తమిళంలో సెన్సేషన్ గా నిలిచిన లవ్ టుడే చిత్రం ఈరోజే తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి యూత్ ను టార్గెట్ చేసిన ఈ చిత్రం దిల్ రాజు సపోర్ట్ తో విడుదలైంది. మరి ఇది ఎలా ఉందో చూద్దామా.
కథ:
లవ్ టుడే కథ చాలా సింపుల్. ఇద్దరు సింపుల్ వ్యక్తుల మధ్య ప్రేమ కథ ఈ చిత్రం. అయితే ట్రైలర్ లో చూపించినట్లు అమ్మాయి తండ్రి పెళ్ళికి ఒప్పుకోవాలంటే ఇద్దరి ఫోన్లను ఒకరోజు మార్చుకోవాలని కండిషన్ పెడతాడు. ఆ తర్వాత జరిగే తంతు అంతా లవ్ టుడే చిత్ర కథ.
చివరికి ఫోన్లు మార్చుకున్న ఈ యువత జీవితాలు ఎలా మారాయి? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
నటీనటులు:
ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకుడే కాక హీరో కూడా. ఇక లీడ్ యాక్టర్ పాత్రలో జీవించేసాడు ప్రదీప్. హీరోగా తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్రస్ట్రేషన్ చూపించే సీన్స్ లో ప్రదీప్ నటన మెచ్చుకోవచ్చు. ఇవానా హీరోయిన్ గా మెప్పిస్తుంది. ముఖ్యంగా ప్రదీప్ తో ఆమె కెమిస్ట్రీ చాలా బాగుంది.
సత్యరాజ్, రాధికా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. యోగిబాబు కామెడీ కూడా పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
ప్రదీప్ రంగనాథన్ ఈ తరం యువతకు కనెక్ట్ అయ్యే పాయింట్ నే తీసుకున్నాడు. ఇక దీనికి తనదైన శైలి హ్యూమర్ ను జోడించి చక్కటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఈ చిత్రంలో మరీ హడావిడి ఏం ఉండదు. చాలా సింపుల్ స్టోరీలైన్ ను అంతే సింపుల్ గా ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే సెకండ్ హాఫ్ విషయంలో ఉన్న ఒకే ఒక్క కంప్లైంట్… రొటీన్. దాదాపు ప్రతీ సీన్ ఏం జరుగుతుందో ఊహించేయొచ్చు.
యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికున్న మెయిన్ ప్లస్ పాయింట్స్ లో ఒకటి. తన స్కోర్ తో సీన్ క్రెడిబిలిటీ పెంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది అలాగే ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ కూడా.
ప్లస్ పాయింట్స్:
- కాన్సెప్ట్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- క్లైమాక్స్
- సెకండ్ హాఫ్
విశ్లేషణ:
ఈ తరం యూత్ తో విపరీతంగా కనెక్ట్ అయ్యే లవ్ టుడే కచ్చితంగా ఆ వర్గాన్ని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే కొంచెం మిడిల్ ఏజ్, వయసు మళ్ళిన వాళ్ళు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నదాని మీదే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.