Switch to English

హైదరాబాద్ నుంచే కేరళ గోల్డ్ స్మగ్లింగ్ సొమ్ము

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు లింకులు హైదరాబాద్ లో తేలాయి. దీనికి సంబంధించిన సొమ్ము హవాలా మార్గంలో హైదరాబాద్ నుంచే దుబాయ్ కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ఇప్పటివరకు కేరళకు మాత్రమే పరిమితమైన వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ కు ముడిపడటంతో కలకలం రేగుతోంది. కేరళ ప్రభుత్వానికి చెందిన ఐటీ విభాగంలో పనిచేస్తున్న స్వప్నా సురేశ్.. త్రివేండ్రంలోని యూఏఈ కాన్సులేట్ ఆఫీసును అడ్డం పెట్టుకుని బంగారం అక్రమ రవాణాకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈమె లింకులు కేరళ సీఎంఓలో కూడా బయటపడటంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది.

ఈ క్రమంలో ఆమెతోపాటు ఆమెకు సహకరిస్తున్న ఐఏఎస్ అధికారిని కూడా కేరళ సర్కారు వేటు వేసింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు స్వప్నా సురేశ్ తోపాటు ఈ రాకెట్ లో ప్రమేయం ఉన్న సందీప్ నాయర్ లను అరెస్టు చేసి విచారించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి. 30 కిలోల బంగారానికి సంబంధించిన సొమ్మును హవాలా మార్గంలో హైదరాబాద్ నుంచి దుబాయ్ పంపించినట్టు తేలింది. రూ.15 కోట్లు ఒక విడతలో, రూ.35 కోట్లు మరో విడతలో అక్కడకు పంపించినట్టు గుర్తించారు.

దీంతో కస్టమ్స్ అధికారులు ఈ సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అందజేయడంతో వారు రంగంలోకి దిగి విచారణ జరిపారు. అనంతరం ఆ వివరాలను హైదరాబాద్ లోని ఎన్ఐఏ విభాగానికి అందజేశారు. స్వప్నా సురేశ్ కూడా నాలుగైదు సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్లినట్టు వెల్లడైంది. హవాలా మార్గంలో సొమ్ము పంపించే విషయం గురించి చర్చించడానికి ఆమె హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా విచారణలో ఆమె హైదరాబాద్ కు చెందిన కొంతమంది వ్యాపారుల పేర్లు కూడా చెప్పినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు బేగంబజార్ కు చెందిన బంగారం వర్తకులపై దృష్టి సారించినట్టు సమాచారం. ముఖ్యంగా గతంలో బంగారం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నవారి వివరాలు సేకరిస్టున్నట్టు తెలిసింది. మరి వీరి దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...