భూమి మీద శతాబ్దాల క్రితమే అంతరించిపోయిన డైనోసార్లకు చెందిన గుడ్లు, గూళ్లు ఇప్పుడు లభించడం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. మధ్యప్రదేశ్ లోని నర్మదా నదీ తీరంలో ఇవి లభించాయి. వివరాల్లోకి వెళ్తే..
నర్మదా నదీ పరివాహక ప్రాంతంలోని బాగ్, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. వీటిలో పొడవాటి మెడ ఉండే శాఖాహారులైన టైటానోసార్ లకు చెందిన 256 గుడ్లు, గూళ్లు బయటపడ్డాయి. టైటానోసార్ల నివాసాలు కూడా గుడ్లు లభించిన చోటుకు దగ్గరగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గుడ్లు పెంకులతో ఉన్నాయని అన్నారు. పెంకు ఉండటానికి కారణాన్ని వారు వివరించారు.
పొదిగేందుకు అవకాశం లేనప్పుడు తల్లి తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకున్నాయని.. ఈక్రమంలో ఏర్పడి ఉండొచ్చని అన్నారు. ఈమేరకు పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్ లో ఢిల్లీ యూనివర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించినట్టు ప్రచురితమయ్యాయి. ఈ డైనోసార్లు దాదాపు 6.6కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద సంచరినట్టు పేర్కొన్నారు.