Switch to English

అయ్యో ఫాఫం.. కొడాలి కష్టం పగవాడిక్కూడా రాకూడదే.!

91,427FansLike
56,277FollowersFollow

‘అమ్మాయిలు బట్టలేసుకునే డాన్సులు చేశారు.. అర్థనగ్నంగా డాన్సులేమీ చేయలేదు..’ అంటూ అసలు నిజాన్ని ఒప్పేసుకున్నారు మంత్రి కొడాలి నాని గుడివాడలో నడిచిన ‘కాసినో’ వ్యవహారంపై. అంతేనా, ఆ కాసినోలో కొడాలి నానిని కీర్తిస్తూ అతని అభిమానులు డాన్సులు చేయడంపైనా స్పందించారు. ‘చిరంజీవి పాట అక్కడ ప్లే చేస్తే, చిరంజీవి ఆ కాసినోని నిర్వహించినట్టా.?’ అని అమాయకంగా ప్రశ్నించేశారు.

వారెవ్వా.. కొడాలి నాని కవరింగ్ అదిరిపోయింది.. కానీ, ఆ కవరింగ్ కారణంగా ఆయన మరింతగా ఈ వ్యవహారంలో బుక్కయిపోయారు. అసలు ఆ కాసినోతో తనకు సంబంధం లేదని కొడాలి ఓ పక్క చెబుతూనే, ఆ కాసినోలో వైసీపీ జెండాలను పోలిన రంగులను ‘రూఫ్’గా వాడటంపైనా ‘ఒప్పుకోక’ తప్పలేదు.

వల్లభనేని వంశీకీ, కొడాలి నానికీ.. కాసినో నిర్వాహకులు కామన్ ఫ్రెండ్స్ అట. గుడివాడ మాత్రమే కాదు, పలు చోట్ల సదరు కామన్ ఫ్రెండ్స్ ఈ తరహా కాసినోలు నిర్వహించారట సంక్రాంతి నేపథ్యంలో. మరి, అవెందుకు వెలుగు చూడలేదంటే, ఆ ప్రశ్న ఏబీఎన్ రాధాకృష్ణను అడగాలంటూ పంచ్ డైలాగు పేల్చారు కొడాలి నాని.

అసలు కాసినో అంటే ఏంటి.? దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతి వుందా.? లేదా.? నిజానికైతే అనుమతి లేదు. పోలీసులు అలాంటివి ఎక్కడైనా జరిగితే, వాటిపై ఉక్కుపాదం మోపాలి. కానీ, అలాంటివి తమ తమ ప్రాంతాల్లో నిర్వహించకపోతే, ప్రజలు తమ ప్రజా ప్రతినిథుల్ని చవటలుగా భావిస్తారని మంత్రి కొడాలి నాని చెబుతుండడం గమనార్హం.

ప్రజల దృష్టిలో చవటలుగా మిగిలిపోవడం ఇష్టం లేక, నిబంధనలకు వ్యతిరేకంగా క్యాసినో కార్యకలాపాలకు ‘గ్రీన్ సిగ్నల్’ ప్రజా ప్రతినిథులు ఇచ్చేస్తుంటారన్నమాట. ఓ మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.? మంత్రి వ్యాఖ్యల్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని, ఎక్కడెక్కడ కాసినోలు జరిగాయో, వాటి తాట తియ్యాలి కదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్ లీక్‌… ఆమె ఎలిమినేట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి నాలుగవ ఎలిమినేషన్‌ గా ఆరోహి బయటకు వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఆమె బయటకి వచ్చేసింది....

కండోమ్స్ కూడా ఫ్రీ ఇవ్వాలా.. విద్యార్థినులతో ఐఏఎస్ ఆఫీసర్‌ దారుణ వ్యాఖ్యలు

బీహార్ కి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని హర్‌జోత్ కౌర్‌ ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తో అమ్మాయిలు ప్రభుత్వం ఉచితంగా సానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా చంటి - గీతు మధ్య జరిగిన...

రాశి ఫలాలు: శుక్రవారం 30 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి రా.10:41 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: విశాఖ ఉ.6:22 వరకు...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....