ఏపీలోని వైద్య విద్యార్ధులకు రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై వైద్య విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించే అవకాశం లేదు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్స్ ధరించలేరు. మహిళా విద్యార్థులు చీరలు, లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలి. ఈమేరకు డీఎంఓ డాక్టర్ వినోద్ కుమార్ మెడికల్ కాలేజీ సూపరింటెండ్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా.. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని సూచించారు. మహిళలు జుట్టును వదులుగా వదిలేయవద్దని కూడా సూచించింది. ఇకపై తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాటించకపోవడంతో అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై బోధనాసుపత్రులకు రోగులు వస్తే సహాయకులు లేరనే కారణంతో వారిని చేర్చుకోవడం మానొద్దని కూడా సూచించింది.
252280 624650Nice read. I just passed this onto a buddy who was performing some research on that. He just bought me lunch since I found it for him! Thus let me rephrase: Thanx for lunch! 64055