాక్ డౌన్ సమయంలో రీల్ లైఫ్ లో విలన్.. రియల్ లైఫ్ లో హీరో...

రాజకీయం

అందరూ నిర్దోషులే.. బాబ్రీ కూల్చివేతలో బీజేపీ నేతలకు భారీ ఊరట

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పులో బీజేపీ కురువృద్దులకు భారీ ఊరట లభించింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారంతా నిర్దోషులేనని సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీజేపీ సీనియర్ నేత...

దర్యాప్తు బాధ్యత పోలీసులదా.? ప్రతిపక్షానిదా.?

ఎట్టకేలకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ‘స్ట్రెయిట్‌ క్వశ్చన్‌’ దూసుకొచ్చింది. ‘దర్యాప్తు బాధ్యత పోలీసులదా.? ప్రతిపక్షానిదా.?’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్రంలో...

పిచ్చోడు కాల్చేసిన రధం.. పిల్లల కోసం విగ్రహం ధ్వంసం.!

మతి స్థిమితం లేని వ్యక్తి ఓ రధాన్ని దగ్ధం చేశాడట.. పిల్లలు లేరన్న కారణంతో, మూఢ భక్తితో విగ్రహాన్ని ధ్వంసం చేసి.. విగ్రహంలో కొంత భాగాన్ని ఇంటికి తీసుకెళ్ళి పూజలు చేశాడట ఓ...

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు.. బీజేపీ కురువృద్దుల్లో టెన్షన్

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీద్‌ కూల్చి వేయడం జరిగింది. మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీ, కేంద్ర మాజీ మంత్రి మురళి మనోహర్‌ జోషి మరియు ఉమా భారతిల మాటలకు...

ప్రత్యక్ష రాజకీయాల్లోకి హీరో నారా రోహిత్‌.?

యంగ్‌ హీరో నారా రోహిత్‌.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడట. చంద్రబాబు సోదరుడి కుమారుడైన నారా రోహిత్‌, నిజానికి.. చాలాకాలం క్రితమే రాజకీయాల్లోకి రావాల్సి వుంది. అయితే, అత్యంత చాకచక్యంగా సోదరుడి కుమారుడ్ని సినిమాల్లోకి...

ఎక్కువ చదివినవి

టిబి స్పెషల్: ‘ఎస్పీ బాలు..’ నోటితో చెప్పలేం.. రాతల్లో రాయలేం.. చెవులారా ‘వినా’ల్సిందే..!

మెలోడీ, ర్యాప్, కామెడీ, ట్రాజెడీ.. సందర్భం ఏదైనా అందుకుతగ్గ భావాన్ని అర్ధం చేసుకుని పాడటంలో ఆయన దిట్ట. తెరపై ఓ హీరో పాట వస్తుంటే ఆ హీరోనే స్వయంగా పాడుకున్నాడా అనే భావన...

జగన్ ను పార్టీ నేతలు ఇరుకున పెడుతున్నారా..? ఇప్పుడు రోజా కూడా..

ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చుకోవడంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా. ఓపక్క హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే ఆందోళనలు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈలోపు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి డిక్లరేషన్...

ఎన్సీబీ అధికారులకు దీపికా, శ్రద్ధ ఏం చెప్పారు?

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. అయితే ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతికి వెళ్ళాక కొత్త విషయాలు...

వైఎస్‌ జగన్‌ ఎఫెక్ట్‌తోనే జీవీఎల్‌ వికెట్‌ పడిందా.?

‘‘జీవీఎల్‌ నరసింహారావు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల భర్త ‘బ్రదర్‌’ అనిల్‌కి బంధువట..’’ అంటూ ఆ మధ్య సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఆ కారణంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని...

అయ్యోపాపం.. మంత్రిగారికి ‘తత్వం’ అలా బోధపడిందట.!

‘నాకంటే పుడింగి ఎవరూ లేరిక్కడ..’ అన్నంతగా చెలరేగిపోయారు ఆ మంత్రిగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీద ఈగవాలనియ్యకపోవడం అన్నది వేరే సంగతి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడ్డంలో ‘మాస్టర్‌ డిగ్రీ నాదే’...