హిట్ ఫ్రాంచైజ్ లో సెకండ్ మూవీ హిట్ 2 ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దామా.
కథ:
క్రిమినల్స్ ను పిచ్చ లైట్ గా, కేర్ కూడా చేయని యాటిట్యూడ్ ఉన్న వైజాగ్ ఎస్పీ కృష్ణ దేవ్ (కేడి) (అడివి శేష్) ఒక దారుణమైన మర్డర్ కేసును డీల్ చేస్తాడు. ఆ తర్వాత నగరంలో మరిన్ని మర్డర్ లు జరుగుతాయి. ఆ మర్డర్ లు అన్నిటికి ఒక కనెక్షన్ ఉంటుందని అర్ధమవుతుంది.
ఇంతకీ చనిపోయిన వాళ్ళందరూ ఏ విధంగా కనెక్టెడ్? కేడి ఈ సీరియల్ మర్డర్స్ ను సాల్వ్ చేయగలిగాడా? కేడినే ముప్పతిప్పలు పెట్టిన ఆ నరహంతకుడు ఎవరు?
నటీనటులు:
అడివి శేష్ కు థ్రిల్లర్ కు అవినాభావ సంబంధం ఉంది. శేష్ చేసిన థ్రిల్లెర్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేడి పాత్రకు తగ్గ యాటిట్యూడ్ ను సరిగ్గా చూపించాడు శేష్. సినిమా అంతటా తన పెర్ఫార్మన్స్ కు వంకపెట్టడానికి లేదు.
సినిమాలో కీలక పాత్రలు చేసిన రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలీ ప్రసాద్ బాగా సపోర్ట్ చేసారు. మీనాక్షి చౌదరి కేడి కి లవర్ పాత్రలో కనిపిస్తుంది. ఆమె పర్వాలేదు. తనికెళ్ళ భరణి, పోసాని, హర్షవర్ధన్, సుహాస్ లు మరిన్ని సపోర్టింగ్ రోల్స్ లో కనిపిస్తారు.
సాంకేతిక వర్గం:
శైలేష్ కొలను మొదటి చిత్రం తరహాలోనే హిట్ 2 విషయంలో కూడా ఎక్కడా డీవియేషన్స్ లేకుండా కథలోకి వెళ్ళిపోయాడు. మహిళా సంఘాలు, సీరియల్ మర్డర్స్ కు ముడిపెట్టిన విధానం మెప్పిస్తుంది. సినిమాలో ఎక్కడా పాటలకు, కామెడీకు పెద్దగా స్కోప్ లేదు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు తగ్గట్లుగా సాగింది. థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన కంటెంట్ తో మెప్పిస్తుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. చిత్రమంతా డార్క్ టోన్ ను బాగా మైంటైన్ చేసారు. నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- అడివి శేష్ సెటిల్ పెర్ఫార్మన్స్
- చిత్ర నిడివి
- స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్:
- యావరేజ్ క్లైమాక్స్
- సెకండ్ హాఫ్ లో మిస్టరీ రివీల్ అయ్యే విధానం
విశ్లేషణ:
నెమ్మదిగా మొదలైన హిట్ 2, డీసెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన విధానం కూడా ఇంప్రెస్ చేస్తుంది. అయితే ఒక స్టేజ్ దాటాక సీరియల్ థ్రెడ్ అర్ధమయ్యాక చిత్రం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఏదేమైనా హిట్ 2 ఒక డీసెంట్ థ్రిల్లర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. హిట్ 3 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరో రివీల్ చేయడంతో హిట్ 2 ముగుస్తుంది.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5