Switch to English

తప్పదా.? జనసేనాని ‘పవర్‌’ చూపించాల్సిందేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ తరఫున చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్న విమర్శలు.. పార్టీకీ, ఎమ్మెల్యేకీ మధ్యలో ఎక్కడో సమన్వయలోపం.. ఆ మాటకొస్తే, పార్టీలోనే నిస్తేజం.. ఇదీ జనసేనలో నిన్న మొన్నటిదాకా నెలకొన్న పరిస్థితి. ఒక్క మాట.. ఒకే ఒక్క మాట.. అధినేత నోట వస్తే, ఆ తర్వాత పవర్‌ ఎలా వుంటుందో జనసైనికులకే కాదు, రాజకీయ ప్రత్యర్థులకీ తెలిసొస్తోంది.

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ విషయంలో, అధికార పార్టీ ప్రదర్శిస్తున్న ‘అత్యుత్సాహం’, జనసేనకు కొండంత బలాన్ని తెచ్చిపెడుతోంది. ఒక్క ఎమ్మెల్యేనే వున్నాడు కదా.. పార్టీ ఏం చేయగలదు? అనుకున్న అధికార పార్టీకి, ఆ ఒక్క ఎమ్మెల్యేతోనే పెద్ద షాక్‌ తగిలింది. రాపాక వరప్రసాద్‌ విషయంలో అధికార పార్టీ తన ఓవరాక్షన్‌కి తగిన మూల్యం చెల్లించుకుంది. కోర్టు మొట్టికాయలేసిందంటే.. ఆ మొట్టికాయలు ప్రభుత్వానికీ గట్టిగా తగిలినట్లే.

ఇదిలా వుంటే, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, ఆ పార్టీకి బాకా ఊదే కొన్ని మీడియా సంస్థలు ‘పేకాట ఎమ్మెల్యే’ అంటూ నిస్సిగ్గుగా మాటలు జారేస్తుండడం హాస్యాస్పదం. విషయం పేకాటకు సంబంధించినదే కావొచ్చు.. దాంట్లో ఎమ్మెల్యే అనుచరులో.. ఎమ్మెల్యే మద్దతుదారులైన సాధారణ ప్రజలో వుండి వుండొచ్చు. అంతమాత్రాన పేకాట ఎమ్మెల్యే అనేస్తారా.?

అదే నిజమైతే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత బెట్టింగ్‌ కేసులో ఇరుక్కున్నారు గతంలో. ఆయనిప్పుడు అధికార పార్టీలో అత్యంత కీలకమైన పదవిలో వున్నారు. మరి, ఆ బెట్టింగ్‌ రాజా విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఏమని చెబుతారు.? వైసీపీకి వంత పాడుతున్న మీడియా ఆ బెట్టింగ్‌ కింగ్‌పై ఏం సమాధానం చెప్పగలదు? జనసేన పార్టీ నుంచి దూసుకొస్తున్న ప్రశ్నలివి.

పవన్‌కళ్యాణ్‌ సంయమనం పాటిస్తున్నారంటే.. దానర్థం, అధికార పార్టీకి ఇంకా సమయం ఇస్తున్నారని. ఆ మౌనాన్ని ఛేదించాలనుకుంటే, ఆ తర్వాత పరిస్థితులు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయన్నది నిర్వివాదాంశం. కానీ, ‘కెలుక్కోవడం’ పైనే అధికార పార్టీ ఫోకస్‌ పెడ్తుంది. సో, జనసేనాని ‘పీపుల్స్‌’ పవర్‌ చూపించాల్సిందేనేమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎక్కువ చదివినవి

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...