Switch to English

అతిథి దేవో భవ రివ్యూ: రొటీన్ డ్రామా

Movie అతిథి దేవోభవ
Star Cast ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు
Director పొలిమేర నాగేశ్వర్
Producer రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
Music శేఖర్ చంద్ర
Run Time 2 hr 13 Mins
Release జనవరి 07, 2022

హీరోగా పూర్తిగా క్రేజ్ కోల్పోయిన ఆది సాయికుమార్ నటించిన అతిథి దేవో భవ ఈరోజు ప్రేక్షకుల. పొలిమేర నాగేశ్వర్ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. మరి ఈ చిత్రంతోనైనా ఆది సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

కథ:

అభయ్ (ఆది సాయికుమార్) కు మోనోఫోబియా సిండ్రోమ్ అనే వింత జబ్బు ఉంటుంది. తను వైష్ణవి (నువేక్ష)ను ప్రేమిస్తాడు. అయితే కథలో ట్విస్ట్ మాత్రం అజయ్ (ఆదర్శ్ బాలకృష్ణ) వల్ల వస్తుంది. అభయ్ తన ఫ్లాట్ లో వైష్ణవితో ఉండగా అభయ్ ను అదుపులోకి తీసుకుంటాడు.

ఎందుకు అజయ్, అభయ్ ను అరెస్ట్ చేసాడు? మనోఫోబియా సిండ్రోమ్ అనేది అభయ్ కు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అనేవి సినిమాను ముందుకు తీసుకెళ్ళాయి.

నటీనటులు:

మోనోఫోబియా సిండ్రోమ్ తో ఇబ్బంది పడుతోన్న యువకుడిగా ఆది నటన డీసెంట్ గా సాగింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆది బాగా చేసాడు. హీరోయిన్ గా చేసిన నువేక్ష చూడటానికి క్యూట్ గా ఉంది. తన పాత్రను కూడా చక్కగా పోషించింది. ఆదితో తన కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇది రొమాంటిక్ సీన్స్ లో ఉపయోగపడింది.

హీరో తల్లిగా నటించిన రోహిణి తనకు అలవాటైన పాత్రలో ఈజీగా చేసుకెళ్ళిపోయింది. సప్తగిరి, ఆదర్శ్ బాలకృష్ణ, అదుర్స్ రఘు తన పాత్రలను బాగానే పోషించారు.

సాంకేతిక నిపుణులు:

మోనోఫోబియా సిండ్రోమ్ చుట్టూ కథను నడిపించాలన్న పొలిమేర నాగేశ్వర్ రావు ఐడియాను మెచ్చుకోవచ్చు. దాన్ని ప్రేమ కథతో ముడిపెట్టిన విధానం కూడా చక్కగా కుదిరింది. అయితే సీన్ ఆర్డర్ ను సరిగ్గా రాసుకోవడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. తన ప్రెజంటేషన్ లో ఇంపాక్ట్ మిస్ అయింది. దాని వల్ల కథలో రావాల్సినంత డెప్త్ రాలేదు.

శేఖర్ చంద్ర ఆడియో పరంగా పూర్తిగా న్యాయం చేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా సాగింది. అమర్ నాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే. ఆయన రిచ్ ఫ్రేమింగ్, సెటప్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బడ్జెట్ కు తగ్గట్లుగా ఉన్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • లీడ్ పెయిర్ మధ్యన కెమిస్ట్రీ

నెగటివ్ పాయింట్స్:

  • సరైన డిటైలింగ్ లేకపోవడం
  • అతుకుల బొంత స్క్రీన్ ప్లే

విశ్లేషణ:

మొత్తంగా చూసుకుంటే అతిథి దేవో భవ ఒక రెగ్యులర్ రొమాంటిక్ డ్రామా. ఆది, నువేక్ష తమ తమ పాత్రలకు న్యాయం చేసినా కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం మూలంగా సినిమాపై ఉన్న ఇంప్రెషన్ అంతా పోతుంది. అసలు సినిమాలో సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ అన్నదే లేకపోవడం మేజర్ మైనస్.

రేటింగ్: 1.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

జాతీయగీత ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది.

ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ విరివిగా వాడుతున్న కాలంలో విద్యార్థులు, యువ‌త వాటికే స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి స్వాతంత్య్రం తెచ్చిన మ‌హా యోధుల గురించి, దేశ‌మంతా ఒక‌టే అని...

సర్కారు వారి పాట.. డెడ్ లైన్ దగ్గరపడుతోందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట మొదట సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఆర్ ఆర్ ఆర్ కోసం ఏప్రిల్ 1కి వాయిదా వేసిన విషయం...

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

మెగాస్టార్ సరసన శృతి హాసన్?

ఒకసారి సీనియర్ హీరో పక్కన నటించడానికి హీరోయిన్ ఎస్ చెప్పాక ఇక అందరు సీనియర్ హీరోల సినిమాల్లో నటింపజేయాలని చూస్తారు. ప్రస్తుతం శృతి హాసన్ విషయంలో అదే జరుగుతోంది. క్రాక్ తో బ్లాక్...

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించినట్టు.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. తప్పేముంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా...