Switch to English

‘వకీల్‌ సాబ్‌’ మూడ్‌లోకి జనసైనికులు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాకి టైటిల్‌ ఖరారయ్యింది.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ బయటకు వచ్చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో పవన్‌ కళ్యాణ్‌కి వున్న ‘పవర్‌ ఫుల్‌’ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రికార్డు స్థాయిలో ట్వీట్లు దర్శనమిచ్చాయి. ఇంకా ‘వకీల్‌ సాబ్‌’ పేరు సోషల్‌ మీడియాలో పోటెత్తుతూనే వుంది.

అంతా బాగానే వుందిగానీ, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంగతేంటి.? జనసేన పార్టీ రాజకీయం సంగతేంటి.? ప్రస్తుతానికైతే జనసేన పార్టీలో రాజకీయాల కన్నా ‘వకీల్‌ సాబ్‌’ గురించిన చర్చే ఎక్కువగా సాగుతోంది. జనసైనికులు, జనసేన నేతలూ పూర్తిగా ఈ ‘వకీల్‌ సాబ్‌’ మూడ్‌లోనే కన్పిస్తున్నారు. నిన్న మొన్నటిదాకా టీవీ చర్చా కార్యక్రమాల్లో రాజకీయ అంశాలపై తమ వాణిని కాస్తో కూస్తో బలంగానే విన్పించిన జనసేన ముఖ్య నేతలు, అనూహ్యంగా సినిమా మూడ్‌లోకి వచ్చేశారు. వారి నోట సినిమాటిక్‌ డైలాగులు వచ్చేస్తున్నాయి.. అదీ కీలకమైన రాజకీయ అంశాలకు సంబంధించి కావడం గమనార్హం.

‘మా వకీల్‌ సాబ్‌ వచ్చేస్తున్నాడు..’ అంటూ జనసేన నేతలు, చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుతోంటే, అది జనసైనికులకు కొంత ఇంపుగా వుండొచ్చుగాక.. కానీ, ప్రత్యర్థులకు అదో పెద్ద వెటకారంగా కన్పిస్తోంది. సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ విషయం 2019 ఎన్నికల్లో జనసైనికులకు అర్థమయి వుండాలి. సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా వున్నా, ప్రజాక్షేత్రంలో యాక్టివ్‌గా వుండకపోతే పరిస్థితులు ఏమాత్రం తమకు అనుకూలంగా వుండవనే విషయం జనసైనికులు ఇంకా తెలుసుకోకపోవడం ఆశ్చర్యకరమే.

పవన్‌ కళ్యాణ్‌ తిరిగి సినిమాలు చేస్తున్నదే, జనసేన పార్టీ కోసం. ఈ లెక్కన, జనసైనికులు మరింత బాధ్యతగా తమ అధినేత ఆశయ సాధన కోసం రాజకీయాల్లో ఇంకా యాక్టివ్‌గా వుండాల్సి వుంది. అయితే, సుదీర్ఘకాలంగా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులుగా వున్న కొందరు, ‘వకీల్‌ సాబ్‌’ విషయమై తమ అమితానందాన్ని చాటుకుని వుండొచ్చుగానీ, జనసేన పార్టీలో రాజకీయాల పరంగా సీరియస్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని ఇంకొందరు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా, జనసేన పార్టీకి ‘వకీల్‌ సాబ్‌’ కొంత ఊపు తీసుకొస్తోన్న మాట వాస్తవం. అయితే, అది సినిమాటిక్‌గా మారకుండా, పొలిటికల్‌ హీట్‌ పెంచేలా వుంటే అది ఆ పార్టీకే మంచిది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

6 ఏళ్ల ‘మనం’ జర్నీలో ఆసక్తికర విషయాలు కొన్ని.!

తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియంది కాదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వాన్ని నాగార్జున దిగ్విజయంగా కొనసాగిస్తే.. ఆయన తనయులు నాగ చైతన్య, అఖిల్ తో...

ఫ్లాష్ న్యూస్: లైవ్ ఇంటర్వ్యూలో భూకంపానికి బెదరని ప్రధాని.!

మనం మాట్లాడుతున్నప్పడు ఏదైనా శబ్దం వస్తేనే విసుగనిపిస్తుంది.. భారీ శబ్దమైతే ఉలిక్కిపాటుకు గురవుతాం. కానీ.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను అని నిరూపిస్తున్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. వెల్లింగ్టన్ లో స్థానికంగా ఓ...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

బిగ్ స్టోరీ: ఈ ‘సినిమా’ కష్టాలు ప్రభుత్వాలకి అర్థమవుతాయా.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా షూటింగులు ఎప్పుడో ఆగిపోయాయ్‌.. సినిమా థియేటర్లూ మూతబడ్డాయ్‌. లాక్‌డౌన్‌ సడలింపులతో సినీ పరిశ్రమకూ కొంత ఊరట కలుగుతుందని అంతా భావించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు చేసుకోవచ్చని...

వైసీపీ పైత్యం: హైకోర్టుకీ దురుద్దేశాలు ఆపాదిస్తారా.?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో 60 సార్లకు పైగా న్యాయస్థానాల నుంచి మొట్టికాయలేయించుకోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పరిపాలన అన్నాక ఇలాంటివి సహజమే. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు న్యాయస్థానాలు చీవాట్లు...