కరోనా బాధితులకు రెండు రోజుల్లో మరో గుడ్ న్యూస్. కరోనాను అరికట్టేందుకు ‘ఫ్యావిపిరవిర్’ తయారు చేసేందుకు గ్లెన్ మార్క్ కు అనుమతులిచ్చిన డీసీజీఐ.. ఇప్పుడు మరో ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ ‘రెమ్ డెసివిర్’ తయారీకి కూడా అనుమతి ఇచ్చింది. ప్రముఖ జనరిక్ ఔషధ సంస్థ హెటిరోకు అనుమతులు ఇచ్చింది. ‘కొవిఫర్’ పేరుతో హెటిరో భారత్ లో మందును అందుబాటులోకి తీసుకురానుంది.
‘కొవిఫర్’ ను కరోనాతో బాధపడుతున్నవారు ఎవరైనా వాడొచ్చని డీసీజీఐ తెలిపింది. కరోనా తీవ్రతను తగ్గించే ఈ మందు ‘కొవిఫర్’100 ఎంజీ ఇంజెక్షన్ రూపంలో ఉంటుందని పేర్కొంది. దీని ధర 5వేల నుంచి 6వేల వరకూ ధర ఉండొచ్చని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 127 దేశాల్లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశాలు ఉన్నాయి.
దీనిపై కంపెనీ చైర్మన్ పార్థసారధి మాట్లాడుతూ..’ప్రస్తుత సమయంలో ‘కొవిఫర్’ ను తయారు చేసేందుకు అనుమతి రావడం సంతోషంగా ఉంది. అతి త్వరలోనే ఈ మందును అందుబాటులోకి తీసుకొస్తాం. మందును వీలైనంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తాం. కరోనా తీవ్రత పెరిగిపోతున్న దశలో ఇదొక అద్భుతంగా భావిస్తున్నాం. హైదరాబాద్ లోనే ఈ మందు ఉత్తత్తి జరుగనుంది’ అన్నారు.
హెటిరోకు జనరిక్ మందులు ఎక్కువగా తయారు చేస్తుంది. గిలీడ్ సైన్సెస్ జనరిక్ వెర్షన్ లో ‘కొవిఫర్’ను అందుబాటులోకి తీసుకురానుంది. గిలీడ్ సైన్సెస్ కు ఇప్పటికే దేశంలోని పలు జనరిక్ ఫార్మాలతో ఒప్పందాలు కలిగి ఉంది. ‘రెమ్ డెసివిర్’ తయారు చేసే టెక్నాలజీ కూడా గిలీడ్ నుంచి కంపెనీలకు చేరిందని తెలుస్తోంది.
438415 20686The electronic cigarette uses a battery and a small heating factor the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 602128
296721 120517This web site is really a walk-through for all with the info you wanted about it and didnt know who to question. Glimpse here, and youll undoubtedly discover it. 900988