Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 08 జూన్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,794FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: రా.6:28 ని.లకు
తిథి: జ్యేష్ఠ బహుళ పంచమి రా‌.10:49 ని. వరకు తదుపరి షష్ఠి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: శ్రవణం రా.10:59 ని.వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: ఐంద్రం రా.11:07 ని. వరకు తదుపరి వైధృతి
కరణం: కౌలవ మ‌.12:03 ని. వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: ఉ.9:48 నుండి 10:40 ని.వరకు తదుపరి మ.3:00 నుండి 3:52 వరకు
వర్జ్యం : ఉ.5:00 ని.నుండి 5:59 ని. వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 ని..వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 గం.వరకు
గుళికా కాలం: ఉ.9:00 ని. నుండి 10:37 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:08 నుండి 4:56 ని.వరకు
అమృతఘడియలు: మ.1:17 ని. నుండి 2:46 ని .వరకు
అభిజిత్ ముహూర్తం : మ.11:49 నుండి 12:41 వరకు

ఈరోజు (08-06-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృషభం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.

మిథునం : దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటకం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కన్య: మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూరప్రయాణ సూచనలున్నవి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

తుల: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగము అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

మకరం: ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

కుంభం: కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

మీనం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

సినిమా

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

రాజకీయం

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ప్రశాంత్ భూషణ్ తప్పుడు ట్వీట్.. నిజం తెలుసుకుంటే బెటర్..

విశాఖపట్నంలోని ఉర్సా క్లస్టర్ కు ఉచితంగా భూములు ఇచ్చారనే ఫేక్ ప్రచారంలో వైసీపీ బాగా బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

ఎక్కువ చదివినవి

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది....

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా వచ్చిన సినిమా అప్పట్లో కలెక్షన్ల ప్రభంజనం...

ప్రశాంత్ భూషణ్ తప్పుడు ట్వీట్.. నిజం తెలుసుకుంటే బెటర్..

విశాఖపట్నంలోని ఉర్సా క్లస్టర్ కు ఉచితంగా భూములు ఇచ్చారనే ఫేక్ ప్రచారంలో వైసీపీ బాగా బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్...

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసింది. ఆ తర్వాత...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...