Switch to English

Mahesh Babu: ‘మళ్ళీ పెళ్ళి’కి మహేష్ రివ్యూ ఏదీ.? ట్రోల్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,044FansLike
57,201FollowersFollow

Mahesh Babu: ఓ చిన్న సినిమా వచ్చింది. ఆ సినిమాకి సూపర్ స్టార్ నుంచి మద్దతు లభించింది. నిజానికి, మంచి విషయమే ఇది. చిన్న సినిమాలకు పెద్ద పెద్ద స్టార్లు ప్రచారం చేస్తే, ఆయా సినిమాలకు మార్కెట్ పెరుగుతుంది. కానీ, అది మంచి సినిమా అయితేనే.. ఆయా స్టార్ హీరోలకూ గౌరవం.

‘మేం ఫేమస్’ సినిమా గురించే చర్చ ఇప్పుడు. సినిమా వచ్చింది. ‘ఛత్.. ఇదేం సినిమా.?’ అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. యూ ట్యూబ్ షార్ట్ ఫిలిం కంటే దారుణం.. అంటున్నారు.

మరి, సూపర్ స్టార్ మహేష్‌బాబు, ఈ సినిమాని తాను చూశాననీ, చాలా బాగుందనీ ట్విట్టర్ రివ్యూ ఇవ్వడమేంటి.? ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ ట్వీట్ వేస్తే సరిపోయేదానికి, చిన్నపాటి రివ్యూలా ట్వీట్ చేసేశాడు సూపర్ స్టార్ మహేష్. దాంతో, అభిమానులే అవాక్కయ్యారు.

‘మహేషన్నా.. నీ స్థాయి తగ్గించుకోకు..’ అంటూ అభిమానులు, ఆ ట్వీటు చూసి వాపోయారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సినిమా తేడా కొట్టేసింది. ‘మహేష్ జడ్జిమెంట్ ఇంత వరస్ట్‌గా వుంటుందా.?’ అని ‘మేం ఫేమస్’ సినిమా చూసినోళ్ళు విమర్శిస్తున్నారు.

‘ఇకపై మహేష్ మాటల్ని నమ్మి ఇలాంటి సినిమాలకు రాకూడదు..’ అని అభిమానులే నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఏదో ఆబ్లిగేషన్ వల్ల మహేష్ ఆ ట్వీటు వేసి వుండొచ్చు. కానీ, ట్వీటు వేసే విషయంలో కాస్తంత జాగ్రత్త పడి వుండాల్సింది మహేష్.

అన్నట్టు, ‘వేరే సినిమాని ప్రోత్సహించావ్ సరే.. మీ మద్దతు వుందట కదా.? మీ అన్నయ్య నరేష్ సినిమాకి ఎందుకు అనుకూలంగా ట్వీటెయ్యలేదు.?’ అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. ‘మళ్ళీ పెళ్ళి’ సినిమాకి రివ్యూ కావాలంటూ విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో. పైగా, మహేష్ అభిమానులే ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా విషయంలో తమ అభిమాన హీరోని ట్రోల్ చేస్తున్నారు.

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర నటించిన ‘మళ్ళీ పెళ్ళి’ సినిమా కూడా నేడే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘మహేష్ మమ్మల్ని అంగీకరించాడు.. మా రిలేషన్ పట్ల సానుకూలంగా స్పందించాడు..’ అని నరేష్, పవిత్ర చెప్పుకున్నారు పలు ఇంటర్వ్యూల్లో.

సూపర్ స్టార్ కృష్ణ రెండో భార్య విజయ నిర్మల తనయుడే సీనియర్ నటుడు నరేష్. విజయ నిర్మలకి మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం నరేష్. ఆ నరేష్ విషయంలో మహేష్ అభిమానులెప్పుడూ సానుకూలంగా వుండరు. అలాంటిది. మూడో భార్యతో విడాకుల పంచాయితీ ఓ కొలిక్కి రాకుండానే, పవిత్ర నరేష్‌తో సహజీవనం మొదలు పెట్టిన నరేష్‌ని ఎలా మహేష్ అభిమానులు అంగీకరిస్తారు.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.

ఆ కారణంగానే మహేష్, ‘మళ్ళీ పెళ్ళి’కి అనుకూలంగా ట్వీటెయ్యలేదా.? అనీ ప్రశ్నిస్తున్నారు మరి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sreeleela: సమంత మిస్ చేసుకున్న ఛాన్స్ ని పట్టేసిన శ్రీలీల?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree Leela) టాలీవుడ్ లో జోరు చూపిస్తోంది. రవితేజ( Ravi Teja) నటించిన 'ధమాకా( Dhamaka)' హిట్ అవ్వడంతో...

‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు గెలుచుకున్న కుక్క.. స్టేజ్ మీదకెళ్ళి అవార్డు కూడా...

గతేడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది '777 చార్లీ'. కన్నడ దర్శకుడు కె కిరణ్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్...

Anasuya : పిక్ టాక్ : జబర్దస్త్‌ అందాల అనసూయ చీర...

Anasuya : జబర్దస్త్‌ యాంకర్‌ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ అనసూయ. ఇద్దరు పిల్లలు అయ్యి... వారు పెద్ద వారు అయిన తర్వాత...

Megastar Chiranjeevi: ఆ వార్తలను నమ్మొద్దు..క్యాన్సర్ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి

తాను క్యాన్సర్ బారిన పడినట్లు వస్తున్న వార్తలని మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi)ఖండించారు. ఈరోజు హైదరాబాద్లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిరు.. తను కొలనోస్కోపీ...

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై నుంచి తిరుపతికి...

Adipurush: అజయ్-అతుల్ ద్వయం బాలీవుడ్ లో ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరిలో నుండి సంగీత స్వరకర్త అతుల్ ఇప్పుడు ఒక...

రాజకీయం

Chiranjeevi: రైలు ప్రమాదంపై చిరంజీవి విచారం.. బాదితులను ఆదుకోవాలని అభిమానులకు పిలుపు

Chiranjeevi: నిన్న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్న సంగతి తెలిసిందే. 70 మందికి పైగా మృతి చెంది.. వందల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిన ఘోర దుర్ఘటనపై సర్వత్రా...

Janasena-YCP: వైసీపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన.!

Janasena-YCP: ఒకప్పటి జనసేన వేరు.! ఇప్పుడు జనసేన వేరు.! జనసైనికుల్లో చాలా చాలా మార్పు వచ్చింది గతంతో పోల్చితే. జనసైనికులంటే, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్ కళ్యాణ్‌ని సినిమా నటుడిగా అభిమానించే...

ఘోర రైలు ప్రమాదం.! ఎవరిది ఈ పాపం.?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. పది మందీ కాదు.. పాతిక మందీ కాదు.! దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో.! ఒకటి కాదు, రెండు...

Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 233 చేరిన మృతుల సంఖ్య

Train Accident: ఒడిశా లో మహావిషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాలేశ్వర్ లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరుకుంది. మరో 900 మందికి పైగా గాయపడ్డారు....

భార్య మీద కోపంతో నల్లపూసల దండ మింగేసిన భర్త.. తర్వాత ఏమైందంటే?

క్షణకావేశం విచక్షణని చంపేస్తుంది. ఆత్మహత్యలు, హత్యలు ఎక్కువ భాగం ఆ సమయంలో జరిగేవే. అలా ఓ వ్యక్తి ఆవేశంలో చేసిన పని అతని ప్రాణాల మీదకే తెచ్చింది. భార్య మీద కోపంతో ఓ...

ఎక్కువ చదివినవి

Train Accident: బాబోయ్ శుక్రవారం… 14 ఏళ్ల క్రితం ఇదే తరహా ఘటన

Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదం ( Coramandal Train Tragedy) ఘోర విషాదాన్ని నింపింది. కొన్ని నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఒకేసారి ఢీ కొట్టుకోవడంతో...

Bro: ‘బ్రో’ సినిమాలో ‘గుడుంబా శంకర్’ మాస్ సాంగ్?

Bro: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) కి ఫోక్ సాంగ్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఆయన సినిమాల్లో ఐటెం సాంగ్స్ రూపంలో ఇలాంటి పాటలు తరచుగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా...

Baharla Ha Madhumas: రీల్స్, యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఆ పాట..

Baharla Ha Madhumas: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడేది ట్రెండ్ అవుతుందో తెలీదు. కానీ.. సరైన సినిమా పాటలు, సిగ్నేచర్ స్టెప్స్, డైలాగ్స్ ఉంటే మాత్రం ఆకాశమే హద్దుగా వైరల్ అయిపోతుంది....

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు..

YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన...

Brazil: భార్యకు దక్కలేదని అందాల కిరీటాన్ని నేలకేసి కొట్టాడు.. వీడియో వైరల్

Brazil: భార్యకు అందాల కిరీటం (Crown) దక్కలేదని విజేతకు అలంకరించాల్సిన కిరీటాన్ని నేలకేసి కొట్టాడో వ్యక్తి. బ్రెజిల్లో (Brazil) ఓ అందాల పోటీ ఫైనల్లో ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా షాక్ కు...