పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం
సూర్యోదయం: ఉ.6:16
సూర్యాస్తమయం: సా.5:20 ని.లకు
తిథి: కార్తీక శుద్ధ పాడ్యమి మ.1:39 ని.వరకు తదుపరి కార్తీక బహుళ విదియ
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: రోహిణి మ. 1:54 ని.వరకు తదుపరి మృగశిర
యోగం: సిద్ధం రా.11:07 ని. వరకు తదుపరి సాధ్యం
కరణం: కౌలవ మ.1:39 ని. వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం : ఉ.8:28 నుండి 9:13 ని. వరకు తదుపరి రా.10:30 నుండి 11:22 ని . వరకు
వర్జ్యం : సూర్యోదయం నుండి ఉ.7:27 ని.వరకు తదుపరి రా.6:41 నుండి 8:19 వరకు
రాహుకాలం: మ.3:00 ని. నుండి సా.4:30 గం.వరకు
యమగండం: ఉ.9:00 ని నుండి 10:30 గం .వరకు
గుళికా కాలం: ఉ.9:32 ని నుండి 10:55 ని.వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:12 ని.నుండి 6:00 ని.వరకు
అమృతఘడియలు: ఉ.10:40 నుండి 12:16 ని వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:55 నుండి మ.12:39 వరకు
ఈ రోజు (28-11-2023) రాశి ఫలితాలు
మేషం: కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక సమస్యలు వలన నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
వృషభం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులుంటాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
మిథునం: బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటకం: సన్నిహితుల నుంచి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు.
సింహం: ఇంటా బయట సమస్యలు నుండి బయట పడతారు. శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
కన్య: కీలక వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలుతప్పవు.
తుల: చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.
వృశ్చికం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
ధనస్సు: బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మకరం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో మార్గా వరోదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.
కుంభం: ఆర్థిక వ్యవహారాలలో మరింత ఒత్తిడి కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
మీనం: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల పరిష్కారమౌతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.