పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం
సూర్యోదయం: ఉ 6:37
సూర్యాస్తమయం : సా.5:37
తిథి: పుష్య శుద్ధ షష్ఠి సా.3:40 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ సప్తమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : పూర్వాభాద్ర ప.11:25 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
కరణం:తైతుల సా.3:40వరకు
యోగం: వరీయన్ సా.4:46 వరకు తదుపరి పరిఘ
వర్జ్యం: రా.9:12 నుండి 10:50 వరకు
దుర్ముహూర్తం. ఉ.6:37 నుండి 8:06 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.6:52నుండి 8:14 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: లేదు
అభిజిత్ ముహూర్తం:12:00 నుండి 12:44 వరకు
ఈరోజు (08-01-2022) రాశి ఫలితాలు
మేషం: ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.
వృషభం: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది.దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.
మిధునం: మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. కుటుంబసభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు . వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.
కర్కాటకం: చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వృధా ఖర్చులు చేదాటుతాయి. ఇంటాబయటా బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.
సింహం: బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
కన్య: సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
తుల: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
ధనస్సు: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మకరం: చేపట్టిన పనులు మందగిస్తాయి. అదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి.
కుంభం: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది
మీనం: ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు
Kontakt eine Freizeitbeschäftigung oder Aktivität,
aber Spiele für cash gaben beginnend bis Show – kritische Casinos.