Switch to English

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి త్రిష. సినీ ప్రియులు.. ఆమె అభిమానులు చెన్నై అందంగా పిలుచుకుంటారు. ఇంతగా నటనలో.. అందంలో తనకుతానే సాటిగా ఉంది కనుకే కెరీర్ మొదలై 22ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆమెది స్టార్ స్టేటస్. దక్షిణాది భాషలన్నింటిలో సినిమాలు చేస్తూ తన స్టార్ డమ్ ఏంటో నిరూపిస్తోంది. పైగా.. అన్నీ అగ్ర హీరోల సరసనే. హీరోయిన్ ఇంత లాంగ్ కెరీర్ మాత్రమే కాదు.. స్టార్ స్టేటస్ కూడా రెండు దశాబ్దాలకు పైగా నిలుపుకుని బెంచ్ మార్క్ సెట్ చేసింది. నేడు ఆమె పుట్టినరోజు. సోషల్ మీడియాలో #HappyBirthdayTrisha ట్రెండింగ్ లో ఉంది.

స్కూల్ రోజుల్లో లాయర్ కావాలనుకుని.. కాలేజీ రోజుల్లో మోడలింగ్ వైపు అడుగులేసింది ఈ చెన్నై బ్యూటీ. అంతే.. తనదైన అందంతో 16ఏళ్ళకే ఏకంగా మిస్ చెన్నై టైటిల్ కూడా గెలుచుకుంది. మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. మొడలింగ్ వైపు వేసిన అడుగులతో పెప్సీ వంటి యాడ్స్ లో నటించింది. దీంతో వచ్చిన తొలి అవకాశం జోడీలో సిమ్రాన్ కు ఫ్రెండ్ క్యారెక్టర్. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. అయితే.. ఆమె అందానికి హీరోయిన్ గా వచ్చిన తొలి అవకాశం ‘నీ మనసు నాకు తెలుసు’. ఈ గుర్తింపుతో వచ్చిన అవకాశమే ‘వర్షం’. సినిమాలో త్రిష చిలిపితనం.. ఆటలు.. అప్పటి యూత్ ఫిదా అయిపోయారు. వర్షం అంటే ఇప్పటికీ త్రిష గుర్తొచ్చేలా మైమరిపించింది. వర్షం బ్లాక్ బస్టర్ తో నేటికీ తిరుగులేని స్టార్ డమ్ సంపాదించింది.

పూరి, కీర్తి, చిట్టి.. అంటూ తెలుగులో మెరిసిపోయింది. తమిళంలోనూ విపరీతమైన క్రేజ్. ఏకకాలంలో తెలుగు, తమిళంలో ఓదశలో నెం.1 హీరోయిన్ గా ఆధిపత్యం చెలాయించింది. పొన్నియన్ సెల్వంలోనే కాదు.. సినిమా ప్రమోషన్స్ లో సైతం అందంతో వెలిగిపోయింది. దీంతో మళ్లీ త్రిషను వరుస అవకాశాలు వరించాయి. సినిమా సినిమాకీ కొత్త హీరోయిన్ వస్తున్న రోజుల్లో కూడా చిరంజీవితో విశ్వంభర, కమల్ హాసన్ థగ్ లైఫ్, మోహన్ లాల్-రామ్, అజిత్-విదా ముయార్చి, టోవినో థామస్-ఐడెంటిటీ సినిమాలతో త్రిష డైరీ ఫుల్ బిజీ. గతేడాది తనపై వచ్చిన వివాదాలకూ ధీటుగా స్పందించింది త్రిష. చిరంజీవి సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు. తన నటన, అందంతో త్రిష మరింత పేరు ప్రఖ్యాతులు, విజయాలు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...