Switch to English

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం – బిలో యావరేజ్ రియలిస్టిక్ డ్రామా

91,245FansLike
57,261FollowersFollow

నాంది చిత్రంతో సీరియస్ రియలిస్టిక్ డ్రామాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ మరోసారి అలాంటి జోనర్ కు చెందిన చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రోమోలతో ఇదేదో సీరియస్, హార్డ్ హిట్టింగ్ చిత్రంలా అనిపించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

శ్రీనివాస్ శ్రీపాద (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. మారేడుమిల్లి అనే గిరిజన ప్రాంతంలో ఎన్నికలు సజావుగా నిర్వహించే బాధ్యత అతనికి అప్పగిస్తుంది ప్రభుత్వం. తన టీమ్ తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన శ్రీనివాస్ కు అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్న విషయం అర్ధమవుతుంది.

ఆ గిరిజనులు ఎదురుకొనే సమస్యలు ఎలాంటివో తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఈ సమస్యల విషయంలో శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. దానివల్ల తనకు ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇంతకీ ఎన్నికల నిర్వహణ సజావుగా పూర్తయిందా? సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు నరేష్. ఇలాంటి రియలిస్టిక్ డ్రామాలకు తాను పెర్ఫెక్ట్ గా సరిపోతాను అని మరోసారి నిరూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే చిత్రం మొత్తాన్ని తన భుజాలపై మోశాడు నరేష్. ఆనంది తన పాత్ర వరకూ చక్కగా చేసింది. అయితే తన పాత్ర విషయంలో దర్శకుడు ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, తదితరులు తమ తమ పరిధుల మేరకు బాగానే రాణించారు. మిగతా వాళ్లంతా మాములే.

సాంకేతిక వర్గం:

దర్శకుడు ఏఆర్ మోహన్, కథగా మంచి కాన్సెప్ట్ నే తీసుకున్నాడు. తాను అనుకున్న మెసేజ్ ను అయితే చెప్పగలిగాడు కానీ ఆ చెప్పే క్రమంలో సినిమా గతి తప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. స్క్రీన్ ప్లే ఊహాజనితంగానే ఉంది. ఇక దర్శకుడు కథలోకి వెళ్ళడానికి కావాల్సినదానికన్నా ఎక్కువ సమయమే తీసుకోవడం కూడా నెగటివ్ అయింది. కాన్సెప్ట్ గా చూసుకుంటే ఈ చిత్రం అద్భుతం. అయితే చెప్పే విధానంలోనే ఉంది సమస్య అంతా.

శ్రీచరణ్ పాకల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే పాటల విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకోవాల్సింది. రామ్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు.

ప్లస్ పాయింట్స్:

  • నరేష్ పెర్ఫార్మన్స్
  • చిత్రంలో ఇచ్చిన మెసేజ్

నెగటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • పేలవమైన డైరెక్షన్
  • స్లో నరేషన్

చివరిగా:

నరేష్ అద్భుతమైన పెర్ఫార్మన్స్, లాస్ట్ లో ఇచ్చే మెసేజ్ ను పక్కన పెడితే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అందరినీ మెప్పించే అవకాశాలు లేవు. కేవలం కొన్ని వర్గాలకే రుచించే ఈ చిత్రాన్ని ఈజీగా స్కిప్ చేయవచ్చు.

తెలుగు బులెటిన్. కామ్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

వాల్తేర్ వీరయ్య కోసం సమాయత్తమవుతోన్న తెలంగాణ చిరంజీవి యువత

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో స్థానం...

‘నాటు.. నాటు ఆస్కార్ గెలవాలి..’ జనసేనాని ఆకాంక్ష.. అభినందనలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు.. నాటు పాట ఎంపికైనందుకు హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

కృష్ణగారు హంట్ చూసి మెచ్చుకుంటారు అనుకున్నా – సుధీర్ బాబు

నటుడు సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటించిన చిత్రం హంట్. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’.. సినీ ప్రముఖుల అభినందన

భారతీయ సినీ ప్రేమికుల ఆశలకు అనుగుణంగా 95వ ఆస్కార్ నామినేషన్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంపికైంది. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో ది...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ...

రాజకీయం

తెలంగాణలో పర్యటిస్తా.. ఈసారి వదలను.. పొత్తుకు ఎవరొచ్చినా ఓకే: పవన్

‘తెలంగాణ అసెంబ్లీలో 10మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి. పరిమిత సంఖ్యలోనే అసెంబ్లీ, 7-14 లోక్ సభ స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయని స్థానాల్లో జనసేన సత్తా చాటాలి. మన భావజాలానికి...

అదిగదిగో జనసేనాని ‘వారాహి’.! ఏపీలో ఆపేదెవరు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ‘వారాహి’ వాహనం అడుగు పెట్టబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ‘వారాహి’ వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...

‘అమ్మో’రికా.! జర జాగ్రత్త కుర్రాళ్ళూ.!

అమెరికా.. ఇది చాలామందికి కలల ప్రపంచం.! ఔను, జీవితంలో స్థిరపడాలంటే, అమెరికా వెళ్ళాల్సిందే.. అనుకుంటోంది నేటి యువత.! ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉన్నతమైన ఉద్యోగం కోసం కావొచ్చు.. అమెరికా వైపే నేటి...

జనసేనాని పవన్ కళ్యాణ్ ‘వారాహి’.! ఎందుకంత ప్రత్యేకం.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పర్యటనల నిమిత్తం ‘వారాహి’ అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. పాదయాత్రలకు ఎలా పేర్లు పెడుతుంటారో, రాజకీయ నాయకులు తమ ప్రచార వాహనాలకి కూడా పేర్లు...

ఎక్కువ చదివినవి

అరవ హీరోను నమ్ముకుని నిండా మునిగిన రాజుగారు..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు తమిళ తంబీలు పట్టం కడుతున్నారు. అయితే...

ఢిల్లీలో భారీ భూప్రకంపనలు..! భయభ్రాంతులకు గురైన ప్రజలు

దేశ రాజధాని ఢిల్లీని భూకంప ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు వణికించాయి. భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. పొరుగు దేశం ఢిల్లీకి దగ్గరలో ఉన్న నేపాల్ లో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీలో...

‘నాపై రాళ్ల దాడి జరగలేదు..’ బళ్లారి ఘటనపై సింగర్ మంగ్లీ క్లారిటీ

కర్ణాటకలోని బళ్లారిలో శనివారం రాత్రి జరిగిన బళ్లారి ఫెస్టివల్ లో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందనే విషయం కలకలం రేపింది. మీడియాలో వచ్చిన ఈ వార్తలపై మంగ్లీ స్పందించారు. తనపై...

దిల్ రాజు ఇంట్లో వారసుడు సక్సెస్ పార్టీ.. హాజరైన హీరో విజయ్

తమిళ హీరో విజయ్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా వారసుడు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ మంచి టాక్ తో రన్ అవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో...

’24 గంటల్లో క్షమాపణ చెప్పాలి..’ బాలకృష్ణ, టీడీపీకి కాపునాడు అల్టిమేటం..

వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు...