Switch to English

ఓటు ఎవరికి వెయ్యాలి.? ఎందుకు వెయ్యాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

స్వాతంత్ర్య దినోత్సవం.. గణతంత్ర దినోత్సవం.. ఓటర్ల దినోత్సవం.. ఇలాంటి సందర్భాల్లో స్వాతంత్ర్యం సిద్ధించడం గురించీ, ప్రజాస్వామ్యం గురించీ, గణతంత్రం గురించీ మాట్లాడుకుంటుంటాం. ఇదొక నిరంతర ప్రక్రియ.

అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి.? ఎన్నికల వ్యవస్థ ఎలా తయారైంది.? రాజకీయం ఎలా భ్రష్టుపట్టిపోయింది.? వంటి అంశాలపై చర్చ జరగాల్సి వుంది. చర్చ అయితే జరుగుతూనే వుంది.. కానీ, జరగాల్సిన రీతిలో జరగకపోవడమే అసలు సమస్య.

ఎన్నికలు వస్తున్నాయ్.. వెళుతున్నాయ్.! ప్రభుత్వాలు మారుతూనే వున్నాయ్. పాత నీరు పోతోంది, కొత్త నీరు వస్తోంది. రాజకీయం మరింతగా భ్రష్ట్టుపట్టిపోతోంది. ఎన్నికల బరిలో నిలిచినవారిలో ఎవరికి ఓటెయ్యాలో తెలియని అయోమయం ఓటర్లలో నెలకొంటోంది. ఎవరికీ ఓటెయ్యలేని పరిస్థితి వస్తున్న దరిమిలా, ఏం చేయాలి.? అన్న అయోమయం నుంచి ఎవరో ఒకరికి గుద్దేసి చేతులు దులిపేసుకోవాల్సి వస్తోంది.

‘నోటా’ అనే ఆప్షన్ వున్నా, దానికి అస్సలు విలువ లేదు. చదువుకున్నోడు, మంచోడు ఎన్నికల బరిలో నిలవడం అనేది కనాకష్టంగా తయారైంది. ఒకటో, రెండో కేసులు కాదు.. పదో పదిహేనో కేసులు, అందులో హత్య కేసులు, అత్యాచార, హత్యాచార కేసులున్నోళ్ళు కూడా రాజకీయ నాయకులుగా చెలామణీ అయిపోతున్నారు.

అక్రమాస్తుల కేసులో జైళ్ళకు వెళ్ళినోళ్ళు ముఖ్యమంత్రులు అవుతోంటే, వాళ్ళని ఏ పోలీసు అధికారులైతే అరెస్టు చేస్తున్నారో, అదే పోలీసులు.. ఆ తర్వాత వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ తాలూకు గొప్పతనమనాలా.? పతనమనాలా.? ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ నాయకుడు, ఈ నాయకుడు అన్న తేడాల్లేవు.! అంతా ఒకటే కథ. కొంచెం ఎక్కువ, ఇంకొంచెం ఎక్కువ భ్రష్టత్వం.. అంతే తేడా.!

చదువుకున్న వ్యక్తి మీద కేసు నమోదైతే, ఉద్యోగానికి అనర్హుడన్న భావన వుంది. అలాంటప్పుడు, రాజకీయ నాయకుల మీద కేసులుంటే, ఎన్నికల్లో పోటీ చేయడానికే అనర్హులవ్వాలి కదా.? అన్న ప్రశ్న సామాన్యుల్లో బలంగా వినిపిస్తోంది.

ఓ పార్టీ నుంచి గెలిచి, ఇంకో పార్టీలోకి దూకెయ్యడం సర్వసాధారణమైపోయింది ఈ రోజుల్లో. అలాంటప్పుడు, ఓటర్లు ఎవరికి ఓటెయ్యాలి. ఎన్నికల సమయంలో ఓటర్లు దేవుళ్ళుగా కనిపిస్తారు.. ఆ తర్వాత మాత్రం, తమను గెలిపించిన ఓటర్లతో బంతాట ఆడేసుకుంటారు రాజకీయ నాయకులు.

ఇదీ ప్రజాస్వామ్యం కానే కాదు, రాజకీయ స్వామ్యమనాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ప్రశ్నించాల్సిన మేధావి వర్గం మౌనం దాల్చడమో, లేదంటే రాజకీయ పార్టీలకు.. నాయకులకు బానిసత్వం చేయడం వల్లనే ఈ దుస్థితి.

ఏదిఏమైనా ఓటుకి రేటు కట్టేసిన రాజకీయం ఇప్పుడు వికటాట్టహాసం చేస్తోంది. ఇంకా ప్రజాస్వామ్యంలోనే వున్నామంటూ అమాయకత్వంలో బతికేస్తున్నాం మనం.! కాదంటారా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...