Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 24 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.5:55
తిథి: భాద్రపద బహుళ తదియ ఉ.7:04 వరకు తదుపరి చవితి
సంస్కృతవారం: బృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: అశ్వని .ఉ.8:45 వరకు తదుపరి భరణి
యోగం: వ్యాఘాతం మ.3:01 వరకు తదుపరి హర్షణం
కరణం: భథ్రం ఉ.7:04 వరకు
వర్జ్యం: ఈ.5:53 నుండి 6:09 వరకు తదుపరి రా.7:14 నుండి 8:59 వరకు
దుర్ముహూర్తం: ఉ.8;18 నుండి 9:06 వరకు తదుపరి మ.12:21 నుండి 1:09 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:38 నుండి .9:08 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి తె.5:20 వరకు
అమృతఘడియలు:లేవు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:43 నుండి మ.12:32 వరకు

ఈరోజు. (24-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి బంధువులతో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి . కుటుంబ పెద్దల ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

మిథునం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

కర్కాటకం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

సింహం: కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది.

కన్య: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

తుల: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు.

మకరం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...