Switch to English

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం – డేంజర్ జోన్లో ఇండియా.!

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో కేసుల సంఖ్య చైనాను దాటేసింది. అయితే, మరణాలు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. దేశంలో మూడో విడత లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. దానిని పొడిగిస్తున్నట్టు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, సడలింపులు నేడో, రేపో కేంద్రం ప్రకటించనుంది. లాక్ డౌన్ ప్రకటించి 54 రోజులవుతున్నా.. వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టడంలేదు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 85,784 కేసులు నమోదు కాగా, దాదాపు 2700 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఈ వైరస్ పుట్టిన చైనాలో ఇప్పటివరకు 82,933 కేసులు నమోదు కాగా, 4,633 మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం చైనాలో కొత్తగా నాలుగు కేసులు నమోదు కాగా, మొత్తం 91 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దాదాపు 78వేల మందికి పైగా కరోనా బాధితులు కోలుకున్నారు. మనదేశంలో మాత్రం ఇప్పటివరకు దాదాపు 30వేల మంది మాత్రమే కోలుకున్నారు. ఏప్రిల్ 30 నాటికి భారత్ లో దాదాపు 35వేల కేసులు ఉండగా.. 11 రోజుల్లో అవి రెట్టింపయ్యాయి.

ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగువేల మధ్య కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉండగా.. చైనా 13వ స్థానంలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు నమోదైన అమెరికా తొలి స్థానంలో ఉంది. అక్కడ కేసులు 15 లక్షలకు సమీపిస్తున్నాయి. మరణాలు కూడా 90వేలకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక 2.74 లక్షల కేసులతో స్పెయిన్ రెండో స్థానంలో ఉండగా.. 2,63 లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్రిటన్, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, ఇరాన్ ఉన్నాయి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

కరోనా వైరస్‌: మే 31 తర్వాత ఏం జరుగుతుంది.?

జూన్‌ 1న కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ‘గత రెండు మూడు నెలలుగా కరోనా వైరస్‌ దెబ్బకి లాక్‌డౌన్‌లో...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదీ.?

‘మేం అధికారంలోకి వస్తే, కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తాం..’ అని 2014 నుంచి 2019 వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నినదించింది. 2014 ఎన్నికల్లోనూ ఈ ప్రత్యేక హోదా...

ఏపీలో మొదటి రోజే వరుస కేసులతో చంద్రబాబుకి షాక్.!

లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ లో ఉండడంతో లాక్ డౌన్ కాలమంతా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 60 రోజుల తర్వాత ఏపీ ప్రభుత్వం...

14 వేల సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన తారలు

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్...

బాలయ్య – ఎన్టీఆర్ కాంబో మూవీ.. సాధ్యమయ్యేనా?

నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ అది ఇప్పటివరకూ సాధ్యమవ్వలేదు. బాలయ్య హీరోగా నటించిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో...