పోలవరం విషయంలో చంద్రబాబునాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పోలవరం సందర్శనపై ఆయన చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఈమేరకు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పోలవరం పర్యటన చేసే ముందు తాను వేసే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.
- విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులతో నిర్మాణం చేస్తామంటే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేస్తానన్న మాట నిజం కాదా..?
- పోలవరం లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ కు నీళ్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు.?
- కాఫర్ డాం నిర్మాణం లేకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం ఎందుకు పూర్తి చేశారు.?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ప్రజలను మోసం చేసినట్టే. ఇవి చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పులు కాదా..? అని అంబటి రాంబాబు అన్నారు.