Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 09 డిసెంబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,167FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం

సూర్యోదయం: ఉ.6:23
సూర్యాస్తమయం: సా.5:23 ని.లకు
తిథి: కార్తీక బహుళ ద్వాదశి రా.తె.5:18 ని.వరకు తదుపరి కార్తీక బహుళ త్రయోదశి
సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: చిత్త ఉ.9:15 వరకు తదుపరి స్వాతి
యోగం: శోభ రా.11:09 ని. వరకు తదుపరి అతిగండ
కరణం: కౌలవ సా.4:45 ని. వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం : ఉ.6:23 నుండి 7:51 ని. వరకు
వర్జ్యం : మ.3:10 ని . నుండి సా.4:42 ని‌. వరకు
రాహుకాలం: ఉ.9:00 గం. నుండి ఉ .10:30 ని.వరకు
యమగండం: మ.1:30 ని. నుండి 3:00 గం .వరకు
గుళికా కాలం: ఉ.6:38 ని నుండి 8:00 గం .వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:02 ని.నుండి 5:50 ని.వరకు
అమృతఘడియలు: రా.1:20 ని.నుండి తె.3:02 ని‌ వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:46 నుండి మ.12:30 వరకు

ఈరోజు (09-12-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. నిరుద్యోగులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు జీతాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృషభం: వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మిథునం: బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

కర్కాటకం: ప్రయాణాల్లో మార్గ అవరోధాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరు ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు.

సింహం: ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందువినోద ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

కన్య: ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.

తుల: సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అనుకున్న వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలలో రావలసిన అటువంటి అవకాశములు చివరి నిమిషంలో చేజారుతాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం: ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

కుంభం: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. బంధుమిత్రులు కొన్ని విషయాలను మీతో విభేదిస్తా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

పాడ్‌కాస్ట్‌లో దాగిన నేరాల కథ… జనవరి 23న ప్రైమ్ వీడియోలో ‘చీకటిలో’

శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ఒరిజినల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చీకటిలో’ జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై...

సాక్షిపై న్యాయ పోరాటం నుంచి ఎకనామిక్ విజన్ వరకు: లోకేష్ స్పష్టీకరణ

విశాఖపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...