Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 18 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:30
సూర్యాస్తమయం : సా‌.5:59
తిథి: మాఘ బహుళ విదియ రా.10:53 వరకు తదుపరి తదియ
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము : పుబ్బ సా.5:14 వరకు తదుపరి ఉత్తర
యోగం: సుకర్మ రా.7:14 వరకు ధృతి
కరణం: తైతుల ఉ.10:55 వరకు తదుపరి గరజి
వర్జ్యం: రా.12:30 నుండి 2:07 వరకు
దుర్ముహూర్తం.:ఉ.8:50 నుండి 9:35వరకు తదుపరి మ.12:38 నుండి 1:23 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం:మ.3:00 నుండి సా.4:30 వరకు
గుళికా కాలం :ఉ.8:11 నుండి 9:37 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:08 నుండి ఉ.5:56 వరకు
అమృతఘడియలు: ఉ.10:40 నుండి మ.12:19 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి 12:53 వరకు

ఈరోజు (18-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం: చేపట్టిన పనులలో అవరోదాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి.

సింహం: చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు.

కన్య: నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

తుల: చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగవకాశాలు లభిస్తాయి విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం: ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి.

ధనస్సు: నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు.

మకరం: సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది.

కుంభం: చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం: ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...