ఐదేళ్ల క్రితం ఏపీలోని నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో బాధితురాలు మేజర్ కావడంతో కేసు విచారించలేమన్న ఫోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలను ఏపీ హైకోర్టు గత మేనెలలో రద్దు చేసింది. ఘటన జరిగిన సమయానికి ఆమె మైనర్ కావడంతో.. మైనర్లపై జరిగే అత్యాచార కేసులను విచారించేందుకు ఏర్పాటైన పోక్సో న్యాయస్థానమే కేసు విచారించాలని ఆదేశించింది. దీంతో ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న రషితేశ్వరి తండ్రికి కాస్త ఊరట దక్కింది.
రిషితేశ్వరిపై ర్యాగింగ్, లైంగిక వేధింపులు జరగడంతో 2015 జులై 14వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. అయితే.. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకునే సమయానికి మేజర్ కావడంతో ఈ కేసును తాము విచారించలేమని ఫోక్సో న్యాయస్థానం స్పష్టం చేసింది. సంబంధిత కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో రిషితేశ్వరి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.
బాధితురాలు ఆత్మహత్య తేదీ కాకుండా లైంగిక వేధింపులు జరిగిన తేదీని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సాక్ష్యాధారాలను సేకరించి కేసును ఆరు నెలల్లో తేల్చాలని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ కు చెందిన రిషితేశ్వరి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. నిందితులను రాజకీయ నేతలు కాపాడుతున్నారంటూ విమర్శలు వచ్చాయి.
605959 292125I discovered your blog web site on google and check just a couple of of your early posts. Proceed to sustain up the outstanding operate. I just extra up your RSS feed to my MSN Information Reader. Seeking forward to reading far more from you in a whilst! 832019
157997 511203hey there, your website is fantastic. I do thank you for function 670277
92640 316309As I internet site owner I conceive the content material material here is rattling superb , thanks for your efforts. 927333
508818 86438This really is a very good topic to speak about. Sometimes I fav stuff like this on Redit. This article probably wont do nicely with that crowd. I will be positive to submit something else though. 822832