జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నిత్యం నెగెటివ్ ప్రచారం చేయడం కోసం బులుగు పార్టీ ఎంత ఖర్చు చేస్తోంది.?ఈ విషయమై మీడియా, రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
టీడీపీని వదిలేసి, పూర్తిగా జనసేన మీద బులుగు పార్టీ ఎందుకు ఫోకస్ పెడుతోంది. బులుగు పార్టీ కంటే, జనసేన పార్టీని రాజకీయ ప్రత్యర్థిగా బులుగు మీడియా ఎందుకు చూస్తోంది.? తెలుగునాట రాజకీయ, మీడియా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సోదరుడు నాగబాబుకి రాజ్యసభ టిక్కెట్టు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడితో బేరసారాలు ఆడుతున్నారంటూ తాజాగా ఓ దిక్కుమాలిన కథనం ‘వ్యభిచార పాత్రికేయం’ ద్వారా తెరపైకొచ్చింది.
రాజకీయాల్లో దిగజారుడుతనం చూస్తుంటాం. మీడియాలోనూ ఈ స్థాయి దిగజారుడుతనమా.? నిజానికి, పాత్రికేయ వ్యభిచారం అంటే, వ్యభిచార వృత్తిలో వున్నోళ్ళు కూడ సిగ్గు పడతారేమో.
ఒకవేళ నాగబాబుకి రాజ్యసభకు వెళ్ళాలనే ఆలోచన వుంటే, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నించే స్తోమతు ఆయనకు వుండదా.? వ్యక్తిగతంగా ఆయన ఆ ప్రయత్నాలు చేసుకోలేరా.? బీజేపీ నుంచి గతంలోనే రాజ్యసభ సీటు విషయమై జనసేన ముందుకు ప్రతిపాదనలొచ్చాయ్. అప్పుడు సైతం, జనసేన అధినేత ఆ ఆఫర్లను తిరస్కరించారు.
పోయి పోయి తెలుగుదేశం పార్టీని రాజ్యసభ సీటు విషయమై అడుక్కోవడమేంటి.? అసలు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితుల్లో వుందా.? అస్సలేమాత్రం ఇంగితం లేని పాత్రికేయమే బులుగు పాత్రికేయమైపోయిందిప్పుడు.!
ఈ తరహా ప్రచారాలతో జనసేన పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత లేకుండా చేయాలన్న దిక్కుమాలిన ఆలోచనలు చేయడం కంటే, వ్యభిచారం చాలా చాలా మేలన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. నెలవారీ పేమెంట్లు బులుగు పార్టీ నుంచి అందుతున్నంతమాత్రాన మరీ ఇంతలా దిగిజారిపోవాలా.?