Switch to English

ఏపీతో ఆ విషయంలో తెలంగాణ పోటీ పడగలదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో 20 వేలకు పైగా పరీక్షలు రోజుకి జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా. మరి, తెలంగాణలోనో.? రోజుకి వెయ్యి, ఆ పైన జరిగితే గొప్ప అన్నట్లుంది పరిస్థితి. మొదట్లో కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో సమర్థవంతంగా వ్యవహరించిన తెలంగాణ, ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితి కన్పిస్తోంది. పదుల సంఖ్యలో పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. తెలంగాణలో మొత్తంగా కరోనా పరీక్షలు ఇటీవలే 50 వేలు దాటాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ 6 లక్షల పరీక్షల్ని ఇప్పటికే పూర్తి చేసేసింది.

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఇంత స్పష్టమైన తేడా వుంది. నిజానికి, తెలంగాణలోనే అవకాశాలెక్కువ. ‘ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌’ అనీ, ఇంకోటనీ.. తెలంగాణ కుంటి సాకులు చెబుతోందన్న విమర్శలు గట్టిగానే విన్పిస్తున్నాయి. 50 వేల పరీక్షలు వారం పది రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశించినా, ఆ స్థాయిలో పరీక్షలు జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిన్నటికి నిన్న, తెలంగాణలో మొత్తం 1200 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటూ సోషల్‌ మీడియాలో ట్వీట్లు పోటెత్తాయి ‘అన్‌ అఫీషియల్‌’ అని పేర్కొంటూ. కానీ, లిస్ట్‌లో సగం మాత్రమే కేసులు చూపారు అధికారికంగా. ‘అంటే, 50 శాతం డిస్కౌంట్‌ ఇచ్చారన్నమాట’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేయడం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది.

‘అది దాచే వ్యవహారం కాదు.. కేసులెక్కువ వుంటే, ఆసుపత్రులకు రోగులు పోటెత్తేస్తారు కదా..’ అని ఆ మధ్య ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచీ ఒత్తిడి పెరుగుతుండడంతో, ‘ఈ సమయంలో రాజకీయాలు చేయడం సబబు కాదు..’ అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కొంత అసహనం వ్యక్తం చేశారు.

ఒక్కటి మాత్రం నిజం.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెంచడం, ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవసరమైతే.. ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనల్ని కరినతరం చేయడం తప్పనిసరి. కరోనా టెస్టుల విషయంలో ఏపీతో ఖచ్చితంగా తెలంగాణ పోటీ పడాల్సిందే. లేకపోతే, తెలంగాణ ప్రభుత్వం అపప్రధను మూటగట్టుకునే ప్రమాదం తప్పదు.

5 COMMENTS

  1. 549554 526454Good post. I learn something much more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a little something from their store. Id prefer to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a link on your internet weblog. Thanks for sharing. 589868

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...