పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం
సూర్యోదయం: ఉ.5:29
సూర్యాస్తమయం: రా.6:24 ని.లకు
తిథి: జ్యేష్ఠ శుద్ధ అష్టమి పూర్తిగా
సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము:మఘ .రా.9:36 గం. వరకు తదుపరి పుబ్బ
యోగం: వ్యాఘాతం రా.6:22 ని. వరకు తదుపరి హర్షణం
కరణం:భధ్ర సా.6:11 ని.వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం:ఉ.5:29 నుండి 7:12 ని.వరకు
వర్జ్యం : ఉ.8:17 నుండి 10:04 వరకు
రాహుకాలం:ఉ.9:00 నుండి 10:30 గం.వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 ని.వరకు
గుళికా కాలం: ఉ.5:45 నుండి 7:22 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి 4:57 ని.వరకు
అమృతఘడియలు: సా.6:56 నుండి 8:42 గం.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:47 నుండి మ.12:39 వరకు
ఈరోజు (27-05-2023) రాశి ఫలితాలు
మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధనసహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం: బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట వ్యవహారాలు కలిసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. కొని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
మిథునం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం: సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కన్య: సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు.
తుల: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
ధనస్సు: బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
మకరం: మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.
కుంభం: మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
మీనం: అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.