Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’ అంటాడు వేణుమాధవ్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్థాయిని చెప్పే డైలాగ్ అది. చిరంజీవి చేతి స్పర్శ కోసం ఇప్పటికీ ఎదురుచూసే అభిమానులు లక్షల్లోనే. హీరో శ్రీకాంత్ (Srikanth) కూడా చిరంజీవి అభిమాని. శ్రీకాంత్ ఏకంగా చిరంజీవితోనే నటించే అదృష్టాన్ని పొందాడు.
ఇప్పుడు మరోసారి అదే ఆనందం పొందారు. తన ప్రతి పుట్టినరోజుకి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు అందుకునే శ్రీకాంత్ కు అదృష్టం ఎదురొచ్చింది. మార్చి 23 శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి శ్రీకాంత్ ఇంటికే చిరంజీవి వెళ్లడం విశేషం. శ్రీకాంత్ తో కేక్ కట్ చేయించి మరచిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. అనంతరం శ్రీకాంత్, తనయుడు రోషన్ తో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇదీ చిరంజీవి అంటే.. అని అభిమానులు సంతోషపడుతున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే.