అతి త్వరలో పెట్రోల్ ధర దేశంలో వంద రూపాయల మైలు రాయిని అందుకోనుందా.? అంటే, ఔననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నిజానికి, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా, మన దేశంలో మాత్రం.. వాహనదారులకు ఆ ‘ఫలాలు’ అందకుండా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ‘ఆయిల్ కంపెనీల మీద వున్న ప్రేమ’ సామాన్యుడి మీద పాలకులకు లేకపోవడం ఆశ్చర్యకరమే మరి.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గగానే, కేంద్రం పన్నుల మీద పన్నులు వేసేస్తుంటుంది. ఈ క్రమంలో రాష్ట్రాలూ తమకు తోచిన రీతిలో బాదేస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. ‘పెట్రోల్ ధరల విషయంలో రాష్ట్రాలదే తప్పు. రాష్ట్రాలు తమ పన్నుల్ని తగ్గించుకుంటే, పెట్రోల్ ధర సామాన్యుడికి కాస్త ఊరటనిస్తుంది..’ అని బీజేపీ నేతలు ‘నీతి వాక్యాలు’ చెబుతుంటారు. కాంగ్రెస్ హయాంలో పెట్రో ధరలు పెరిగినప్పుడు మాత్రం, ఇదే బీజేపీ నేతలు ‘దేశద్రోహం’ అనే స్థాయిలో విమర్శలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?
పైగా, ఇది కరోనా కాలం. దేశమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడిపోతోంది. సామాన్యుడి జేబులోకి రూపాయి రావడమే కష్టంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ‘ముక్కు పిండి మరీ’ పెట్రో బాదుడు ఏంటి.? అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి సమాధానం దొరకడంలేదు. ‘పెట్రో అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి ప్రజలకే ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్రాలు చేసేది కూడా అదే.. ఆదాయం గణనీయంగా పడిపోయింది.. ఈ నేపథ్యంలో పెట్రో పన్నులు ఖజానాకి ఊపిరి పోశాయి..’ అని నిస్సిగ్గుగా చెబుతున్నారు అధికారంలో వున్న వారు.
నిజమే, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలంటే అధికార పార్టీలకు ఖజానా కళకళ్ళాడాలి.. ఆ ఖజానా నింపడానికి మళ్ళీ సామాన్యుడి జేబు.. కాదు కాదు, సామాన్యుడి పొట్ట కొట్టాల్సిందే. ఇదా అభివృద్ధి.? అని ప్రశ్నిస్తే.. ‘దేశద్రోహులు’ అనే ముద్ర వేసేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఆల్రెడీ 80 రూపాయలు దాటేసిన పెట్రోల్ ధర, జులై చివరి నాటికి సెంచరీ కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు సర్వత్రా విన్పిస్తున్నాయి. పెట్రోల్తోపాటు డీజిల్ కూడా అనూహ్యంగా పెరుగుతున్న దరిమిలా, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటేస్తున్నాయి. గోరు చుట్టు మీద రోకలి పోటు.. అంటే ఇదే మరి.
444889 599712Hi. Cool article. There can be a issue with the web internet site in firefox, and you may want to test this The browser is the marketplace leader and a huge portion of folks will miss your outstanding writing due to this difficulty. 512108
235098 354486Hi there! This is my first visit to your blog! We are a collection of volunteers and starting a new project in a community in the same niche. Your blog provided us useful information to work on. You have done a extraordinary job! 843553
687815 990137I got what you intend, saved to my bookmarks , very decent site . 314095